ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Phone Tapping Case: ‘కొండా సురేఖపై కోర్టుకు వెళ్తా’.. ఫోన్ ట్యాపింగ్‌పై కేటీఆర్ రియాక్షన్

ABN, Publish Date - Apr 02 , 2024 | 11:48 AM

Telangana: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతోనే తమ ఫోన్‌లను ట్యాపింగ్ చేశారంటూ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో సంచలనం రేపుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ వార్తలపై కేటీఆర్ స్పందిస్తూ కాంగ్రెస్ నేతలు, మంత్రిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అవసరమైతే కోర్టుకు వెళ్తానంటూ హెచ్చరించారు. ‘‘నాపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన ఇద్దరు కాంగ్రెస్ నేతలు, మంత్రి కొండా సురేఖ పై కోర్టుకు వెళ్తా.. న్యాయపరంగా నాపై చేస్తున్న అబద్ధపు ఆరోపణలు ఎదుర్కొంటా’’ అని తెలిపారు.

హైదరాబాద్, ఏప్రిల్ 2: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) ఆదేశాలతోనే తమ ఫోన్‌లను ట్యాపింగ్ చేశారంటూ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో సంచలనం రేపుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping Case) వార్తలపై కేటీఆర్ స్పందిస్తూ కాంగ్రెస్ నేతలు, మంత్రిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అవసరమైతే కోర్టుకు వెళ్తానంటూ హెచ్చరించారు. ‘‘నాపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన ఇద్దరు కాంగ్రెస్ నేతలు, మంత్రి కొండా సురేఖ పై కోర్టుకు వెళ్తా.. న్యాయపరంగా నాపై చేస్తున్న అబద్ధపు ఆరోపణలు ఎదుర్కొంటా’’ అని తెలిపారు.

నిరాధారమైన, మతిలేని ఆరోపణలు చేసిన ఇద్దరు కాంగ్రెస్ నేతలు మంత్రి కొండా సురేఖ, కేకే మహేందర్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో లీగల్ నోటీసులు.. పరువు నష్టం దావాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. వాస్తవాలను సరి చూసుకోకుండా... ఇలాంటి వార్తలను ప్రచురించే మీడియా సంస్థలకు కూడా లీగల్ నోటీసులు పంపిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.

Dharmana Prasada Rao: ఎవరికి ఓటేస్తారని ఎవరిని అడిగినా చంద్రబాబుకే అంటున్నారు


ఇదీ సంగతి...

కాగా.. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్‌ కేసు ఎంతటి దుమారాన్ని రేపుతుందో అందరికీ తెలిసిందే. ఈ కేసులో తవ్వే కొద్దే అనేక సంచనల విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులో ఎస్‌ఐబీ డీఎస్పీ ప్రణీత్‌రావు, మరో ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు భుజంగరావు, తిరుపతన్నను అరెస్ట్ అయ్యారు. అలాగే ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ టి.ప్రభాకర్‌రావు ఏ1 నిందితుడిగా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్‌పై కేసు నమోదైన వెంటనే ఆయన అమెరికా వెళ్లిపోయారు. ప్రభాకర్ ఆదేశాల మేరకే హార్డ్ డిస్కులను ప్రణీత్‌రావు ధ్వంసం చేసినట్లు విచారణలో నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం వాటిని రికవరీ చేసిన పోలీసులు.. డిస్కుల నుంచి సమాచారాన్ని రిట్రీవ్ చేసే పనిలో పడ్డారు.

AP Schools: స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం


మరోవైపు ప్రణీత్ రావుతో పాటు మాజీ అధికారి రాధాకిషన్‌ రావును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలు బయటపెట్టారు. బీఆర్‌ఎస్‌ కోసం పోలీసులు డబ్బును తరలించడం.. ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన నగదును సీజ్‌ చేయడం వరకు ప్రభాకర్‌రావు ‘స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌’ విధులను రాధాకిషన్‌ వివరించినట్లు రిమాండ్‌ రిపోర్టు స్పష్టం చేస్తోంది. పదవీ విరమణ చేసిన ప్రభాకర్‌రావును ఇంటెలిజెన్స్‌ చీఫ్‌(ఓఎస్‌డీ)గా నియమించడం గత ప్రభుత్వ పెద్దల వ్యూహాత్మక చర్య అని రాధాకిషన్‌రావు పేర్కొన్నట్లు దర్యాప్తు అధికారులు రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు వెల్లడించారు.

కేసీఆర్ స్పందన ఎలా ఉండబోతుందో?

ఈ క్రమంలో కేటీఆర్‌ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు బీఆర్‌ఎస్‌లో తీవ్ర కలవరాన్ని రేపుతున్నాయి. అవి నిరాధారమైన ఆరోణలని కేటీఆర్ చెప్పినప్పటికీ ఈ వ్యవహారనికి సంబంధించి పార్టీ అధినేత కేసీఆర్ నుంచి ఎలాంటి స్పందన ఉండబోతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి...

AP Elections: ఎన్నికల ముందు వైసీపీకి మరో బిగ్ షాక్..

Ramdas: అన్నాడీఎంకేకు ఊపిరి పోసింది మేమే..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Apr 02 , 2024 | 12:39 PM

Advertising
Advertising