Share News

Hyderabad: బయట పరదా.. లోపల పనులు.. సీజ్‌ చేసినా ఆగని అక్రమ నిర్మాణాలు

ABN , Publish Date - Dec 11 , 2024 | 01:18 PM

మహదేవపురం(Mahadev puram) కాలనీలో అక్రమ భవన నిర్మాణాలకు అడ్డూ అదుపులేకుండాపోతోంది. అధికారులు బిల్డింగ్‌లను సీజ్‌ చేసిన వారం రోజుల్లోపే మళ్లీ నిర్మాణ పనులు మొదలుపెడుతున్నారు. భవన యజమానుల నుంచి అధికారులు స్లాబ్‌కొక ధర చొప్పున డబ్బులు దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Hyderabad: బయట పరదా.. లోపల పనులు.. సీజ్‌ చేసినా ఆగని అక్రమ నిర్మాణాలు

- పట్టించుకోని టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు

హైదరాబాద్: మహదేవపురం(Mahadev puram) కాలనీలో అక్రమ భవన నిర్మాణాలకు అడ్డూ అదుపులేకుండాపోతోంది. అధికారులు బిల్డింగ్‌లను సీజ్‌ చేసిన వారం రోజుల్లోపే మళ్లీ నిర్మాణ పనులు మొదలుపెడుతున్నారు. భవన యజమానుల నుంచి అధికారులు స్లాబ్‌కొక ధర చొప్పున డబ్బులు దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహదేవపురం సీ-బ్లాక్‌, డీ-బ్లాక్‌లలో ఈ అక్రమ అంతస్తుల నిర్మాణాలకు అధికారులే ఆద్యం పోస్తున్నారని స్థానికులు తెలుపుతున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ప్రభుత్వాలు మారితే తెలంగాణ తల్లి మారుతుందా..


పత్రికల్లో వచ్చిన కథనాలతో తూతూ మంత్రంగా స్పందిస్తూ భవనాలను సీజ్‌ చేస్తున్నారు. ఆ తర్వాత యజమానులతో బేరసారాలు సాగించి అభయమిస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు భవనానికి అదనపు అంతస్తులు నిర్మిస్తే నోటీసులు ఇవ్వడమే మా పని కూల్చివేయడం మా పని కాదని చేతులు దులుపుకుంటున్నారు. దీంతో భవన నిర్మాణ యజమానులు యదేచ్ఛగా జీ+2 అనుమతులు తీసుకుని జీ+5 వరకు నిర్మిస్తున్నా చోద్యం చూస్తున్నారని అధికారుల తీరుపై మండిపడుతున్నారు.


ముందుగా టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బంది కాలనీలలో ఎక్కడెక్కడ నూతన నిర్మాణాలు చేపడుతున్నారో రెక్కీ నిర్వహించి నిర్మాణాలు చేపడుతున్న యజమానులకు ఏ అధికారిని కలిస్తే పని సులువుగా అవుతుందో సలహాలు, సూచనలిస్తూ వారే ముందుండి నడిపిస్తున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఎవరైనా ఫిర్యాదు చేస్తే అధికారులతో నోటీసులు ఇప్పిస్తాం, అటు తర్వాత వారిని మేనేజ్‌ చేసి మీరు యదేచ్ఛగా కట్టుకోవచ్చని అభయమిస్తున్నారు. దీనివల్ల రాబోయే రోజుల్లో కాలనీలో డ్రైనేజీ, తాగునీటి సమస్య మొదలువుతుందని మహదేవపురం కాలనీ వాసులు తెలుపుతున్నారు. కాలనీ వాసులే గతంలో అక్రమ నిర్మాణాలపై అధికారులకు ఫిర్యాదు చేశారంటే ఈ దందా కొనసాగుతుందో అర్ధమవుతోంది.


మహదేవపురం సీ-బ్లాక్‌, డీ-బ్లాక్‌లలో కొన్ని భవనాలను టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు సీజ్‌ చేశారు. సీజ్‌ చేసిన తెల్లారే యజమాని భవనానికి అంటించిన బోర్డును తీసేసి తనపని తాను సాఫీగా చేసుకుంటూ, భవనానికి సున్నం కూడా వేయించాడు.

మహదేవపురం చౌరస్తాకు సమీపంలో ఉన్న భవనాన్నీ సీజ్‌ చేశారు. కానీ బయట సీజ్‌ బోర్డు అలాగే కన్పిస్తున్నా లోపల మాత్రం మేస్త్రీలు నిర్మాణ పనులను సాఫీగా చేసుకుంటున్నారు. అలాగే సీ బ్లాక్‌లో విచ్చలవిడిగా 4 నుంచి 8 వరకు జీ+2 అనుమతులు తీసుకుని జీ+4, జీ+5 వరకు నిర్మిస్తున్నారు. ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ ఎదురుగా ఉన్న భవనం ఎటువంటి సెట్‌బ్యాక్‌ లేకుండా అదనపు అంతస్తులు నిర్మిస్తున్నా పట్టించుకోవడంలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమంగా వెలుస్తున్న భవనాలను అరికట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు.


చర్యలు తీసుకుంటాం

మహాదేవపుంరలో సీజ్‌ చేసిన భవనాల్లో పనులు జరిగితే యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకొని, కేసులను నమోదు చేస్తామన్నారు. భవన యజమానులు ఎంతవరకు అనుమతులు తీసుకున్నారో, దాని ప్రకారమే నిర్మాణాలు చేపట్టాలి.

- మల్లారెడ్డి, డిప్యూటీ కమిషనర్‌


ఈవార్తను కూడా చదవండి: విగ్రహాల మీద ఉన్న ధ్యాస విద్యార్థుల మీద లేదా?

ఈవార్తను కూడా చదవండి: తినే మాంసంలో.. యాంటీబయాటిక్స్‌

ఈవార్తను కూడా చదవండి: సింగరేణి సీఎండీ రేసులో శైలజా రామయ్యర్‌!

ఈవార్తను కూడా చదవండి: ఆన్‌లైన్‌లో భద్రాద్రి ముక్కోటి దర్శన టికెట్లు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 11 , 2024 | 01:18 PM