ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Harish Rao: యాదాద్రికి బయలు దేరిన హరీష్‌రావు.. నేడు రుణమాఫీపై బీఆర్ఎస్ ధర్నా

ABN, Publish Date - Aug 22 , 2024 | 10:22 AM

రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. రైతులు అందరికీ ఆగస్టు 15వ తేదీ లోపు రుణమాఫీ చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి సాక్షిగా ప్రమాణం చేసి మాట తప్పారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.

హైదరాబాద్: రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. రైతులు అందరికీ ఆగస్టు 15వ తేదీ లోపు రుణమాఫీ చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి సాక్షిగా ప్రమాణం చేసి మాట తప్పారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు కొంతమందికే రుణమాఫీ చేసి చేతులు దులుపుకున్నారని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు నుంచి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ఆలయాల యాత్ర చేపడుతున్నట్లు తెలిపారు.


యాదాద్రి ఆలయం నుంచి తెలంగాణలోని అన్ని ఆలయాలను సందర్శించనున్నట్ల వెల్లడించారు. అయితే యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దర్శనానికి హైదరాబాద్ నివాసం నుంచి హరీష్‌రావు కాసేపటి క్రితమే బయలు దేరారు. ఆయన వెంట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు ఉన్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం అనంతరం ఆలేరులో మీడియా సమావేశంలో హరీష్‌రావు మాట్లాడనున్నారు. అయితే , తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు ధర్నాలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. అన్ని మండల కేంద్రాల్లో ఇవాళ గులాబీ పార్టీ నేతలు ధర్నాలు చేపట్టనున్నారు. ఎలాంటి షరతులు లేకుండా రూ.2లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేయనున్నారు. చేవెళ్లలో మాజీ మంత్రి కేటీఆర్, ఆలేరు రైతు ధర్నాలో హరీష్ రావు పాల్గొననున్నారు.

Updated Date - Aug 22 , 2024 | 10:39 AM

Advertising
Advertising
<