TG News:గ్రేటర్ హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఆ రెస్టారెంట్లలో గడువు దాటిన ఆహార పదార్థాలు.. తిన్నారంటే అంతే..!
ABN, Publish Date - May 22 , 2024 | 08:56 PM
నగరంలోని పలు రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పాచిపోయిన ఆహార పదార్థాలను భారీగా పట్టుకున్నారు. హోటళ్లలో శుభ్రంగా లేని ఆహారాన్ని ప్రజలకు అంటగడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు. నాణ్యతగా లేని ఆహార పదార్థాలను చూసి పలు హోటళ్లకు వార్నింగ్ ఇచ్చారు.
హైదరాబాద్: నగరంలోని పలు రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పాచిపోయిన ఆహార పదార్థాలను భారీగా పట్టుకున్నారు. హోటళ్లలో శుభ్రంగా లేని ఆహారాన్ని ప్రజలకు అంటగడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు. నాణ్యతగా లేని ఆహార పదార్థాలను చూసి పలు హోటళ్లకు వార్నింగ్ ఇచ్చారు.
వివరాల్లోకి వెళ్తే.. సోమాజిగూడలో కేఎఫ్సీ, రెస్ట్ ఒబార్, కృతుంగా రెస్టారెంట్లలో ఏకకాలంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. దాడులు నిర్వహించిన సందర్భంలో సోమాజిగూడ కేఎఫ్సీ రెస్టారెంట్‌లో ఎఫ్ఎస్ఎస్ఏఐకి సంబంధించిన సర్టిఫికెట్ డిస్‌ప్లే చేయకపోవడాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. కృతుంగా రెస్టారెంట్‌లో ఎఫ్ఎస్ఎస్ఏఐ లేబుల్స్ లేని పలు పదార్థాలను ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కృతుంగా రెస్టారెంట్‌లో నాసిరకం ఆహార పదార్థాలను గుర్తించి నిర్వాహకులకు వార్నింగ్ ఇచ్చారు.
అలాగే రెస్ట్ ఓ బార్‌లో ఎక్స్‌ఫైర్ అయిన పదార్థాలను ఉపయోగిస్తూ ఉండటం, సిబ్బంది తిను పదార్థాలను తయారు చేయడంలో సరైన సేఫ్టీ పద్ధతులను పాటించకపోవడాన్ని అధికారులు గుర్తించి వాటిని సీజ్ చేశారు. సిటీలో హోటళ్లపై టాస్క్‌ఫోర్స్ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. సోమాజిగూడలోని కృతుంగా రెస్టారెంట్, హెడ్ కోటర్స్ బార్ అండ్ రెస్టారెంట్‌లలో ఆహార పదార్థాల గడువు ముగిసిన వినియోగిస్తున్నట్లు తనిఖీల్లో బయట పడింది. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు. పలు హోటళ్ల యజమానులకు ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసులు అందజేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఫ్యాన్ పార్టీకి సీఈసీ చెక్..
అడ్డంగా దొరికిన ఎమ్మెల్యే పిన్నెల్లి..
అమిత్ సా వ్యాఖ్యాలపై కేజ్రీవాల్ ఆగ్రహం..
బెంగళూరు రేవ్ పార్టీలో కీలక సూత్రధారి ఎవరంటే..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - May 22 , 2024 | 10:06 PM