Share News

Hyderabad: అపరిశుభ్రత.. కృత్రిమ రంగులు

ABN , Publish Date - Nov 13 , 2024 | 07:03 AM

నగరంలోని పలు ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ ఫుడ్‌సేఫ్టీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. మై జీహెచ్‌ఎంసీ మొబైల్‌ యాప్‌, ఎక్స్‌ ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా మంగళవారం బంజారాహిల్స్‌, కింగ్‌కోఠి, ఆబిడ్స్‌, న్యూమలక్‌పేట, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లోని హలీం, ఇతర ఆహార పదార్థాలు విక్రయించే హోటళ్లు, డెయిరీ, బేకరీలను పరిశీలించారు.

Hyderabad: అపరిశుభ్రత.. కృత్రిమ రంగులు

- కొనసాగుతున్న ఫుడ్‌సేఫ్టీ అధికారుల తనిఖీలు

- చాలాచోట్ల కాలం చెల్లిన వస్తువుల వినియోగం

హైదరాబాద్‌ సిటీ: నగరంలోని పలు ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ ఫుడ్‌సేఫ్టీ అధికారుల(GHMC Food Safety Officers) తనిఖీలు కొనసాగుతున్నాయి. మై జీహెచ్‌ఎంసీ మొబైల్‌ యాప్‌, ఎక్స్‌ ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా మంగళవారం బంజారాహిల్స్‌, కింగ్‌కోఠి, ఆబిడ్స్‌, న్యూమలక్‌పేట(Banjara Hills, Kingkothi, Abids, New Malakpet), బంజారాహిల్స్‌ ప్రాంతాల్లోని హలీం, ఇతర ఆహార పదార్థాలు విక్రయించే హోటళ్లు, డెయిరీ, బేకరీలను పరిశీలించారు. మెజార్టీ హోటళ్లలో అపరిశుభ్ర వాతావరణం నెలకొందని, నాణ్యతా ప్రమాణాలతో ఆహార పదార్థాల తయారీ లేదని, కాలం చెల్లిన వస్తువులు, సింథటిక్‌ రంగులు వినియోగిస్తున్నట్లు గుర్తించారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: అనుమానం.. తీసింది ప్రాణం


చాయ్‌లో రంగు వచ్చేలా గ్రాన్యూర్స్‌, బేకరీల్లో గడువు ముగిసిన వస్తువులను గుర్తించారు. పలు నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపిన ఫుడ్‌ సేఫ్టీ(Food Safety) అధికారులు ప్రమాణాలు పాటించాలని సూచించారు. అలాగే అల్వాల్‌ సర్కిల్‌లోని పలు చికెన్‌, మటన్‌ సెంటర్లను పశువైద్యాధికారి తనిఖీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి మాంసం విక్రయిస్తున్న వ్యాపారులకు జరిమానాలు విధించారు.


తనిఖీలు నిర్వహించిన హోటళ్లు : కేకే షా హలీం, ఎంఎం హౌస్‌ చికెన్‌ హలీం, కేకే హౌస్‌ హలీం, లాలావబ్‌ హోటల్‌, లక్కీ ఫైవ్‌ రెస్టారెంట్‌ (ఆబిడ్స్‌), కృష్ణా ఇడ్లి (హనుమాన్‌ టెక్డీ), మాజెస్టీ స్వీట్స్‌ అండ్‌ నమ్‌కిన్‌, తారా జ్యూస్‌వరల్డ్‌, హసన్‌బాబు మియా డెయిరీ, కేక్‌ వరల్డ్‌ బేకర్స్‌ అండ్‌ స్వీట్స్‌, ఎంఎస్‌ బాయి కి చాయ్‌, వావ్‌ మోమో ఫుట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, సంతోష్‌ బంజార రెస్టారెంట్‌.


ఈవార్తను కూడా చదవండి: ‘లగచర్ల' దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నాం

ఈవార్తను కూడా చదవండి: హనుమకొండ ఆస్పత్రిలో ఎలుకల స్వైరవిహారం

ఈవార్తను కూడా చదవండి: ఫిలింనగర్‌లో యువతి ఆత్మహత్య

ఈవార్తను కూడా చదవండి: ఇదేనా నీ పాలన.. రేవంత్‌పై హరీష్ కామెంట్స్

Read Latest Telangana News and National News

Updated Date - Nov 13 , 2024 | 07:03 AM