ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nagarjuna : నాగార్జున - కొండా సురేఖ కేసులో మరో కీలక పరిణామం

ABN, Publish Date - Dec 12 , 2024 | 01:36 PM

మంత్రి కొండా సురేఖపై ప్రముఖ నటుడు నాగార్జున దాఖలు చేసిన క్రిమినల్‌ పరువు నష్టం దావాపై నాంపల్లిలోని ప్రజా ప్రతినిదుల కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. నాగార్జున తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతో అక్కినేని నాగార్జున కుటుంబం మానసికంగా కుంగిపోయిందని అన్నారు.

హైదరాబాద్: తెలంగాణ అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖపై (Minister Konda Surekha) సినీ న‌టుడు అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) వేసిన పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో ఇవాళ(గురువారం) విచారణ జరిగింది. నాగార్జున తరపున వాదనలను సీనియర్ కౌన్సిల్ అశోక్ రెడ్డి వినిపించారు. ఈరోజు కోర్టుకు హజరవ్వలి అంటూ మంత్రి కొండా సురేఖకు కోర్టు నోటీసులు పంపించింది. మంత్రి కొండా సురేఖ తరపున ఆమె న్యాయవాది కోర్టుకు హాజరయ్యారు. కొండా సురేఖ హాజరు కావడం లేదు అంటూ న్యాయవాది మరో డేట్ తీసుకున్నారు. ఈ కేసును ఈ నెల 19కు వాయిదా వేసింది. అక్కినేని నాగార్జున పరువు నష్టం పిటిషన్‌పై నాoపల్లి స్పెషల్ కోర్టు విచారణ చేపట్టింది. ఈరోజు వ్యక్తిగతంగా హాజరుకావాలని కొండా సురేఖకు గతంలో నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలాలను కోర్టు రికార్డు చేసింది.


కాగా.. నాగార్జున తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ‘కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతో అక్కినేని నాగార్జున కుటుంబం మానసికంగా కుంగిపోయింది. ఆమె వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి. ఆమెపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలి’ అని కోరారు. ఇందుకు సుప్రియ సాక్ష్యాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుంది.


మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్

మంత్రి కొండా సురేఖకు నాంపల్లిలోని ప్రజా ప్రతినిదుల కోర్టులో బిగ్ షాక్ తగిలింది. అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోవడానికి మాజీ మంత్రి కేటీఆర్‌ కారణమంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారాన్ని రేపాయో అందరికీ తెలిసిందే. మంత్రి వ్యాఖ్యలను అక్కినేని నాగార్జున తీవ్రంగా ఖండించారు.


పిటిషన్ తరుపు న్యాయవాది వాదనలకు న్యాయస్థానం ఏకీభబించింది. మంత్రి కొండా సురేఖ మీద నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టు కేసు నమోదు చేసింది. నాగార్జున వేసిన పిటిషన్‌ను కాగ్నిజెన్స్‌లోకి కోర్టు తీసుకుంది. మంత్రి కొండా సురేఖపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. CC నెంబర్ 490/2024, 356BNS యాక్ట్ కింద కొండా సురేఖపై కేసు నమోదు చేసింది. సురేఖకు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. డిసెంబర్‌ 12వ తేదీన వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది.

కారణమిదే..

ప్రముఖ నటులు అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ కారణమంటూ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. మంత్రి వ్యాఖ్యలను అక్కినేని నాగార్జున తీవ్రంగా ఖండించారు. సినీ ఇండస్ట్రీ మొత్తం మంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టింది. చివరకు కొండా సురేఖ వ్యాఖ్యలపై నాంపల్లి కోర్టును నాగార్జున ఆశ్రయించారు. క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు (గురువారం) నాంపల్లి కోర్టులో పిటిషన్ విచారణ జరిగింది. ప్రొసిజర్ ప్రకారం పిటిషనర్ వాంగ్మూలాన్ని న్యాయస్థానం రికార్డు చేసింది. నాగార్జున స్టేట్‌మెంట్‌ తర్వాత సాక్షుల స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేసింది.


నాగార్జున కుటుంబం కుంగిపోయింది..

