Hyderabad: ఉప్పల్‌లో బీజేపీకి కలిసొచ్చిన గులాబీ ఓట్లు.. భారీగా క్రాస్ ఓటింగ్
ABN, Publish Date - Jun 05 , 2024 | 01:20 PM
ఉప్పల్ నియోజకవర్గం(Uppal Constituency)లో శాసనసభ ఎన్నికలతో పోల్చితే లోక్‌సభ ఎన్నికల్లో పరిస్థితులు పూర్తిగా తలకిందులయ్యాయి. గతేడాది నవంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలోని ఆరు నియోజకవర్గాలతో పాటు ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు భారీ ఆదిక్యతను ఇచ్చిన నగర ఓటర్లు లోక్‌సభ ఎన్నికలు వచ్చే సరికి అదే ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్: ఉప్పల్ నియోజకవర్గం(Uppal Constituency)లో శాసనసభ ఎన్నికలతో పోల్చితే లోక్‌సభ ఎన్నికల్లో పరిస్థితులు పూర్తిగా తలకిందులయ్యాయి. గతేడాది నవంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలోని ఆరు నియోజకవర్గాలతో పాటు ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు భారీ ఆదిక్యతను ఇచ్చిన నగర ఓటర్లు లోక్‌సభ ఎన్నికలు వచ్చే సరికి అదే ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. శాసనసభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థికి సుమారు 50వేల మెజారిటీ కట్టబెట్టి బండారి లక్ష్మారెడ్డి(Bandari Lakshmareddy)ని ఎమ్మెల్యేగా గెలిపిస్తే నేడు లోక్‌సభ ఎన్నికల్లో అదే ఓటర్లు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్(Etala Rajender)కు ఒక్క ఉప్పల్ నియోజకవర్గంలోనే 53,325 ఓట్ల మెజారిటీ వచ్చింది.
ఇదికూడా చదవండి: Hyderabad: వామ్మో.. మళ్లీ దోచేశారుగా.. ఈసారి రూ.15.86 లక్షలకు టోకరా..
ఓటర్లు శాసనసభ ఎన్నికల్లో స్థానిక అంశాలకు ప్రాధాన్యతనిచ్చి బీఆర్ఎస్ను గెలిపిస్తే.. లోక్‌సభ ఎన్నికలకు వచ్చే సరికి ప్రధాని మోదీ ప్రభావానికి లోనై, జాతీయ అంశాలనే ఎజెండాగా బీజేపీ అభ్యర్థి ఈటలకు పట్టం కట్టారు. లోక్‌సభ ఎన్నికల్లో గులాబీ ఓట్లన్ని కమలం వైపు మొగ్గు చూపాయని బీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఉప్పల్ అసెంబ్లీ పరిధిలో మొత్తం 5,40,052 ఓట్లు ఉండగా 2,61,634 ఓట్లు పోలయ్యాయి. వాటిలో బీజేపీకి 1,30,105 ఓట్లు, కాంగ్రెస్ కు 76,870ఓట్లు, బీఆర్‌ఎ్‌సకు 48,954 ఓట్లు వచ్చాయి.
ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News
Updated Date - Jun 05 , 2024 | 01:20 PM