ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth: స్కిల్ యూనివర్సిటీపై సీఎం కీలక ఆదేశాలు

ABN, Publish Date - Jul 19 , 2024 | 07:30 PM

స్కిల్ యూనివర్సిటీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక ఆదేశాలు జారీ చేశారు. యూనివర్సిటీ సంబంధించిన పలు విషయాలపై అధికారులతో ఈరోజు(శుక్రవారం) సమావేశం అయ్యారు.

CM Revanth Reddy

హైదరాబాద్: స్కిల్ యూనివర్సిటీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక ఆదేశాలు జారీ చేశారు. యూనివర్సిటీ సంబంధించిన పలు విషయాలపై అధికారులతో ఈరోజు(శుక్రవారం) సమావేశం అయ్యారు. ప్రముఖ విద్యావేత్తలు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ కోదండరాం, ఆకునూరి మురళి, పలువురు రిటైర్డ్ ఐఏఎస్​ అధికారులు హాజరయ్యారు.ఈ భేటీ కాసేపటి క్రితమే ముగిసింది.


ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఢిల్లీ, హర్యానా తరహాలో తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీకి ముసాయిదాను అధికారులు సిద్ధం చేశారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ బిల్లు పెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది. ముసాయిదాలోని అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. పలు సూచనలు చేశారు. యూనివర్సిటీలో సర్టిఫికేషన్ కోర్సులు, డిప్లొమా కోర్సులకు సంబంధించి సీఎం, డిప్యూటీ సీఎంకు అధికారులు వివరించారు.


కోర్సుల విషయంలో డిమాండ్ ఎక్కువగా ఉన్న రంగాలపై ఎక్కువ దృష్టి పెట్టాలని సీఎం సూచించారు.యూనివర్సిటీ సంస్థాగత నిర్మాణంపై పలు కీలక సూచనలు చేశారు. శిక్షణ పూర్తయిన విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించి ముందుగానే వివిధ కంపెనీలతో చర్చించాలని సూచించారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుపై నిధుల విషయంలో రాజీపడొద్దని సీఎం సూచించారు. పూర్తిస్థాయి ముసాయిదా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ బిల్లు పెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.


రేపు బాధ్యతలు స్వీకరించనున్న కేశవరావు

కాగా.. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా మాజీ ఎంపీ కే శవరావు రేపు(శనివారం) బాధ్యతలు స్వీకరించనున్నారు. సెక్రటేరియట్‌లో బాధ్యతలను కేశవరావు స్వీకరించునున్నారు. ఇటీవలే కేశవరావును ప్రభుత్వ సలహాదారుగా రాష్ట్ర సర్కార్ నియమించిన విషయం తెలిసిందే.

Updated Date - Jul 19 , 2024 | 07:30 PM

Advertising
Advertising
<