ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Cyber Crime: సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు..

ABN, Publish Date - Aug 03 , 2024 | 10:10 AM

హైదరాబాద్: తెలంగాణలో మరో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో నిన్న(శుక్రవారం) ఒకే రోజు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో ఇద్దరు వ్యక్తుల నుంచి కేటుగాళ్లు రూ.80లక్షలు దోచేశారు. దీంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు.

హైదరాబాద్: తెలంగాణలో మరో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో నిన్న(శుక్రవారం) ఒకే రోజు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో ఇద్దరు వ్యక్తుల నుంచి కేటుగాళ్లు రూ.80లక్షలు దోచేశారు. దీంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు.


స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో బురిడీ..

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో ప్రైవేటు ఉద్యోగికి ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు వాట్సాప్ లింక్ పంపించారు. మంచి లాభాలు వస్తాయని నమ్మించి విడతల వారీగా రూ.66.75లక్షలు పెట్టుబడి పెట్టించారు. ఎన్ని రోజులైనా లాభాలు ఇవ్వకపోగా వారి నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. అదే విధంగా మెదక్ జిల్లా తూప్రాన్‌లోనూ మరో ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రేడింగ్ కోసం సెర్చ్ చేశాడు. దీంతో బాధితుడిని కాంటాక్ట్ అయిన కేటుగాళ్లు రూ.15లక్షలు పెట్టుబడి పెడితే రూ.5లక్షలు లాభం వస్తుందని నమ్మించారు. అది నమ్మిన ఆ వ్యక్తి వారు పంపిన లింక్‌పై క్లిక్ చేసి నగదు పంపించాడు. అనంతరం మెుత్తం డబ్బు రూ.20లక్షలు ఇవ్వాలని వారికి మెసేజ్ చేయగా ఎలాంటి స్పందన లేదు. దీనిపై బాధితుడు తూప్రాన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.


జాతీయ నేర నివేదికల్లో తెలంగాణ స్థానం..

జాతీయ నేరాల నమోదు సంస్థ ఎన్‌సీఆర్‌బీ 2022 ఏడాదికి గాను విడుదల చేసిన సైబర్ నేరాల నివేదికలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం తొలిస్థానంలో నిలిచింది. అలాగే 2023లో జరిగిన 16,339 సైబర్‌ నేరాల్లో 15వేల కేసుల్లో ఆర్థికంగా మోసపోయిన వారే ఉన్నారు. దేశవ్యాప్తంగా నమోదవుతున్న సైబర్‌ కేసుల్లో ఒక్క తెలంగాణలోనే 40శాతానికిపైగా నమోదు అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు కల్పించినా సైబర్ కేటుగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ప్రతి రోజూ లక్షలు, కోట్లు పోగొట్టుకుంటున్న కథనాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.


సెల్ ఫోన్లకు వచ్చే అనవసరపు లింక్‌లపై క్లిక్ చేయవద్దని, బ్యాంకు అధికారులమంటూ ఓటీపీ వివరాలు అడిగితే చెప్పవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. లాటరీ తగిలిందని మీ ఖాతాలో నగదు వేస్తామని వివరాలు అడిగినా చెప్పవద్దని సూచిస్తున్నారు. కెబిట్, క్రెడిట్ కార్డు వివరాలు గోప్యంగా ఉంచాలని, బ్యాంకు వివరాలు సైతం ఎవరికీ చెప్పవద్దని తెలిపారు. ముఖ్యంగా లోన్ యాప్స్‌ పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలియని వారి నుంచి వచ్చే వాట్సాప్ మెసేజ్‌లు, మెయిల్స్‌కు స్పందిచవద్దని హెచ్చరిస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Harish Rao: జాబ్ క్యాలెండర్ పెద్ద జోక్ క్యాలెండర్: మాజీ మంత్రి హరీశ్ రావు

Health News: చేప తలలో ఉండే విలువైన పోషకాలు ఏంటో తెలుసా?

Updated Date - Aug 03 , 2024 | 10:19 AM

Advertising
Advertising
<