Telangana: కేసీఆర్ పాకిస్థాన్ వాళ్లల్లా ప్రవర్తిస్తున్నారు: సీఎం రేవంత్ రెడ్డి
ABN , Publish Date - Jun 01 , 2024 | 09:10 PM
మాజీ సీఎం కేసీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌కు రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ఆహ్వానం పలికితే.. తాను రానంటూ లేఖ రాయడం దారుణమన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవంపై ఆయనకు గౌరవం లేదని.. కేసీఆర్ పాకిస్తాన్ వాళ్లల్లా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. సోనియా గాంధీ ఆరోగ్యం సహకరించడం లేదని, ఆమె రాకపోతే సందేశం పంపొచ్చన్నారు. ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో అమరవీరుల స్థూపం వద్దకు తాను వెళ్లాలన్నా ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాలని తెలిపారు.
హైదరాబాద్: మాజీ సీఎం కేసీఆర్(KCR)పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌కు రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ఆహ్వానం పలికితే.. తాను రానంటూ లేఖ రాయడం దారుణమన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవంపై ఆయనకు గౌరవం లేదని.. కేసీఆర్ పాకిస్తాన్ వాళ్లల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సోనియా గాంధీ ఆరోగ్యం సహకరించడం లేదని, ఆమె రాకపోతే సందేశం పంపొచ్చన్నారు. ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో అమరవీరుల స్థూపం వద్దకు తాను వెళ్లాలన్నా ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాలని తెలిపారు. ప్రజల్లో కేటీఆర్ ఏదేదో మాట్లాడుతున్నాడని, అమరవీరుల ఆనవాళ్లపై బీఆర్ఎస్ నేతలకు ఎందుకంత ద్వేషమని ప్రశ్నించారు. కేటీఆర్‌కు కరెంట్ షాక్ ఇవ్వాలని, హరీష్ రావు చిల్లర పనుల వల్లే పవర్ కట్ అవుతోందన్నారు. సబ్ స్టేషన్‌కు వెళ్లి లాక్ బుక్ చూడటానికి తాను రెడీ అని.. దానిపై చర్చకు కూడా సిద్ధమన్నారు. బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ సమస్యలు లేవని, కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అవుతోందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో విత్తనాల కొరత లేదని, ఫలానా బ్రాండ్ కావాలని మాత్రమే రైతుల అడుగుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విత్తనాల స్టాక్ లేనప్పుడు చెప్పులు లైన్‌లో ఉండి ఏం లాభమన్నారు. ఆగస్టు 15న రుణమాఫీ చేస్తామని, అమరవీరుల విషయంలో ప్రత్యేక కమిటీలు వేసి వాళ్లకు తగిన న్యాయం చేస్తామన్నారు. దీనిపై పోలీస్ స్టేషన్ల నుంచి సమాచారం సేకరిస్తున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి రావటం నిరంతర ప్రక్రియ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలించడమే రాష్ట్ర ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం సెక్రటేరియట్ బయట కాదు, లోపల పెడతామన్నారు. పది సంవత్సరాల దశాబ్ది ఉత్సవాలు తన ఆధ్వర్యంలో జరగటం జీవితకాలం గుర్తుండిపోయే జ్ఞాపకమన్నారు. టీపీసీసీ చీఫ్‌గా తన పదవీకాలం ముగుస్తోందని, ప్రముఖ నాయకుడే కొత్త పీసీసీగా వస్తాడన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయమన్నారు. తెలంగాణలోనూ 9నుంచి 12ఎంపీ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. అనుకున్న ఫలితాలు రాకపోతే మరో రెండు గంటలు ఎక్కువ కష్టపడి పని చేస్తామన్నారు.
Read Latest Telangana News and National News