ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bandi Sanjay: కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలి

ABN, Publish Date - Sep 15 , 2024 | 07:37 PM

తెలంగాణ పోరాట యోధులను ‘ఫొటో ఎగ్జిబిషన్’ లో వీక్షించడం ఆనందంగా ఉందని కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరూ ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించాలని కోరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలది అధికారంలో ఉన్నప్పుడు ఒకమాట...లేనప్పుడు మరోమాట అని విమర్శించారు.

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం కాదు... తెలంగాణ ప్రజా వంచన దినోత్సవం జరుపుకోవాలని కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శలు చేశారు. పరేడ్ మైదానంలో ఈరోజు(ఆదివారం) తెలంగాణ పోరాట యోధులకు సంబంధించిన ‘ఫొటో ఎగ్జిబిషన్’ ను బండి సంజయ్ ప్రారంభించారు. అనంతరం యువకులతో కలసి బండి సంజయ్ కాసేపు క్రికెట్ ఆడారు.


ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ... తెలంగాణ పోరాట యోధులను ‘ఫొటో ఎగ్జిబిషన్’ లో వీక్షించడం ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరూ ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించాలని కోరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలది అధికారంలో ఉన్నప్పుడు ఒకమాట...లేనప్పుడు మరోమాట అని విమర్శించారు. తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తే తామూ భాగస్వాములమవుతామని బండి సంజయ్ తెలిపారు.


తెలంగాణ ప్రజలను హింసించిన రజాకార్ల పార్టీతో కాంగ్రెస్ నేతలు అంటకాగుతారా? అని ప్రశ్నించారు. ‘‘జై పాకిస్తాన్, జై పాలస్తీనా’’ అని నినదించిన మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీని పొగుడుతారా? అని విమర్శించారు. కాంగ్రెస్ దుర్మార్గాలకు పరాకాష్ట ఇదని మండిపడ్డారు. తెలంగాణకు విముక్తి కల్పించిన మహనీయుడు సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అని కొనియాడారు. పటేల్ కాంగ్రెస్ నేత అయితే... తెలంగాణ విమోచన దినోత్సవాలు ఎందుకు జరపడం లేదు? అని బండి సంజయ్ ప్రశ్నించారు.

Updated Date - Sep 15 , 2024 | 07:41 PM

Advertising
Advertising