‘‘కొండ సురేఖ నాగార్జునపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. ఆ తర్వాత ట్విట్టర్‌లో క్షమాపణ కోరుతూ పోస్ట్ చేసింది. ట్విట్టర్‌లో మంత్రి కొండా సురేఖ పెట్టిన పోస్ట్‌ను కోర్ట్ ముందు నాగార్జున తరుపు న్యాయవాది చదివి వినిపించారు. నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ, మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లయితే బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను, అన్యద భావించవద్దని కొండా సురేఖ ట్వీట్ చేసింది. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ఇలాంటి కామెంట్స్ చేయడం సరైంది కాదు. కచ్చితంగా కొండా సురేఖ క్రిమినల్ చర్యలకు అర్హురాలు. ఈ కామెంట్స్‌తో నాగార్జున కుటుంబం మానసికంగా ఎంతో కుంగిపోయారు’’ అని నాగార్జున తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు.


నాగార్జున ఏమన్నారంటే..

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఆరోపణలు గుప్పిస్తూ.. అక్కినేని కుటుంబాన్ని ప్రస్తావించి మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై హీరో అక్కినేని నాగార్జున స్పందించారు. కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని ప్రకటించారు. ‘‘రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను, మీ ప్రత్యర్థుల్ని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను’’ అని నాగార్జున అన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. బాధ్యతగల మంత్రి పదవిలో ఉండి.. తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్ఠను దెబ్బతీసేలా నిరాధారమైన, అవాస్తవ వ్యాఖ్యలు చేసిన ఆమెపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని అక్కినేని నాగార్జున కోరారు.


ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న కొండా సురేఖ

మరోవైపు.. తన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగిన నేపథ్యంలో.. ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు మంత్రి కొండా సురేఖ ప్రకటించిన విషయం తెలిసిందే. ‘‘అనుకోని సందర్భంలో.. అనుకోకుండా ఓ కుటుంబంపై చేసిన వాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా. కేటీఆర్‌ నన్ను కించపరిచే విధంగా మాట్లాడారు. ఆ మాటలతో వేదనకు గురై ఆయన గురించి వాఖ్యలు చేసే క్రమంలో అనుకోకుండా నాగార్జున కుటుంబం గురించి మాట్లాడా. ఆ వాఖ్యలను నేను వెనక్కి తీసుకుంటున్నా. కానీ కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యల విషయంలో మాత్రం వెనక్కు తగ్గేది లేదు’’ అని కొండా సురేఖ స్పష్టం చేశారు.తాను వ్యాఖ్యలు చేసిన తర్వాత ఎక్స్‌, ఇతర సామాజిక మాధ్యమాల్లో ఆ కుటుంబం ఆవేదనతో చేసిన పోస్టులు చూసి తనకు బాధ అనిపించిందని, ఆ కుటుంబాన్ని తన వాఖ్యలు నొప్పించాయని తెలిసి బాధపడ్డానని పేర్కొన్నారు. తాను పడిన బాధ వాళ్లు పడకూడదనే ఉద్దేశంతో.. తన వాఖ్యలను వెనక్కి తీసుకుంటూ ఎక్స్‌లో పోస్టు చేశానని తెలిపారు. కేటీఆర్‌ తనను మరింత రెచ్చగొడుతున్నారని ఆమె మండిపడ్డారు. ‘‘కేటీఆర్‌కు నేను క్షమాపణ చెప్పడమేంటని.. ఆయనే నాకు క్షమాపణలు చెప్పాలి’’ అని డిమాండ్‌ చేశారు. దొంగే ‘దొంగా దొంగా’ అన్నట్టుగా కేటీఆర్‌ ప్రవర్తన ఉందని.. ఆయన తనపై పెట్టించిన పోస్టులన్నింటినీ తొలగించాలని దుయ్యబట్టారు. తన కంటే ముందు.. మంత్రి సీతక్కపై ఇంకా ఘోరంగా ట్రోల్‌ చేశారని ఆవేదన వెలిబుచ్చారు. మహిళలను ట్రోల్‌ చేయొద్దని బీఆర్‌ఎస్‌కు హితవు పలికిన ఆమె.. ‘‘కేటీఆర్‌ నీకు మహిళలు పనికిమాలిన వాళ్లలా కనిపిస్తున్నారా? మీ కుటుంబ సభ్యులే మహిళలా? నీ నోరు ఏ యాసిడ్‌తో కడగాలి?’’ అంటూ మంత్రి కొండా సురేఖ నిప్పులు చెరిగారు.

Updated Date - Dec 12 , 2024 | 01:45 PM