ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG DSC 2024 Results : నేడు డీఎస్సీ 2024 ఫలితాలు విడుదల

ABN, Publish Date - Sep 30 , 2024 | 07:52 AM

జూలై 18వ తేదీ నుంచి ఆగస్ట్ 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలను కాంగ్రెస్ సర్కార్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఫలితాలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇవాళ(సోమవారం) విడుదల చేయనున్నారు. ఉదయం 11 గంటలకు రాష్ట్ర సచివాలయంలో ఫలితాలను ముఖ్యమంత్రి ప్రకటించనున్నారు.

హైదరాబాద్: ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో భాగంగా డీఎస్సీ 2024 ఫలితాలను వెల్లడించేందుకు తెలంగాణ ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. డీఎస్సీ ఫలితాలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇవాళ(సోమవారం) విడుదల చేయనున్నారు. ఉదయం 11 గంటలకు రాష్ట్ర సచివాలయంలో ఫలితాలను ముఖ్యమంత్రి విడుదల చేయనున్నారు. ఈ ఏడాది మార్చి 1వ తేదీన 11062 టీచర్ ​పోస్టుల భర్తీకి ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్​ విడుదల చేసిన విషయం తెలిసిందే. జూలై 18వ తేదీ నుంచి ఆగస్ట్ 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలను రేవంత్ సర్కార్ నిర్వహించింది. 2.45 లక్షల మంది అభ్యర్థులు డీఎస్సీ పరీక్షలు రాశారు.

తుది కీ పై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు

పరీక్షలకు సంబంధించి వెబ్‌సైట్‌ నుంచి రెస్పాన్స్‌ షీట్‌లను తొలగించారు. ఇప్పటికే ప్రాథమిక కీతోపాటు తుది కీని కూడా విడుదల చేశారు. తుది కీపై అభ్యర్థుల నుంచి కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. తుది కీపై అభ్యర్థుల నుంచి కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. ముఖ్యంగా 12 ప్రశ్నలకు సంబంధించిన జవాబులపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వీటిపై ఇప్పటికే నిపుణుల కమిటీ విద్యాశాఖకు నివేదిక సమర్పించినట్లు సమాచారం. ఈ నివేదిక ఆధారంగా ఈ అభ్యంతరాలను పరిష్కరించనున్నారు. అదే సమయంలో ఫలితాలనూ వెల్లడించాలని భావిస్తున్నారు. డీఎస్సీ పరీక్షల్లో వచ్చిన మార్కులకు టెట్‌ మార్కుల వెయిటేజీని కలిపి జనరల్‌ ర్యాంకులను వెల్లడించనున్నారు.


ALSO READ: Harish Rao: హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్నారు.. హరీష్‌రావు ధ్వజం

అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ

అనంతరం జిల్లాల వారీగా ఈ ర్యాంకులను ప్రకటిస్తారు. వీటి ఆధారంగా జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన మాటను ప్రభుత్వం నిలబెట్టుకుంది. స్వల్ప కాలంలో ఫలితాలను విడుదల చేస్తూ ప్రభుత్వం సరికొత్త రికార్డు నెలకొల్పింది. అయితే జిల్లాలో ఉపాధ్యాయ పోస్టుల కోసం అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులకు పోటీ తీవ్రంగా ఉన్న జిల్లాల్లో వికారాబాద్‌ మూడో స్థానంలో ఉంది. ఒక పోస్టుకు 50 నుంచి 100 మంది వరకు పోటీపడుతున్నారు. ఎస్జీటీ పోస్టుల విషయానికి వస్త్తే రాష్ట్రంలో ఎక్కువ పోటీ వికారాబాద్‌ జిల్లాలోనే నెలకొనడం గమనార్హం. జిల్లా వారీగా జనరల్‌ ర్యాంకులు, 1:3 అభ్యర్థుల జాబితాల కోసం పరీక్ష రాసిన అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు.


సర్దుబాటు ఉత్తర్వులతో ఆందోళన

జిల్లాలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో 359 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 29న రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసి దరఖాస్తులు స్వీకరించింది. జూలై 18వ తేదీ నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు వివిధ కేటగిరీల ఉపాధ్యాయ పోస్టుల కోసం డీఎస్సీ పరీక్షలు నిర్వహించింది. ఇదే సమయంలో విద్యార్థులు తక్కువగా ఉండి... ఎక్కువ మంది ఉపాధ్యాయులు పనిచేస్తుంటే .. వారిని తాత్కాలికంగా ఇతర పాఠశాలలకు సర్దుబాటు చేసేందుకు వీలుగా విద్యా శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాలల్లో ఉపాధ్యాయులను సర్దుబాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ మరింత ఆలస్యమవుతుందనే సంకేతాలు ఇస్తోందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తుది ఫలితాలు ప్రకటించి సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ పూర్తి చేసి అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కనీసం మూడు వారాల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.


