ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KTR: తెలంగాణ అన్నీ రంగాల్లో తిరోగమిస్తోంది: కేటీఆర్..

ABN, Publish Date - Dec 15 , 2024 | 04:15 PM

తెలంగాణ ఆర్థికాభివృద్ధి తెలిపేందుకు రవాణా శాఖ ఆదాయం ఒక ముఖ్యమైన సూచీ అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రజల ఆర్థిక పరిస్థితులు బాగుంటే బైకులు, కార్లే కాక ఇతర భారీ వాహనాల అమ్మకాలు, రిజిస్ట్రేషన్లలో వృద్ధి కనిపిస్తుందని ఆయన చెప్పారు.

BRS Working President KTR

హైదరాబాద్: తెలంగాణ (Telangana) రాష్ట్రం అన్నీ రంగాల్లో తిరోగమిస్తోందని బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. కేసీఆర్ పాలనలో పదేళ్ల పాటు రాష్ట్రం అద్భుతంగా పురోగమించిందని ఆయన గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం నేడు సీఎం రేవంత్ రెడ్డి అనుభవరాహిత్యం, అసమర్థత, అవినీతి పాలన కలగలిసి రాష్ట్రం తిరోగమిస్తోందని కేటీఆర్ అన్నారు. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ప్రస్తావిస్తూ కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.


కాంగ్రెస్ విఫలమైంది..

తెలంగాణ ఆర్థికాభివృద్ధి తెలిపేందుకు రవాణా శాఖ ఆదాయం ఒక ముఖ్యమైన సూచీ అని కేటీఆర్ చెప్పారు. ప్రజల ఆర్థిక పరిస్థితులు బాగుంటే బైకులు, కార్లే కాక ఇతర భారీ వాహనాల అమ్మకాలు, రిజిస్ట్రేషన్లలో వృద్ధి కనిపిస్తుందని ఆయన చెప్పారు. కానీ తెలంగాణలో నేడు రిజిస్ట్రేషన్లు తగ్గి, ఆదాయం తిరోగమనంలో ఉందని ఆయన చెప్పుకొచ్చారు. పొరుగున ఉన్న ఐదు రాష్ట్రాలూ ఈ ఏడాది రవాణా శాఖ ఆదాయంలో 8 నుంచి 32 శాతం వృద్ధిని నమోదు చేశాయని కేటీఆర్ తెలిపారు. కానీ తెలంగాణ ఒక్కటే గతేడాది కంటే తక్కువ వృద్ధిని నమోదు చేయడం రాష్ట్రంలోని విఫల ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోందని మాజీ మంత్రి అన్నారు.


రేవంత్ రెడ్డి ఉద్దేశం అదే..

సీఎం రేవంత్ రెడ్డి పాలన గాలికొదిలేసి కక్షసాధింపు చర్యలకే పూర్తి సమయం కేటాయించారని ఆరోపించారు. అలాంటప్పుడు ఫలితాలు ఇలా కాక మరెలా ఉంటాయంటూ ఆయన మండిపడ్డారు. సీఎం రేవంత్‌ రెడ్డి మానసికస్థితి రోజురోజుకూ దిగజారుతోందని మాజీ మంత్రి కేటీఆర్ చురకలు అంటించారు. బ్యాగు నిండా నోట్ల కట్టలతో పట్టుబడి జైలు జీవితం అనుభవించిన తర్వాత, అందరూ అదే అనుభవించాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నారని కేటీఆర్ చెప్పారు.


జైలుకు పంపిస్తారా?

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన పథకంపైన, తమ కంపెనీ కార్యకలాపాలపైన ఆ పథకం ప్రభావాన్ని వ్యక్తపరిచినందుకు ఎల్ అండ్ టీ సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ని జైలుకు పంపిస్తానంటూ రేవంత్ రెడ్డి మాట్లాడటాన్ని కేటీఆర్ ఖండించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన సంస్థల అధిపతులను జైలుకు పంపిస్తానంటూ ముఖ్యమంత్రి బెదిరింపులకు పాల్పడటం ఏంటని మాజీ మంత్రి ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో చేసిన వ్యాఖ్యలు దిగజారుతున్న ఆయన మానసిక స్థితికి అద్దం పడుతున్నట్లు కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఇలాంటి నిర్లక్ష్యమైన వ్యాఖ్యలతో పరిశ్రమలకు ఆయన ఏ సందేశం పంపుతున్నారని ప్రశ్నించారు. ఇదేనా రాహుల్ గాంధీ దేశంలో పెట్టుబడులను ఆకర్షించడానికి తమ పార్టీ ముఖ్యమంత్రులకు నేర్పించిన గొప్ప వ్యూహం అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Bhatti Vikramarka: తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు: భట్టి విక్రమార్క..

KCR: ఆమెరికాకు మాజీ సీఎం కేసీఆర్ !

Kalvakuntla Kavitha:పైసల కోసం వెళ్లినోడు నాయకుడా?

Updated Date - Dec 15 , 2024 | 04:16 PM