ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Harish Rao: ఫాంహౌస్ ఘటన వెనుక ప్రభుత్వ కుట్ర.. హరీష్‌రావు ధ్వజం

ABN, Publish Date - Oct 28 , 2024 | 03:21 PM

కేసీఆర్ పథకాలను కూడా రేవంత్ ప్రభుత్వం కొనసాగించలేకపోతుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు విమర్శించారు. రూ. 15వేల సంగతి అటుంచితే.‌. ఉన్న రూ. 10 వేల రైతుబంధు కూడా లేకుండా చేసిన ఘనత రేవంత్ సర్కార్‌ది అని హరీష్‌రావు విమర్శించారు.

హైదరాబాద్: మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫామ్‌హౌస్ ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు స్పందించారు. కేటీఆర్‌కు మద్దతుగా హరీష్‌రావు మాట్లాడారు. ఇవాళ(సోమవారం) తెలంగాణ భవన్‌లో హరీష్‌రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డిపై హరీష్‌రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఫాంహౌస్ ఘటన వెనుక రేవంత్ ప్రభుత్వ కుట్ర ఉందని ఆరోపించారు. అది ఫాంహౌస్ కాదు.. రాజ్ పాకాల కొత్త ఇల్లు అని తేల్చిచెప్పారు. రేవ్ పార్టీ అని కాంగ్రెస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని... అది రేవ్ పార్టీ కాదు.. ఫ్యామిలీ ఫంక్షన్ అని స్పష్టం చేశారు.


ALSO READ: Hyderabad: రూ.8 కోట్లు ఇవ్వలేదని భర్తను హత్య చేసి.. పోలీసులకు దొరక్కుండా..

బండి సంజయ్‌వి అవాస్తవాలు

రేవ్ పార్టీలో పిల్లలు, వృద్ధులు ఉంటారా అని ప్రశ్నించారు. రాజకీయంగా ఎదుర్కొలేకనే.. కేటీఆర్‌పై బురద జల్లుతున్నారని విమర్శించారు. మూసీ విషయంలో పేదల పక్షాన పోరాడుతున్నందునే కేటీఆర్‌ను రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరదీశారని విమర్శించారు. వివిధ వర్గాల నుంచి వస్తోన్న వ్యతిరేకతతో రేవంత్ రెడ్డి వణికిపోతున్నారని అన్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనస్థాయికి తగ్గించుకుని మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి తానా అంటే.. బండి సంజయ్ తందానా అంటున్నారని విమర్శలు చేశారు. బాధ్యత కలిగిన పదవీలో ఉండి బండి సంజయ్ అవాస్తవాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తరుఫున బండి సంజయ్ వకాల్తా పుచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందా.. ఆర్ఎస్. బ్రదర్స్ ప్రభుత్వం నడుస్తోందా.. అని విమర్శించారు.


రేవంత్ రెడ్డికి మెదడు నిండా విషం...

రేవంత్ రెడ్డికి బండి సంజయ్ సహాయమంత్రిగా పనిచేస్తున్నారని విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డికి మెదడు నిండా విషం తప్ప.‌.‌ విజన్ లేదని ఎద్దేవా చేశారు. కేటీఆర్ క్యారెక్టర్‌ను దెబ్బతీసే ప్రయత్నం చేయటం మంచిది కాదని హెచ్చరించారు. ఫామ్‌హౌస్ ఫంక్షన్‌లో కేటీఆర్ సతీమణి లేరని తేల్చిచెప్పారు. హత్యా రాజకీయాలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీనే రోడ్డు మీదకొచ్చారని గుర్తుచేశారు. మూసీ విషయంలో నల్లగొండ రైతులతో రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులే రోడ్డు‌ మీదకు రావటం చరిత్రలో మెదటసారి అని గుర్తుచేశారు.రుణమాఫీపై ప్రశ్నించినందుకు రేవంత్ రెడ్డి తనను బాడీ షేమింగ్ చేశారని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి చేతకానితనం వల్లే తెలంగాణ ఆదాయం పడిపోయిందని ఆరోపించారు.


ALSO READ: Drugs: మా పేర్లు ఎందుకో రావడం లేదు.. షబ్బీర్ అలీ

ప్రజలు తిరగబడుతున్నారు..

11నెలల రేవంత్ రెడ్డి పాల‌‌న.. ప్రజాపాలన కాదు ప్రజాపీడన అని ఆక్షేపించారు. పోలీసుల మీదనే నిర్భందాలు పెట్టిన ఘనత రేవంత్ రెడ్డిది అని విమర్శించారు. సీఎం వికృతమైన వైఖరిని చూస్తూ ప్రజలు విస్తుపోతున్నారని అన్నారు.11నెలల్లోనే కాంగ్రెస్ సర్కార్‌పై ప్రజలు తిరగబడుతున్నారన్నారు. నోటికి వచ్చినట్లు తిట్టడమే సీఎం రేవంత్‌కు తెలుసు అని ఎద్దేవా చేశారు. ఏడాదిలో 2లక్షల ఉద్యోగాలు కాదు.. 20వేల ఉద్యోగాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని తీసుకొని అశోక్ నగర్‌కు వచ్చే దమ్ము రేవంత్‌కు ఉందా అని సవాల్ విసిరారు. కేసీఆర్ పథకాలను కూడా రేవంత్ ప్రభుత్వం కొనసాగించలేకపోతుందని విమర్శించారు. రూ. 15వేలు సంగతి అటుంచితే.‌. ఉన్న రూ. 10 వేల రైతుబంధు కూడా లేకుండా చేసిన ఘనత రేవంత్ సర్కార్‌ది అని విమర్శించారు. పత్తికి మద్దతు ధర రాకపోయునా మంత్రులు ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. సోయాబీన్ రైతుల ఉసురు రేవంత్ రెడ్డి పోసుకుంటున్నారని మండిపడ్డారు. రైతులు కలెక్టర్ కాళ్ల మీద పడే దుస్థితి రేవంత్ తీసుకొచ్చారని హరీష్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

Raj Pakala: పోలీసుల నోటీసులపై రాజ్‌పాకాల స్పందన

Vemula: కేసీఆర్ సూచించిన వారికి పీఏసీ చైర్మన్ ఇవ్వాలి

TG News: హైదరాబాద్‌లో ఫుడ్ పాయిజన్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 28 , 2024 | 04:21 PM