ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Harish Rao: నాకు మంత్రి పదవి వచ్చినప్పుడు టీఆర్ఎస్‌లోనే ఉన్నావ్.. రేవంత్‌పై హరీశ్‌ ధ్వజం

ABN, Publish Date - Aug 01 , 2024 | 05:59 PM

అసెంబ్లీ సమావేశాలు ఈరోజు కూడా వాడివేడిగా జరిగాయి. సభలో మాజీ మంత్రులు హరీశ్‌రావు (Harish Rao), కేటీఆర్‌లపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) తీవ్ర విమర్శలు గుప్పించారు.

హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలు ఈరోజు కూడా వాడివేడిగా జరిగాయి. సభలో మాజీ మంత్రులు హరీశ్‌రావు (Harish Rao), కేటీఆర్‌లపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే అప్పట్లో హరీశ్‌రావు మంత్రి అయ్యారని సీఎం గుర్తుచేశారు. ఈ విషయంపై హరీశ్‌రావు కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. ‘‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అనాడు నాకు మంత్రి పదవి ఎవరి భిక్ష వల్లనో రాలేదు. శ్రీమతి సోనియా గాంధీ గారి కోరిక మేరకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరాము తప్ప పదవుల కోసం కాదు. నాకు మంత్రి పదవి వచ్చినపుడు టీఆర్ఎస్‌లోనే ఉన్నావ్.. ఆ ఊరేగింపులోనూ ఉన్నావు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు కూడా నా వెనకే ఉన్నావ్, నిక్కి నిక్కి చూశావ్. ఇదంతా నీ కళ్ల ముందు జరిగిందే. కానీ ఇవేమి తెలియనట్లు చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నావు. పదవులు, విలువల గురించి మాట్లాడే హక్కు నీకెక్కడిది రేవంత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమంలో పదవులను గడ్డి పోచలుగా త్యజించిన చరిత్ర మాది. పూటకో పార్టీ మారిన రాజకీయ చరిత్ర నీది. పదవుల కోసం పెదవులు మూసుకున్న చరిత్ర నీది. ముఖ్యమంత్రి అయినప్పటికీ హుందాగా ప్రవర్తించడం లేదు. చీఫ్ మినిస్టర్‌గా కాకుండా, చిల్లరగా మాట్లాడే చీప్ మినిస్టర్‌ (#CheapMinister)గా వ్యవహరిస్తున్నావు’’ అని హరీష్‌రావు సెటైర్లు గుప్పించారు.


ALSO Read: CM Revanth: కేసీఆర్‌కు రాజకీయ జీవితం ఇచ్చిందే కాంగ్రెస్

టార్గెట్ చేశారు..!!

తెలంగాణ రాజకీయాలు రోజుకో పరిణామం హీటెక్కిపోతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు మొదలుకుని.. ఇవాళ్టి (8వ రోజు) వరకూ ఎలా జరుగుతున్నాయో మనందరం చూసే ఉంటాం. ఒకరోజు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. మరో రోజు మాజీ మంత్రులు కేటీఆర్, తన్నీరు హరీష్ రావు ఇలా ఒక్కొక్కరిపై సీఎం రేవంత్ రెడ్డి.. మంత్రులు, ఎమ్మెల్యేలు ఓ రేంజిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీ వేదికగా టార్గెట్ చేస్తూ అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పెద్ద మాటల యుద్ధమే నడుస్తూ వస్తోంది. బుధవారం నాడు పార్టీ మార్పులు గురించి చర్చిస్తుండగా.. మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని టార్గెట్ చేస్తూ సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు మాట్లాడరన్నది బీఆర్ఎస్ ప్రధాన ఆరోపణ. ‘కాంగ్రెస్‌లో అన్ని పదవులు అనుభవించి.. అధికారంలో లేకపోయేసరికి పార్టీ మారుతారా..? అయినా ఏ ముఖం పెట్టుకుని వచ్చారు’ అని సభలో సీఎం తీవ్ర అవమానకరంగా మాట్లాడారని సబిత మీడియా వేదికగా భావోద్వేగానికి లోనయ్యారు. సీఎం అవమానకరంగా మాట్లాడారని కంటతడి పెట్టారు. మహిళలపై రాష్ట్ర సీఎంకు ఉన్న గౌరవం ఇదేనా.. శాంతి భద్రతలపై ప్రశ్నించినందుకే టార్గెట్ చేశారని కూడా చెప్పారు.


