ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

HARISH RAO: ఎమ్మెల్యేలకు ట్రైనింగ్.. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్‌రావు సెటైర్లు

ABN, Publish Date - Dec 16 , 2024 | 11:24 AM

ఎమ్మెల్యేలకు ఇచ్చిన శిక్షణ ఇదేనా అధ్యక్ష అంటూ మాజీ మంత్రి హరీష్‌రావు సెటైర్లు గుప్పించారు. పంచాయతీ సిబ్బందికి వేతనాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించడం లేదని చెప్పారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు పెన్షన్స్ ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పారని గుర్తుచేశారు.

హైదరాబాద్: సర్పంచులకు బిల్లులు ఇవ్వకుండా గోస పెడుతున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు అన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Winter Sessions) ఇవాళ(సోమవారం) ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. ముందుగా ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. తర్వాత సభలో ప్రభుత్వం రెండు కీలక బిల్లులు ప్రవేశపెట్టనుంది. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లు, తెలంగాణ యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెడతారు.


అనంతరం ఇటీవల మృతిచెందిన మాజీ ఎమ్మెల్యేలు కొమిరెడ్డి జ్యోతి, ఊకే అబ్బయ్య, రామచంద్రారెడ్డికి శాసన సభ సంతాపం తెలుపనుంది. అనంతరం సభలో టూరిజం పాలసీపై లఘు చర్చ జరగనుంది. ప్రశ్నత్తోరాల సమయంలో హరీష్‌రావు మాట్లాడుతూ... గవర్నర్‌ను వెళ్లి కలవాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. 19గ్రామ పంచాయతీలకు అవార్డు తెచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదని చెప్పారు. హరీష్‌రావు ప్రసంగానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడ్డు తగులుతున్నారు.


ఎమ్మెల్యేలకు ఇచ్చిన శిక్షణ ఇదేనా అధ్యక్ష అంటూ హరీష్‌రావు సెటైర్లు గుప్పించారు. తెలంగాణకు వెళ్తే చికెన్ గున్యా వస్తుందని అమెరికా ఆ దేశ పౌరులను హెచ్చరించిందని.. ఆ పరిస్థితికి పల్లెలను సీఎం రేవంత్‌రెడ్డి తెచ్చారని విమర్శించారు. పంచాయతీ సిబ్బందికి వేతనాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించడం లేదని చెప్పారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు పెన్షన్స్ ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పారని గుర్తుచేశారు. పెన్షన్స్ ఏమో గాని అసలు వేతనాలే ఇవ్వడం లేదని హరీష్‌రావు అన్నారు.


ఆ బిల్లులను వెంటనే విడుదల చేయాలి: పల్లా రాజేశ్వర్ రెడ్డి

బచ్చన్నపేట మండలం నాగిరెడ్డిపల్లి సర్పంచ్ బిల్లులు రాక ఇల్లును కుదువ పెట్టుకున్నారని పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. బిల్లుల కోసం సర్పంచ్‌లు కలుద్దామని హైదరాబాద్‌కు వస్తే అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. సర్పంచ్‌లు చేసిన పనుల బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

TG Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఈరోజు రెండు కీలక బిల్లులు..

K Kavitha: ప్రభుత్వ జీవోను ధిక్కరించి..

TG Govt: దుబారా వద్దు!

Read Latest Telangana News and Telugu News

Updated Date - Dec 16 , 2024 | 11:27 AM