ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chinna Reddy: తెలంగాణలో డిక్టేటర్స్ పాలన.. బీఆర్ఎస్‌పై చిన్నారెడ్డి ఫైర్

ABN, Publish Date - Jul 15 , 2024 | 06:12 PM

పదేళ్లుగా తెలంగాణలో డిక్టేటర్స్ పాలన నడిచిందని.. కేసీఆర్ ఇనుపకంచలు వేసి ప్రగతి భవన్ రానీయకుండా చేశారని తెలంగాణ ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షులు జి. చిన్నారెడ్డి (Chinna Reddy) అన్నారు.

Chinna Reddy

హైదరాబాద్: పదేళ్లుగా తెలంగాణలో డిక్టేటర్స్ పాలన నడిచిందని.. కేసీఆర్ ఇనుపకంచలు వేసి ప్రగతి భవన్ రానీయకుండా చేశారని తెలంగాణ ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షులు జి. చిన్నారెడ్డి (Chinna reddy) అన్నారు. బుల్డోజర్లు పెట్టి రేవంత్ రెడ్డి ఇనుపకంచెలు తొలగించారని తెలిపారు. కృత్రిమ ఉద్యమాలను మాజీ సీఎం కేసీఆర్ సృష్టిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. 30 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు.


విద్యార్థులు తప్పుదోవ పట్టొద్దు..

స్కిల్ డెవలప్మెంట్ సెంట్రల్ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. విద్యా, వైద్యం, వ్యవసాయం ప్రధాన ప్రాధాన్యతగా ప్రభుత్వం ముందుకెళ్తుందని వివరించారు. గత ప్రభుత్వం ఖజానా పూర్తిగా ఖాళీ చేసి వెళ్లిపోయిందని ధ్వజమెత్తారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం ఎంతో గొప్పగా కార్యక్రమాలు నిర్వహిస్తోందని.. దీన్ని ఆలోచించాలని అన్నారు. విద్యార్థులు తప్పుడు మాటలు వినద్దొని. తప్పుదోవ పట్టద్దొని చెప్పారు. ఈ ప్రభుత్వం నిరుద్యోగులు, విద్యార్థులకు అండగా ఉంటుందని మాటిచ్చారు.


బీఆర్ఎస్ రెచ్చ గొడుతోంది..

నిరుద్యోగ యువకులు కొందరి ప్రొద్బలం వల్ల ఆందోళనలు చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ నేతలు రెచ్చ గొట్టి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడొద్దని హితవు పలికారు. విద్యార్థుల బలిదానం, త్యాగాలను గుర్తించి తెలంగాణను ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ ఇచ్చారని గుర్తుచేశారు. ఈరోజు(సోమవారం) తెలంగాణ సచివాలయం మీడియా పాయింట్‌లో చిన్నారెడ్డి పలు కీలక విషయాలు వెల్లడించారు. లక్ష 7వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఆ రోజు మాజీ సీఎం కేసీఆర్ చెప్పారని తెలిపారు.


కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయలేదు..

వాటిని భర్తీ చేయక ఆయన దిగిపోయే నాటికి చనిపోయే వాటిని కలుపుకుంటే రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అన్నారు. నిరుద్యోగుల పైన ప్రేమ ఉంటే ఉద్యమంలో విద్యార్థుల ప్రాణత్యాగలతో తెచ్చుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి అయిన మూడు నెలల్లోనే కేసీఆర్ ఉద్యోగాలు నింపి ఉండేవారని.. కాని ఉద్యోగాలు భర్తీ చేయలేదని ప్రశ్నించారు. తెలంగాణలో యూనివర్సిటీల్లో టీచింగ్ స్టాప్ లేదని అన్నారు.ఉస్మానియా యూనివర్సిటీ ప్రతిష్ట దెబ్బతినేలా కేసీఆర్ సర్కార్ చేసిందని మండిపడ్డారు.


ప్రభుత్వం వచ్చిన వెంటనే 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని వివరించారు. గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చిందని, పరీక్షలు రాశారని రిజల్ట్స్ కూడా వచ్చాయని తెలిపారు. మెయిన్స్ షెడ్యూల్ కూడా ఇచ్చామని తెలిపారు.శతాబ్ది ఉత్సవాలకు కేసీఆర్‌ను ఉస్మానియాలో యూనివర్సిటీ విద్యార్థులు మాట్లాడనివ్వలేదని గుర్తుచేశారు. ఎన్నికల కంటే ముందు రెండు లక్షల ఉద్యోగాలను ఒక సంవత్సరంలో భర్తీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారని అన్నారు.


