ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Telangana: కాంగ్రెస్‌పై కేటీఆర్ సంచలన ఆరోపణలు..

ABN, Publish Date - Jul 09 , 2024 | 12:10 PM

కాంగ్రెస్(Congress) ప్రభుత్వం తీరుపై బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్)KTR) తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. పార్టీ ఫిరాయింపులపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని..

KTR

హైదరాబాద్, జులై 09: కాంగ్రెస్(Congress) ప్రభుత్వం తీరుపై బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్)KTR) తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. పార్టీ ఫిరాయింపులపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని.. ఇప్పుడు వలసలను ప్రోత్సహించేది కూడా కాంగ్రెస్ పార్టీనే అని విమర్శించారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని.. ఇప్పుడు ఆ హామీలనే మర్చిపోయిందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వాటినీ విస్మరించారన్నారు. డిసెంబర్ 9వ తేదీనే రుణ మాఫీ చేస్తామని ప్రకటించారని.. ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు.


కాంగ్రెస్ ప్రభుత్వం తాను ఇచ్చిన ఆరు గ్యారెంటీలను మర్చిపోయి.. ఆరుగరు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలను చేర్చుకుందన్నారు. చేరికలను ప్రోత్సహిస్తూ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని విమర్శించారు కేటీఆర్. గోవా, కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుందని చెప్పుకుంటున్న రాహుల్ గాంధీ.. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తమ పార్టీలోకి చేర్చుకుంటున్నారని విమర్శించారు. మణిపూర్‌లో ఎమ్మెల్యే పార్టీ ఫిరాయిస్తే.. ఆ ఎమ్మెల్యేని సుప్రీంకోర్టు డిస్‌క్వాలిఫై చేసిందని కేటీఆర్ గుర్తు చేశారు. ఎవరైనా ఎమ్మెల్యే, ఎంపీ పార్టీ ఫిరాయిస్తే వారిని డిస్ క్వాలిఫై అయ్యేలా చట్టం తీసుకురావాలని రాహుల్ గాంధీ చెప్పారని గుర్తు చేశారు. పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చూపిస్తారు కానీ.. ఆ రాజ్యాంగాన్ని ఫాలో అవ్వరంటూ కేటీఆర్ విమర్శలు గుప్పించారు.


పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలకు ఎన్ని కోట్లు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. ఢిల్లీలో కూడా కాంగ్రెస్ రాజ్యాంగం ఉల్లంఘనకు పాల్పడుతున్న అంశాన్ని చెప్తామన్నారు. అసెంబ్లీ స్పీకర్.. పార్టీ మారిన ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోకపోతే తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. కాంగ్రెస్‌లో చేరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డాడని అన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫిరాయింపులపై స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామని.. రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేస్తామని కేటీఆర్ తెలిపారు.


Also Read:

రోగ నిరోధక శక్తిని పెంచే 5 బెస్ట్ ఫుడ్స్..

నివ్వెరపోయే అంశాలు వెలుగులోకి!

అప్పుడే మొదలుపెట్టేశారే..!

For More Telangana News and Telugu News..

Updated Date - Jul 09 , 2024 | 12:11 PM

Advertising
Advertising
<