ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: ప్రజాపాలనపై ఛార్జ్ షీట్ విడుదల చేసిన మాజీ మంత్రి హరీశ్ రావు..

ABN, Publish Date - Dec 08 , 2024 | 01:26 PM

మూసీ, హైడ్రా పేరుతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీశారని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై తెలంగాణ భవన్‌లో హరీశ్ రావు ఛార్జ్ షీట్ విడుదల చేశారు.

Former BRS minister Harish Rao

హైదరాబాద్: మూసీ, హైడ్రా పేరుతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీశారని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై తెలంగాణ భవన్‌లో హరీశ్ రావు ఛార్జ్ షీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆయన నిప్పులు చెరిగారు. ఎన్నికల హామీలు అమలు చేయటంలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యారని మాజీమంత్రి ధ్వజమెత్తారు. హామీలు అమలు చేయమని అడిగితే ముఖ్యమంత్రి ప్రతిసారీ మాట మార్చుతున్నారని హరీశ్ రావు మండిపడ్డారు.


ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. "తెలంగాణలో సంక్షేమాన్ని సర్వనాశనం చేసిన చరిత్ర రేవంత్ ప్రభుత్వానిది. చట్టం గాంధీ భవన్ నుంచి నడుస్తోంది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయ్యింది. రేవంత్ పాలనలో తొమ్మిది చోట్ల మత కలహాలు జరిగాయి. కాంగ్రెస్ పాలనలో కూల్చిన ఇళ్లు తప్ప కట్టిన ఇల్లు ఒక్కటీ లేదు. ఫించన్ పెంచకుండా ముసలి వాళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తోంది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రూ.4.20 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేశాం. కానీ రూ.7 లక్షల కోట్ల అంటూ గోబెల్స్ ప్రచారం చేశారు. రేవంత్ ప్రభుత్వం ఏడాదిలోనే లక్ష కోట్ల అప్పు చేసింది.


రాష్ట్ర ఆదాయం పెంచలేదు కానీ, కాంగ్రెస్ నేతలు ఆదాయం పెంచుకున్నారు. ఏడాది పాలనలో 6,500 ఎకరాల ఆయకట్టు అయినా తెచ్చారా?. పాలమూరు బిడ్డనని రెచ్చిపోయే రేవంత్ రెడ్డి.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు తట్టెడు మట్టైనా ఎత్తారా?. కేసీఆర్ పాలనలో ఇరిగేషన్ పెరిగింది, రేవంత్ పాలనలో ఇరిటేషన్ పెరిగింది. ఆయన ప్రభుత్వంలో వ్యవసాయానికి గ్రహణం పట్టింది. రైతు రుణమాఫీ పూర్తిగా చేశామని డబ్బా కొట్టుకుంటున్నారు. హామీలు అమలు చేయలేక రేవంత్ రెడ్డి ఫ్రస్టేషన్‌లో ఉన్నారు. రైతు బంధును ఎగ్గొట్టిన మోసకారి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్. రైతుల బోనస్‌ను బోగస్ చేశారు.


ఉద్యోగులను సైతం కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. కూల్చిన ఇళ్లకు ఎవరు బాధ్యత వహిస్తారో ఆయనే సమాధానం చెప్పాలి. లంకె బిందెల కోసమే మూసీ ప్రాజెక్టును ముందుకు తెచ్చారు. రూ.1.50 లక్షల కోట్ల కోసమే ఆ ప్రాజెక్టు చేపట్టారు. మూసీ ప్రక్షాళన మాత్రమే చేయాలన్నందుకు కేసీఆర్ మూసీలో పడి చావాలని మాట్లాడే కుసంస్కారి రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో జరిగే ప్రతి దానికీ బీఆర్ఎస్ కుట్ర ఉందంటారు. ముఖ్యమంత్రికి సముద్రమంతా అజ్ఞానం ఉంది. రాజకీయాల్లో భాషను రేవంత్ రెడ్డి దిగజార్చారు. ఏడాది కాంగ్రెస్ పాలన ప్రజలకు వేదనను మిగిల్చింది" అని మండిపడ్డారు.

Updated Date - Dec 08 , 2024 | 01:26 PM