Also Read: KTR: మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై కేటీఆర్ ఆందోళన

ప్రతిపక్ష నేత సభకు రారు... సీఎం రేవంత్

కాగా.. నిన్న(బుధవారం) తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ మహిళ ఎమ్మెల్యేల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో పెను దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. నిన్న ఉదయం ద్రవ్యవినిమయ బిల్లును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టగా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ చర్చను మొదలు పెట్టారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలంటూ కేటీఆర్‌ డిమాండ్‌ చేస్తుండగా.. మధ్యలో రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకుని మాట్లాడారు. ‘‘ప్రతిపక్ష సభ్యులు కలిసివస్తారనుకున్నాం. కానీ, ప్రతిపక్ష నేత సభకు రారు. కేటీఆర్‌కు సూచన చేస్తున్నా. వెనుక ఉన్న అక్కలు ఇక్కడ ముంచి అక్కడ తేలారు. వాళ్లను నమ్ముకుంటే జూబ్లీ బస్టాండులో కూర్చోవాల్సిందే’’ అని రేవంత్‌ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా గందరగోళానికి దారితీశాయి. తమను ఉద్దేశించే సీఎం ఈ వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్‌ఎస్‌ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, ఇతర బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కుర్చీల్లోంచి లేచి నిరసన తెలిపారు. వెల్‌లోకి దూసుకొచ్చి పోడియంను చుట్టుముట్టారు.


ALSO Read: TG Assembly: ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు.. నేడు 3 బిల్లులను ప్రవేశపెడుతున్న ప్రభుత్వం

సబితారెడ్డి కంటతడి

ఒకానొక సందర్భంలో మాజీ మంత్రి సబిత కంటతడి పెట్టారు. తనను ఎందుకు టార్గెట్ చేశారని ప్రశ్నించారు. ‘‘ఓ అక్కగా కాంగ్రెస్‌లోకి రా తమ్ముడూ అని రేవంత్‌ను ఆహ్వానించానని, కాంగ్రెస్‌లో ఆశాకిరణం అవుతావని, సీఎం అవుతావని ఆశీర్వదించాను’’ అని సబిత తెలిపారు. దీంతో సీఎం రేవంత్‌ మళ్లీ కల్పించుకుంటూ.. తనను మోసం చేసిన సబితక్కతో జాగ్రత్తగా ఉండాల్సిందిగా కేటీఆర్‌కు సూచన చేశానని అన్నారు. ‘‘ సబితక్క నన్ను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించిన మాట వాస్తవం. 2019లో మల్కాజిగిరి నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్‌ పార్టీ నన్ను కోరింది. అక్కడి నుంచి పోటీ చేస్తే అండగా ఉంటానని సబితక్క నాకు మాట ఇచ్చారు. కానీ, కాంగ్రెస్‌ పార్టీ నన్ను అభ్యర్థిగా ప్రకటించగానే.. ఆమె బీఆర్ఎస్‌లోకి వెళ్లి మంత్రి పదవి పొందారు’’ రేవంత్‌ అన్నారు. అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా బీఆర్‌ఎస్‌పై ఎదురు దాడికి దిగారు. 2004 నుంచి 2009 వరకు కాంగ్రెస్ పార్టీ సబితా ఇంద్రారెడ్డికి అనేక పదవులు ఇచ్చింది. కానీ.. సబితా ఇంద్రారెడ్డి పార్టీని వీడి బీఆర్ఎస్‌లో చేరి మోసం చేశారు. ఒక దశాబ్ద కాలం సబితకు మంత్రి పదవి ఇచ్చాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుంటే సబిత బీఆర్ఎస్‌లోకి వెళ్ళారు. కాంగ్రెస్ నన్ను సీఎల్పీ లీడర్ చేస్తే నా వెనక ఉండాల్సింది పోయి పదవి కోసం సబిత పార్టీ మారారు’’ అంటూ భట్టి విమర్శలు గుప్పించారు. సీఎం, డిప్యూటీ సీఎం వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్‌ఎస్ సభ్యులు నిరసనకు దిగారు. స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. అయితే సభ్యుల ఆందోళనల మధ్యే ద్రవ్యవినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది.


ఈ వార్తలు కూడా చదవండి

KTR: నిండుసభలో మహిళల పట్ల వారి వ్యాఖ్యలు అత్యంత అవమానకరం...

Hyderabad: స్మితా సబర్వాల్‌ను తొలగించాలంటూ నిరసన

CM Revanth: వర్గీకరణపై సుప్రీం తీర్పుపై అసెంబ్లీలో సీఎం రేవంత్ ఏమన్నారంటే?

TG Assembly Sessions: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరెస్ట్..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 01 , 2024 | 06:36 PM

Advertising
Advertising
<