ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

BRS MLAs: చెరో 8 సీట్లు గెలిచి తెలంగాణకు 8 పైసలు కూడా తీసుకురాలేదు

ABN, Publish Date - Jul 24 , 2024 | 10:54 AM

Telangana: బడ్జెట్‌లో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మరోసారి మొండిచేయి చూపడం పట్ల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహంవ్యక్తం చేశారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు మాట్లాడారు. కాంగ్రెస్ , బీజేపీ చెరో 8 సీట్లు గెలిచి తెలంగాణకు 8 పైసలు కూడా తీసుకొని రాలేదని ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించారు.

BRS MLAs

హైదరాబాద్, జూలై 24 : బడ్జెట్‌లో (Budget 2024) తెలంగాణకు (Telangana) కేంద్ర ప్రభుత్వం (Central)Government) మరోసారి మొండిచేయి చూపడం పట్ల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహంవ్యక్తం చేశారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు మాట్లాడారు. కాంగ్రెస్ , బీజేపీ చెరో 8 సీట్లు గెలిచి తెలంగాణకు 8 పైసలు కూడా తీసుకొని రాలేదని ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించారు. బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర నిధులు ఇవ్వకుండా అనేక ఇబ్బందులు పెట్టిందని... యినా స్వశక్తితో కేసీఆర్ (Former CM KCR) తెలంగాణను అభివృద్ధి చేశారన్నారు.

TS Assembly: కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్... ఏ విషయంలో అంటే?


10 సంవత్సరాల నుంచి ఒక్క పైసా ఇవ్వడం లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Redd) అనేక వాగ్ధానాలు చేశారని.. ఇప్పుడు కొత్త నాటకానికి తెరలేపారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీ కేంద్రమంత్రులను కలవడం జరిగిందన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేస్తామని కొత్త నాటకానికి తెరలేపారని వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ కుట్రలను ఎదుర్కోవడం బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదన్నారు. రెండు జాతీయ పార్టీలు తెలంగాణకు అన్యాయం చేశాయన్నారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వాళ్ళ హక్కులు కోసం మాట్లాడారని.. మరి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం ఎందుకు అడగలేదని ఎమ్మెల్యే కేపీ వివేకానంద ప్రశ్నించారు.

TS Assembly Session: ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు... బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన


ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

కేంద్రప్రభుత్వం పెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగిందని ఎమ్మెల్యే పాడికౌశిక్ రెడ్డిన్నారు. ‘‘ఒక్కసారి ఆలోచన చేయండి. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు 15వేల కోట్ల రూపాయలు ఇచ్చి తెలంగాణాబకు ఒక్క రూపాయ ఇవ్వకపోవడం బాధాకరం’’ అని అన్నారు. రెండు జాతీయ పార్టీల ఎంపీలను ఇక్కడ నుంచి గెలిపిస్తే ఒక్క రూపాయ తీసుకొరాలేకపోయారని విమర్శించారు. కేసీఆరే తెలంగాణకు శ్రీరామరక్ష అని చెప్పుకొచ్చారు. దీనిపై కాంగ్రెస్, బీజేపీ పార్టీని అసెంబ్లీలో నిలదీస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారంటీలపైనా నిలదీస్తామని తెలిపారు. ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారని.. ఎక్కడ చేశారని ప్రశ్నించారు. సిగ్గులేకుండా పేపర్ యాడ్ ఇచ్చుకుంటున్నారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి...

Budget Highlights : ఏపీ హ్యాపీ..

TS Assembly: కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్... ఏ విషయంలో అంటే?

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 24 , 2024 | 10:56 AM

Advertising
Advertising
<