ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Harish Rao: రైతు రుణమాఫీకి రేషన్ కార్డుల షరతులు ఎందుకు..?

ABN, Publish Date - Jul 16 , 2024 | 03:28 PM

రైతు రుణమాఫీ (Runa Mafi) మార్గదర్శకాలు చూస్తే వడపోతల, రైతుల సంఖ్య కోత మీద దృష్టి పెట్టినట్లు కనిపిస్తోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. రుణమాఫీకి రేషన్ కార్డుల షరతులు ఎందుకని ప్రశ్నించారు.

Harish Rao

హైదరాబాద్: రైతు రుణమాఫీ (Runa Mafi) మార్గదర్శకాలు చూస్తే వడపోతల, రైతుల సంఖ్య కోత మీద దృష్టి పెట్టినట్లు కనిపిస్తోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. రుణమాఫీకి రేషన్ కార్డుల షరతులు ఎందుకని ప్రశ్నించారు. చేతల పాలన పోయి.. షరతుల పాలన వచ్చిందని విమర్శించారు. బ్యాంక్‌లు రేషన్ కార్డులు చూసి రుణం ఇచ్చారా? అని నిలదీశారు. రైతును రైతుగా చూడాలని సూచించారు. రైతు రుణమాఫీకి ఇన్ని షరతులు ఎందుకని ప్రశ్నించారు. రేషన్ కార్డులో విడిపోయినంత మాత్రాన రుణమాఫీకి అర్హులు కారా అని నిలదీశారు. ఇది రైతులను మోసం చేయడమేనని విమర్శించారు. ఏడు నెలలుగా కొత్త రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వట్లేదని అడిగారు.


ALSO Read: CM Revanth Reddy: ఆరోగ్యశ్రీపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..

కుటుంబం, రేషన్ కార్డు అనే షరతులు ఎత్తేయాలని అన్నారు. పీఎం కిసాన్ నిబంధన తీసుకోవడం అంటే 39లక్షల మంది రైతుల రుణమాఫీ ఎగ్గొట్టడమేనని చెప్పారు. రూ.2లక్షల రూపాయలు నేరుగా రైతుల ఖాతాలో జమ చేయాలని అన్నారు. రైతు రుణమాఫీని ఆలస్యం చేసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. స్వల్ప కాలిక రుణాలకే వర్తిస్తుందని అంటూ పండ్ల తోటలు పెట్టిన రైతులకు ఎగ్గొడుతున్నారని మండిపడ్డారు. రీ షెడ్యూల్ రైతులకు వర్తించదంటే రైతులు నష్టపోతారని చెప్పారు. షరతులు ఉపసంహరించుకోవాలని లేదంటే రైతుల పక్షాన పోరాడుతామని తెలిపారు. అసెంబ్లీలో రైతు రుణమాఫీపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని హరీశ్‌రావు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

KTR: ఆరు నెలల్లోగా పార్టీ ఫిరాంపులపై చర్యలు తీసుకోవాలి

Big Breaking: విద్యుత్ కమిషన్ జడ్జిని మార్చాలి: సుప్రీంకోర్ట్

TG News: విద్యార్థిని మృతిపై దిగ్భ్రాంతి..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 16 , 2024 | 03:34 PM

Advertising
Advertising
<