ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG News: ఇకపై వన్ స్టేట్.. వన్ డిజిటల్ కార్డు.. త్వరలోనే..

ABN, Publish Date - Sep 23 , 2024 | 09:54 PM

తెలంగాణ రాష్ట్రంలో ఫ్యామిలీ డిజిటల్ కార్డులు(స్మార్ట్ కార్డ్) ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకు రాష్ట్రవ్యాప్తంగా పైలట్ ప్రాజెక్టులు చేపట్టేందుకు అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది.

CM Revanth Reddy

హైదరాబాద్: తెలంగాణలో ఫ్యామిలీ డిజిటల్ కార్డులు(స్మార్ట్ కార్డ్) ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకు రాష్ట్రవ్యాప్తంగా పైలట్ ప్రాజెక్టులు చేపట్టేందుకు అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రతీ నియోజకవర్గంలోనూ ఒక అర్బన్, ఒక రూరల్ ప్రాంతాన్ని ఎంచుకుని పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు అవసరమైన చర్యలు తక్షణమే చేపట్టాలని అధికారులకు సూచించారు.


రేషన్, హెల్త్ కార్డులతోపాటు సంక్షేమ పథకాలన్నిటికీ ఇకపై ఒకటే కార్డు ఉండేలా సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. "వన్ స్టేట్.. వన్ డిజిటల్ కార్డ్" విధానంతో ముందుకెళ్లాలనే యోచనలో కాంగ్రెస్ సర్కార్ ఉంది. ఫ్యామిలీ డిజిటల్ కార్డుతో ఎక్కడైనా సంక్షేమ పథకాలను పొందేలా వాటిని రూపొందిస్తున్నారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుతోనే కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్య సేవలు అందించనున్నారు. అందులో ప్రతీ ఒక్కరి హెల్త్ పొఫైల్ ఉండాలని ఇప్పటికే రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.


అర్హులందరికీ వాటిని అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల మానిటరింగ్‌కు జిల్లాల వారీగా వ్యవస్థ ఉండాలని రేవంత్ పేర్కొన్నారు. రాజస్థాన్, హర్యానా, కర్ణాటక లాంటి ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలనూ అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ విధానం పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చి అమలైతే అన్ని సంక్షేమ పథకాలకూ ఒకటే కార్డు ఇచ్చినట్లు అవుతుంది. వాటి ద్వారానే ప్రజలు సంక్షేమ పథకాలను వినియోగించుకోవాల్సి ఉంటుంది.


మరోవైపు రాష్ట్రంలో అక్టోబర్ రెండో తారీకు నుంచి స్మార్ట్ కార్డులు ఇవ్వబోతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రతీ నియోజకవర్గంలో 3,500కార్డులు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. సంక్రాంతి లోపు స్మార్ట్ కార్డులు ఇచ్చి పేదలకు సన్న బియ్యం ఇవ్వనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ ఖరీఫ్ పంట నుంచే సన్నవడ్లకు రూ.500 బోనస్ ఇవ్వబోతున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సంలో మంత్రి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Minister Thummala: బీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ చేయలేదు.. మంత్రి తుమ్మల విసుర్లు

Congress: కమిటీల పేరుతో కాలయాపన చేశారు.. బీఆర్ఎస్‌పై మండిపడిన దామోదర

Minister Ponguleti: గుడ్ న్యూస్.. మరో రెండ్రోజుల్లో వారి ఖాతాల్లో రూ.10వేలు..

Updated Date - Sep 23 , 2024 | 10:02 PM