ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG NEWS: జీవో 29పై అనవసర అపోహలు సృష్టిస్తున్నారు

ABN, Publish Date - Oct 19 , 2024 | 06:44 PM

బీఆర్ఎస్ నేతలు రెచ్చగొట్టి వివాదాలు సృష్టిస్తున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో 29పై అనవసర అపోహలు సృష్టిస్తున్నారని చెప్పారు. కొంతమంది రాజకీయ నేతలు 33,383 మంది అభ్యర్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం చేస్తున్న పనిని అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. కోర్టు దిక్కరణకు పాల్పడుతున్నారని అన్నారు.

హైదరాబాద్; గత పదేళ్లుగా గ్రూప్ -1 పరీక్ష నిర్వహించలేదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం నియమాకాలను భర్తీ చేస్తుందని వివరించారు.డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాలు లభించాయన్నారు. జీవో 29పై అనవసర అపోహలు సృష్టిస్తున్నారని చెప్పారు. ఇవాళ(శనివారం)గాంధీభవన్‌లో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ....బీఆర్ఎస్ నేతలు రెచ్చగొట్టి వివాదాలు సృష్టిస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


జీవో29 వల్ల 3,800 మందికి ఎక్కువగా మెయిన్స్ రాసే అవకాశం దక్కిందని చెప్పారు. రిజర్వేషన్లలో అన్యాయం ఉంటే కోర్టులు ఊరుకుంటాయా? సింగల్ బెంచ్, డివిజన్ బెంచ్ ఓకే చేశాయి కదా అని తెలిపారు. కొంతమంది రాజకీయ నేతలు 33,383 మంది అభ్యర్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం చేస్తున్న పనిని అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. కోర్టు దిక్కరణకు పాల్పడుతున్నారని అన్నారు.


గ్రూప్ -1 అభ్యర్థుల జీవితాలతో ఆడుకోవాలని చూస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. గ్రూప్ -1 మెయిన్స్ కు 1:100 కావాలని అడుగుతున్న వారే ఈ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. డీఎస్సీ పరీక్షను కూడా ఇలాగే అడ్డుకోవాలని చూశారని..11 వేల ఉద్యోగాలు ఇచ్చామని గుర్తుచేశారు. గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు యధావిధిగా జరుగుతాయని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

Komatireddy: కేటీఆర్‌పై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డ మంత్రి

CM Chandrababu: అమరావతి రాజధాని నిర్మాణం 2.0 ప్రారంభం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 19 , 2024 | 06:46 PM