ఉద్యోగాలపై సీఎం రేవంత్ దృష్టి..

‘‘పదేళ్లలో 20,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఒక్కటి కూడా గత ప్రభుత్వం భర్తీ చేయలేదు. ఒక్క డీఎస్సీ కూడా వేయలేదు.. పక్కన ఏపీ రాష్ట్రంలో మూడు డీఎస్సీలు వేశారు. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ పాఠశాల్లో విద్యార్థులకు బీఆర్ఎస్ సర్కార్ అన్యాయం చేసింది. సర్కార్ రాగానే రేవంత్ రెడ్డి ఉద్యోగాలపై దృష్టి సారించారు. నిరుద్యోగుల కోసం 11 వేల పైచిలుకు పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చారు. హాల్ టికెట్లు కూడా విడుదల చేశారు. గత సర్కార్ పదేళ్లలో 5000 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి నిర్వహించలేకపోయింది. ఈ డీఎస్సీతో పాటు మరో డీఎస్సీని 9,000 తో విడుదలకు నోటిఫికేషన్ ఇస్తాం. క్వాలిటీ టీచర్స్ ఎంపిక కోసం రెండు డీఎస్సీలను నిర్వహించాలనుకుంటున్నాం.’’ అని చిన్నారెడ్డి పేర్కొన్నారు


రాష్ట్రాన్ని దివాలా తీయించిన బీఆర్ఎస్

‘‘తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకొని రాష్ట్రాన్ని దివాలా తీయించిన బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, హరీష్‌రావు, కేటీఆర్ మళ్లీ పిల్లల జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ల చేతుల్లో పావులుగా మారొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. మళ్లీ విద్యార్థులను నిరుద్యోగులను వాడుకొని వదిలేస్తారు. 30 లక్షల మంది చదువుకున్న నిరుద్యోగులు ఎంప్లాయిమెంట్ పోర్టల్లో పేర్లు నమోదు చేసుకున్నారు. టాటా కంపెనీతో ఒప్పందం చేసుకొని 64 ఐటీఐ సెంటర్లలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నాం. రూ. 2000 కోట్లు ఐటీఐలకు కేటాయించాం. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు కలిపి 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం’’ అని చిన్నారెడ్డి తెలిపారు.


ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయొద్దు..

‘‘ముఖ్యమంత్రి ఇంటికి పోయి ధర్నా చేయడం సరికాదని విజ్ఞప్తి చేస్తున్నాను. కోచింగ్ సెంటర్ల వాళ్లు కొంతమంది విద్యార్థులను ప్రేరేపించి ఆందోళన చేయిస్తున్నారు. ప్రజావాణిలో దరఖాస్తులకు దరఖాస్తు చేసిన 10 రోజుల్లో ఫలితాలు కూడా వస్తున్నాయి. అవసరమైతే అధికారులను అక్కడికి రప్పిస్తున్నాం. విద్యార్థులు, నిరుద్యోగులు బాధ చెప్పుకోవాలనుకుంటే ప్రజావాణికి వచ్చి బాధ చెప్పుకోమని కోరుతున్నాం.. మీకు అన్ని రకాలుగా అండగా ఉంటాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయొద్దని కోరుతున్నాను. 1: 100, వాయిదా వేయడం, పరీక్షకు పరీక్షకు మధ్య గ్యాప్ వంటి సమస్యలపై కలిసి మాట్లాడితే బాగుండేది. ఫీజు రియింబర్స్‌మెంట్ మొత్తం కూడా త్వరలోనే విడుదల చేయబోతున్నాం’’ అని చిన్నారెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

Tourists: వికారాబాద్‌లో టూరిస్టులకు వింత కష్టాలు!

Viral: వీడసలు మనిషేనా!? రైలు బయలుదేరగానే డోర్ పక్కన రాడ్ పట్టుకుని..

Read Latest Telangana News And Telugu News

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 15 , 2024 | 06:24 PM

Advertising
Advertising
<