ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bhatti vikramarka: చంద్రబాబు, రేవంత్‌ బంధంపై డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు

ABN, Publish Date - Jul 03 , 2024 | 04:13 PM

Telangana: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై సర్వాత్ర ఆసక్తి నెలకొంది. ఈనెల 6వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. అయితే గురుశిష్యులు భేటీ కాబోతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు.

Deputy CM Bhatti Vikramarka

హైదరాబాద్, జూలై 3: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై సర్వాత్ర ఆసక్తి నెలకొంది. ఈనెల 6వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy), ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) సమావేశం కానున్నారు. అయితే గురుశిష్యులు భేటీ కాబోతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) స్పందించారు. చంద్రబాబు, రేవంత్ రెడ్డి గురుశిష్యులు కాదని.. సహచరులని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని రేవంత్ చాలా సార్లు చెప్పారన్నారు. చంద్రబాబు ఏపీ సీఎం, రేవంత్ తెలంగాణ సీఎం అని తేల్చిచెప్పారు. చంద్రబాబు, రేవంత్ గురుశిష్యులు అనే వారివి అవగాహనలేని మాటలని కొట్టిపారేశారు. పదేండ్ల పెండింగ్ సమస్యలను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చిస్తారని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.

YS Jagan Case: పూర్తి నివేదిక ఇవ్వండి.. జగన్ కేసులపై సీబీఐకి హైకోర్టు ఆదేశం


కేసీఆర్‌వి కొల్లబొల్లి కబుర్లే...

ఏడు మండలాలు పోవడానికి కారణం బీఆర్ఎస్, బీజేపీనే అని వ్యాఖ్యలు చేశారు. ఏడు మండలాల కోసం బీఆర్‌ఎస్ దీక్ష చేయాలని డిమాండ్ చేశారు. విభజన చట్టంలో ఏడు మండలాల ప్రస్తావన లేదన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆర్డినెన్సుతో ఏడు మండలాలను ఏపీలో కలిపారని చెప్పుకొచ్చారు. ఏడు మండలాల కోసం పోరాటం చేస్తానని అసెంబ్లీలో చెప్పిన కేసీఆర్ ఏమయ్యారని ప్రశ్నించారు. కేబినెట్ విస్తరణపై పూర్తిగా అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. పీసీసీ నూతన చీఫ్ విషయంలో కసరత్తు కొనసాగుతుందన్నారు. త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని వెల్లడించారు. పదిహేనేండ్లు తామే అధికారంలో ఉంటామని చెపుతున్న కేసీఆర్ వి కల్లిబొల్లి కబుర్లే అంటూ విమర్శించారు. రైతు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని.. పుట్టింది బతకడానికి... చావడానికి కాదని అన్నారు. ఆత్మహత్య వెనుక ఎవరున్నారనే దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఆత్మహత్య వెనక ఎవరున్నా విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. హరీష్ రావు కల్లిబొల్లి మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ తప్పిదాలు ఆయన్ని వెంటాడుతున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

YS Jagan Case: పూర్తి నివేదిక ఇవ్వండి.. జగన్ కేసులపై సీబీఐకి హైకోర్టు ఆదేశం

CM Chandrababu: అమరావతిలో ఏ ఒక్కరికి అన్యాయం జరగనివ్వం: సీఎం చంద్రబాబు

Read Latest Telangana News AND Telugu News

Updated Date - Jul 03 , 2024 | 04:21 PM

Advertising
Advertising