ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

BRS MLA'S: హైకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హర్షం

ABN, Publish Date - Sep 09 , 2024 | 03:23 PM

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఈ విషయంపై బీఆర్ఎస్ పార్టీ హై కోర్టులో ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత పిటిషన్ వేసింది. ఈరోజు(సోమవారం) తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా కీలక తీర్పు వెలువరించింది. అయితే తెలంగాణ హైకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఈ విషయంపై బీఆర్ఎస్ పార్టీ హై కోర్టులో ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత పిటిషన్ వేసింది. ఈరోజు(సోమవారం) తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా కీలక తీర్పు వెలువరించింది. అయితే తెలంగాణ హైకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


ALSO READ:CM Revanth Reddy: ఐఐహెచ్‌టీని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. కీలక వ్యాఖ్యలు

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు అద్భుతమైన తీర్పు ఇవ్వటాన్ని స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో ఇన్సెంటివ్స్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారని ఆరోపణలు చేశారు. సోమవారం నాడు తెలంగాణ భవన్‌లో పాడి కౌశిక్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.


ALSO READ:TG News: 4కోట్ల మోసాలకు పాల్పడిన రాజస్థాన్ ముఠా అరెస్ట్

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ డబుల్ స్టాండ్ ఏంటి అని ప్రశ్నించారు. హిమాచల్ ప్రదేశ్‌లో ఒకలా... తెలంగాణలో మరోలా కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేశారు. తెలంగాణలో ఇన్సెంటివ్స్ ఇచ్చి పార్టీలో చేర్చుకున్నారని ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి క్యారెక్టర్ లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ సబ్ రీజనల్ పార్టీగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి అవినీతి సొమ్ముతో పది మంది ఎమ్మెల్యేలను రూ.1000 కోట్లు పెట్టి కొన్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఒక్క నెలలో హైదరాబాద్ రోడ్ల మీద ఖైరతాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను ఉరికిస్తామని పాడి కౌశిక్‌రెడ్డి మాస్ వార్నిగ్ ఇచ్చారు. హైకోర్టు తీర్పు బీఆర్ఎస్ పార్టీకి విజయమని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.


అనర్హత వేటు విషయంలో కాలయాపన చేయొద్దు: ఎమ్మెల్యే వివేకానంద గౌడ్

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ అన్నారు. తెంగాణ అసెంబ్లీ స్పీకర్ స్వతంత్రంగా వ్యవహరించి.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరారు. స్పీకర్ మీద తమకు పూర్తి విశ్వాసం ఉందని వివేకానంద గౌడ్ తెలిపారు.


కాంగ్రెస్‌కు ఢిల్లీలో ఒక విధానం తెలంగాణలో మరో విధానమా అని ప్రశ్నించారు. అనర్హత వేటు విషయంలో కాలయాపన చేస్తే అపహస్యం కాక తప్పదని విమర్శలు చేశారు. మూడు స్థానాలకు ఉప ఎన్నికలు రాబోతున్నాయని స్పష్టం చేశారు. ముగ్గురు ఎమ్మెల్యేలతో మిగతా వారిపై కూడా నిర్ణయం తీసుకుని వేటు వేయాలని ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి...

TG News: నిన్న అదృశ్యమైన బాలుడు.. నీటి గుంటలో పడి మృతి

Mahesh kumar: ప్రతీ హామీ అమలు చేసి తీరతాం

Hyderabad: పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసులో హైకోర్టు కీలక తీర్పు..

Kolkata Doctor Case: కోల్‌కతా వైద్యురాలి కేసులో సీబీఐకి సుప్రీంకోర్ట్ కీలక ఆదేశాలు

Read Latest Telangana News

Updated Date - Sep 09 , 2024 | 03:35 PM

Advertising
Advertising