Share News

Ponnala Laxmaiah: 1.85 శాతం ఓట్లతో ఓడిపోయిన బీఆర్‌ఎస్ చచ్చిన పాము ఎలా అవుతుంది?

ABN , Publish Date - Apr 29 , 2024 | 03:25 PM

Telangana: బీఆర్ఎస్‌‌ను ముఖ్యమంత్రి రేవంత్ చచ్చిన పాము అంటున్నారని.. కేవలం 1.85 శాతం ఓట్లతో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ చచ్చిన పాము ఎట్లా అవుతుందదని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి వంద రోజుల్లో ఆరు గ్యారెంటీల్లో ఎన్ని అమలు చేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో టీమ్ వర్క్, హోం వర్క్ రెండూ లేవన్నారు. కేసీఆర్ రాజకీయ చరిత్రకు...

Ponnala Laxmaiah: 1.85 శాతం ఓట్లతో ఓడిపోయిన బీఆర్‌ఎస్ చచ్చిన పాము ఎలా అవుతుంది?
Former Minister Ponnala laxmaiah

హైదరాబాద్, ఏప్రిల్ 29: బీఆర్ఎస్‌‌ను (BRS) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చచ్చిన పాము అంటున్నారని.. కేవలం 1.85 శాతం ఓట్లతో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ చచ్చిన పాము ఎట్లా అవుతుందదని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య (Former Minister Ponnala Laxmaiah) ప్రశ్నించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి వంద రోజుల్లో ఆరు గ్యారెంటీల్లో ఎన్ని అమలు చేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో టీమ్ వర్క్, హోం వర్క్ రెండూ లేవన్నారు. కేసీఆర్ రాజకీయ చరిత్రకు... రేవంత్ రెడ్డి రాజకీయ చరిత్రకు అసలు ఏమైనా సంబంధం ఉందా అని నిలదీశారు. కేసీఆర్ ముందు రేవంత్ రెడ్డి అనుభవం ఎంత అని అన్నారు.

Bandi Sanjay: నువ్వొక డ్రామా ఆర్టిస్ట్.. నీ అయ్య లేకుంటే నీ బతుకేంది?


రైతు బంధు, రైతు రుణమాఫీ చేయలేని వ్యక్తి సీఎంగా ఉన్నారని విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి రాజకీయాల నుండి తప్పుకోవాలన్నారు. రేవంత్ రెడ్డి పార్లమెంట్ సెగ్మెంట్‌లో ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదన్నారు. రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తే తాము వద్దు అన్నామా అని అన్నారు. రైతుబంధు ఐదు లక్షల మందికి ఇవ్వలేదని రేవంత్ రెడ్డే స్వయంగా అన్నారన్నారు. వాళ్ళు కాంగ్రెస్‌కు ఎందుకు ఓటు వేయాలన్నారు. వెదిరె శ్రీరామ్ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారని.. కేంద్ర జలవనరుల శాఖలో ఆయన కీలకమైన స్థానంలో ఉన్నప్పుడే కాళేశ్వరంకు అనుమతి వచ్చిందని.. అప్పుడు ఏం చేశారని పొన్నాల లక్ష్మయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు.


ఇవి కూడా చదవండి...

AP Elections: వైసీపీ ఆశలన్నీ వాళ్లపైనే.. తేడా వస్తే ఫ్యాన్ ఫ్యూజులౌట్..

AP Election 2024: పెన్షన్ల పంపిణీలో వైసీపీ డ్రామాలు: చంద్రబాబు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 29 , 2024 | 05:01 PM