359 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

భర్తీచేసే ఉపాధ్యాయ పోస్టుల్లో 102 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు, 195 సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ), 23 లాంగ్వేజ్‌ పండిట్, 5 ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టులు ఉన్నాయి. అలాగే స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ విభాగంలో 6 స్కూల్‌ అసిస్టెంట్‌, 28 ఎస్‌జీటీ పోస్టులు కూడా ఉన్నాయి. మొత్తం 195 ఎస్‌జీటీ పోస్టుల్లో 169 తెలుగు మీడియం, 26 ఉర్దూ మీడియం పోస్టులు ఉన్నాయి. తెలుగు మీడియం ఎస్‌జీటీ పోస్టుల్లో ప్రభుత్వ పాఠశాలలకు 6, స్థానిక సంస్థల పాఠశాలలకు 163 పోస్టులు కేటాయించారు. ఈ పోస్టుల్లో ఓసీలకు 50, ఎస్సీలకు 24, ఎస్టీలకు 16, బీసీ-ఏ కేటగిరికి 13, బీసీ-బీకి 15, బీసీ-సీకి 4, బీసీ-డీకి 10, బీసీ-ఈ కేటగిరికి 6, దివ్యాంగులకు (పీహెచ్‌) 8 పోస్టులు, ఈడబ్ల్యూఎస్‌కు 16 పోస్టులు కేటాయించారు. లాంగ్వేజ్‌ పండిట్ హిందీ పోస్టుల్లో మొత్తం 11 పోస్టులు ఖాళీ ఉండగా, ఓసీలకు 4, ఎస్సీలకు 2, ఎస్టీలకు ఒకటి, బీసీ-ఏ, బీసీ-బీ కేటగిరిలకు, దివ్యాంగులకు, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరిలకు ఒక్కో పోస్టు కేటాయించారు. సంస్కృతం పోస్టుల్లో భర్తీ చేయనున్న ఒక పోస్టును ఓసీలకు కేటాయించారు. తెలుగు పండిట్ పోస్టులు 8 ఉండగా, వాటిలో ఓసీలకు 4, ఎస్సీలకు 2, బీసీ-ఏ, దివ్యాంగులకు ఒక్కో పోస్టు కేటాయింపు చేశారు. ఉర్దూ పండిట్ పోస్టులు 3 ఉండగా, దాంట్లో ఓసీలకు 2, ఎస్సీలకు ఒక పోస్టు కేటాయించారు. ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టులు 5 ఉండగా, ఓసీలకు 3, ఎస్సీలకు, బీసీ-ఏ కేటగిరికి ఒక్కో పోస్టు కేటాయింపు జరిపారు. 102 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల్లో బయోసైన్స్‌ 21, ఇంగ్లీష్‌ 23, హిందీ 3, తెలుగు 9, ఉర్దూ 3, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ 3, ఫిజికల్‌ సైన్స్‌ 6 (తెలుగు 4, ఉర్దూ 2), సోషల్‌ స్టడీస్‌ 25 (తెలుగు 23, ఉర్దూ 2), తెలుగు 7, ఉర్దూ 2 పోస్టులు ఉన్నాయి. జిల్లాలో 34 స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ పోస్టులు ఉండగా, వాటిలో 6 స్కూల్‌ అసిస్టెంట్‌ (తెలుగు), 28 ఎస్‌జీటీ పోస్టులు ఉన్న విషయం విదితమే. ఎస్‌జీటీ పోస్టుల్లో ఓసీలకు 9, ఎస్సీలకు 5, ఎస్టీలకు 3, బీసీ-ఏ, బీసీ-బీ కేటగిరిలకు రెండేసి పోస్టులు ఉన్నాయి. బీసీ-సీ, బీసీ-డీ, బీసీ-ఈ కేటగిరిలకు, దివ్యాంగులకు ఒక్కో పోస్టు కేటాయించారు.


జిల్లాలో తీవ్ర పోటీ...

జిల్లాలో భర్తీ చేసే పోస్టులు తక్కువ ఉండటంతో పోటీ పడే అభ్యర్థుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఫలితంగా అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల్లో ఒక్కో పోస్టుకు 60 నుంచి 80 మంది వరకు పోటీ పడుతుండగా, ఎస్జీటీ పోస్టుకు 35 నుంచి 50 మంది పోటీలో ఉన్నారు. జనరల్‌ ర్యాంకులు ప్రకటిస్తే ఎవరెవరికీ ఉద్యోగావకాశాలు దక్కనున్నాయనేది కొంతవరకు స్పష్టత రానుంది. 1:3 అభ్యర్థుల జాబితా ప్రకటిస్తే కేటగిరీల వారీగా అభ్యర్థులు ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంటుంది. ఖాళీగా ఉన్న పోస్టుల మేరకు నోటిఫికేషన్‌ జారీ చేసి ఉంటే.. చాలా కాలంగా ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఎక్కువ మందికి న్యాయం జరిగేందుకు అవకాశం ఉండేది అని అభ్యర్థులు అభిప్రాయ పడుతున్నారు. జీవో 317 కారణంగా జిల్లా నుంచి ఇతర జిల్లాలకు వెళ్లిన ఉపాధ్యాయుల కంటే ఇతర జిల్లాల నుంచి వికారాబాద్‌ జిల్లాకు వచ్చిన ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్నారు. ముఖ్యంగా ఇతర జిల్లాల నుంచి ఎస్జీటీలను జిల్లాకు ఎక్కువ సంఖ్యలో కేటాయించారు. ఫలితంగా జిల్లాలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల్లో 320 పోస్టులను కోల్పోయారు.


ఈ వార్తలు కూడా చదవండి

Harish Rao: 1962 సేవల పట్ల సర్కార్ నిర్లక్ష్యంపై మాజీ మంత్రి ఫైర్

ED: ఈడీ అదుపులో సాహితీ ఇన్ఫ్రా ఎండీ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 30 , 2024 | 10:41 AM