ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu:హైదరాబాద్‌లో సీఎం చంద్రబాబుకు అపూర్వ స్వాగతం

ABN, Publish Date - Jul 05 , 2024 | 07:58 PM

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు (CM Chandrababu Naidu) తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు.ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఏపీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నాక తొలిసారి హైదరాబాద్‌కు చంద్రబాబు వచ్చారు.

CM Chandrababu Naidu

బేగంపేట్: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు (CM Chandrababu Naidu) తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు.ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం చంద్రబాబు తొలిసారి నగరానికి వచ్చిన నేపథ్యంలో పార్టీ నేతలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌లో చంద్రబాబుకు పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు స్వాగతం పలికారు.


ఎయిర్‌పోర్ట్ వద్ద భారీ గజమాలతో సీఎం చంద్రబాబును టీటీడీపీ నేతలు సత్కరించారు. అభిమానులు, క్యాడర్‌కు సీఎం చంద్రబాబు అభివాదం చేశారు. బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ నుంచి జూబ్లీహిల్స్ నివాసం వరకు భారీ ర్యాలీ తీశారు. పసుపు తోరణాలు, స్వాగత ఫ్లెక్సీలతో చంద్రబాబుకు తెలుగు తమ్ముళ్లు స్వాగతం పలికారు. వర్షంలోనే చంద్రబాబు ర్యాలీ కొనసాగుతోంది. ఈ సందర్భంగా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

Updated Date - Jul 05 , 2024 | 07:59 PM

Advertising
Advertising