ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chandrababu:టీటీడీపీలో పాత కమిటీల రద్దు

ABN, Publish Date - Aug 10 , 2024 | 06:20 PM

తెలంగాణలో భవిష్యత్‌లో అధికారంలోకి రావడమే లక్ష్యమని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) తెలిపారు. త్వరలో గ్రామస్థాయి నుంచి పార్టీ నిర్మాణంపై ఫోకస్ పెడతానని అన్నారు.

CM Chandrababu Naidu

హైదరాబాద్: తెలంగాణలో భవిష్యత్‌లో అధికారంలోకి రావడమే లక్ష్యమని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని చంద్రబాబు అన్నారు. అవసరమైతే మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తానని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మనోభావాలే తమకు ముఖ్యమని అన్నారు. రేవంత్ రెడ్డి మార్క్ బాగుందని ప్రశంసించారు. తెలంగాణ అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నామని ఉద్ఘాటించారు. విజన్ 2020 అంటే తనను 420 అని విమర్శించారని చంద్రబాబు అన్నారు.

తెలుగు ప్రజలు ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటున్నానని అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం తాను మాట్లాడితే విమర్శించే వారు ఉన్నారని.. అయిన కచ్చితంగా అడుగుతానని అది తన బాధ్యత అని పేర్కొన్నారు. త్వరలో గ్రామస్థాయి నుంచి పార్టీ నిర్మాణంపై ఫోకస్ పెడతానని అన్నారు. 15 రోజుల్లో తెలంగాణలో సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. యువకులు, బీసీలకు పెద్దపీట వేస్తామని అన్నారు. సభ్యత్వ నమోదు ప్రక్రియ తర్వాతనే టీటీడీపీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని చంద్రబాబు వెల్లడించారు.


టీటీడీపీలో పాత కమిటీల రద్దు..

టీటీడీపీ ముఖ్యనాయకుల సమావేశంలో చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీపీలో పాత కమిటీలను రద్దు చేస్తూ చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. పార్లమెంట్, అసెంబ్లీ సెగ్మెంట్‌ల వారిగా ఉన్న కమిటీలను రద్దు చేశారు. ఏపీ, తెలంగాణలో ఒకేసారి కొత్త కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. అనంతరమే తెలంగాణ టీడీపీ నూతన అధ్యక్షుడి ఎంపిక చేస్తారని సమాచారం. ఏపీ తరహాలోనే కష్టపడి పని చేయాలని కార్యకర్తలకు చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. ప్రతి నెల రెండో శనివారం, ఆదివారం తెలంగాణకు చంద్రబాబు రానున్నారు. పార్టీ నిర్మాణం పైనే అధినేత దృష్టి సారించనున్నారు.


అపూర్వ స్వాగతం..

కాగా, అంతకుముందు చంద్రబాబు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌కు (NTR Trust Bhavan) చేరుకున్నారు. అధినేతకు పసుపు తమ్ముళ్లు ఘన స్వాగతం పలికారు. పార్టీ కార్యకర్తలతో ఎన్టీఆర్ భవన్‌లో జోష్ వచ్చింది. ఈ సందర్భంగా తెలంగాణ టీడీపీ నేతలు చంద్రబాబును ఘనంగా సన్మానించారు. అధినేత రాకతో ఎన్టీఆర్ భవన్‌లో కోలాహలంగా మారింది.


చంద్రబాబు జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి ట్రస్ట్‌ భవన్‌కు టీటీడీపీ నేతల ర్యాలీతో బయల్దేరారు. ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండోసారి టీడీపీ భవన్‌కి చంద్రబాబు వచ్చారు. అనంతరం తెలంగాణ నేతలతో బాబు భేటీ అయ్యారు. టీటీడీపీ నూతన అధ్యక్షుడు, పార్టీ బలోపేతంతో పాటు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ, సభ్యత్వ నమోదుపై చంద్రబాబు చర్చలు జరపనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

Updated Date - Aug 10 , 2024 | 08:33 PM

Advertising
Advertising
<