Hyderabad: హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు భారీగా పయనం..
ABN, Publish Date - May 11 , 2024 | 10:23 AM
సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు(Bus Stands, Railway Stations) ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. వరుస సెలవులు, ఎన్నికల నేపథ్యంలో వేలమంది జనం ఊరి బాట పట్టడంతో మహాత్మాగాంధీ, జూబ్లీబస్టాండ్లు(Mahatma Gandhi and Jubilee Bus Stands) ప్రయాణికులతో శనివారం రద్దీగా మారాయి.
- నేడు, రేపు రద్దీ మరింత పెరిగే అవకాశం
హైదరాబాద్ సిటీ: సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు(Bus Stands, Railway Stations) ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. వరుస సెలవులు, ఎన్నికల నేపథ్యంలో వేలమంది జనం ఊరి బాట పట్టడంతో మహాత్మాగాంధీ, జూబ్లీబస్టాండ్లు(Mahatma Gandhi and Jubilee Bus Stands) ప్రయాణికులతో శనివారం రద్దీగా మారాయి. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు బస్టాండ్లకు క్యూ కట్టడంతో రెగ్యులర్ సర్వీసులతో రాత్రి 9గంటల వరకు ఏపీ, తెలంగాణ(AP, Telangana) జిల్లాలకు 300కు పైగా ప్రత్యేకసర్వీసులు వెళ్లాయని రంగారెడ్డి జోన్ ఆర్‌ఎం రాజు తెలిపారు. ముందస్తు రిజర్వేషన్‌కు 450 ప్రత్యేక బస్సులు పెట్టామని, రద్దీ పెరిగితే మరిన్ని సర్వీసులు సిద్ధంగా ఉంచామని తెలిపారు. శనివారం ప్రయాణికుల రద్దీ భారీగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు ఆర్‌ఎం తెలిపారు. తెలంగాణ, ఏపీ ప్రాంతాలకు 11, 12 తేదీల్లో 1,500 ప్రత్యేక బస్సులు నడిపేలా ప్లాన్ చేసినట్లు తెలిపారు.
ఇదికూడా చదవండి: బీజేపీ, బీఆర్‌ఎస్‌కు ప్రశ్నించే హక్కులేదు: పొన్నం
ఎంజీబీఎస్ నుంచి రోజు నడిపే 3,500 బస్సులతో పాటు అదనంగా మరో 500 బస్సులు నడుపుతున్నారు. ఎల్‌బీనగర్ నుంచి 300 ప్రత్యేక బస్సులు కోదాడ, నల్గొండ, విజయవాడ ప్రాంతాలకు, ఉప్పల్ నుంచి 300 స్పెషల్ సర్వీసులు తొర్రూర్, నర్సంపేట, వరంగల్ ప్రాంతాలకు, ఆరాంఘర్ నుంచి 200 స్పెషల్ బస్సులను నారాయణపేట, అచ్చంపేట, కల్వకుర్తి, కర్నూల్‌కు, ఎంజీబీఎస్ నుంచి 500 బస్సులు విజయవాడ, కర్నూల్, ఖమ్మం(Vijayawada, Kurnool, Khammam), ఒంగోల్ సెక్టార్‌కు నడుపుతున్నారు. జేబీఎస్ నుంచి 200 ప్రత్యేక బస్సులు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాలకు నడుపుతున్నారు. ప్రయాణికుల రద్దీ పెరిగితే దానికి అనుగుణంగా సర్వీసులు పెంచుతామని ఆర్టీసీ ఈడీ పురుషోత్తం తెలిపారు. శుక్రవారం ఎంజీబీఎస్ స్పెషల్ బస్సుల్లో రద్దీని ఆర్టీసీ అధికారులతో కలిసి ఈడీ పరిశీలించారు. బస్టాండ్లు, ముఖ్య కూడళ్లలో శని, ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఆర్టీసీ ఉన్నతాధికారులు, సూపర్‌వైజర్లు విధుల్లో ఉంటారని తెలిపారు.
ఇదికూడా చదవండి: Elections: తెలుగు రాష్ట్రాలకు 2 వేల బస్సులు.. 58 స్పెషల్ ట్రైన్స్
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News
Updated Date - May 11 , 2024 | 10:23 AM