ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Harish Rao: బడ్జెట్‌లో ఆరు గ్యారెంటీల ముచ్చటే లేదు

ABN, Publish Date - Jul 25 , 2024 | 06:14 PM

తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బీఆర్ఎస్ నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే బడ్జెట్‌పై మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. తాజాగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) స్పందించారు.

Harish Rao

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) ఈరోజు (గురువారం) ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బీఆర్ఎస్ నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే బడ్జెట్‌పై మాజీ సీఎం కేసీఆర్ (KCR) స్పందించారు. తాజాగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) గట్టి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వంపై అనవసరపు విమర్శలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు.


భట్టి రాజీనామా చేస్తావా..?

ఈ సందర్భంగా బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన పలు విషయాలపై హరీశ్‌రావు భట్టికి సవాల్ విసిరారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో హరీశ్‌రావు మాట్లాడుతూ.. భూముల అమ్మకానికి రంగం సిద్ధం చేశారని బడ్జెట్ చూస్తే అర్థమవుతోందని చెప్పారు. వైద్య శాఖలో 30వేల ఉద్యోగాలు భర్తీ చేశామని అన్నారని.. గత ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయలేదని భట్టి ఎలా అంటారని ప్రశ్నించారు. ‘నీ మాటలకు కట్టుబడతావా..? నువ్వైనా రాజీనామా చేస్తావా.. నేనైనా రాజీనామా చేస్తా. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర బడ్జెట్ గురించి మాట్లాడారు. కేటీఆర్ మాట్లాడితే మా పార్టీ మాట్లాడినట్లే. రాష్ట్ర బడ్జెట్ చూస్తే ఆత్మస్తుతి పరనిందలా ఉంది. బడ్జెట్ అన్నివర్గాలను నిరాశ పరిచింది. ఎన్నికలప్పుడు గ్యారంటీల గారడి బడ్జెట్‌లో అంకెల గారడి చేశారు. 6 గ్యారంటీల ముచ్చట లేదు. ప్రజలను బురిడీ కొట్టించేందుకు భట్టి గట్టి ప్రయత్నం చేశారు. ఇది దశా దిశా లేని బడ్జెట్. బడ్జెట్ అప్పుల్లో గత ప్రభుత్వం కంటే రూ.17వేల కోట్లు ఎక్కువ చూపించారు. మేనిఫెస్టోను కాంగ్రెస్ మరిచిపోయింది’’ అని హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


బడ్జెట్ నిరాశ పర్చింది

‘‘రూ.2, 500 కోసం ఎదురు చూస్తున్న మహిళలను బడ్జెట్ నిరాశ పరిచింది. అవ్వ, తాతలకు రూ. 4వేల ఆసరా పెన్షన్ ఏమైంది..?. బడ్జెట్‌లో ఎందుకు పెట్టలేదు...? మాది పేదల ప్రభుత్వం అని చెప్పుకునే అర్హతనే మీకు లేదు. విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తాం అన్నారు. ఏమైంది..?రేషన్ కార్డుల ప్రస్తావన లేదు. ఎప్పటి నుంచి ఇస్తారు..? ఉద్యోగ నియామకాలు ఎప్పటి నుంచి చేస్తారు....? ఆటో కార్మికులకు రూ.12వేలు ఇస్తామన్నారు. వారిని బడ్జెట్ నిరాశ పరిచింది. చేనేతకు బడ్జెట్‌లో గుండు సున్నా. హైదరాబాద్‌లో కేసీఆర్ చేసిన అభివృద్ధిని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పొగిడారు. హైదరాబాద్ అభివృద్ధి రజినీకాంత్‌కు అర్థమైంది. కానీ కాంగ్రెస్ గజినీలకు అర్థం కావడం లేదు. హైదరాబాద్‌ను 13వ స్థానం నుంచి నవంబర్ వన్ స్థానానికి తీసుకువచ్చాం. పంజాబ్‌ను మించి వరి ధాన్యం పండించే స్థాయికి ఎదిగామని అంటే కేసీఆర్ ఘనత కాదా..? రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తారని నమ్మాం. రూ.15, 470 కోట్లు మాత్రమే రుణమాఫీకి కేటాయించారు’’ అని హరీశ్‌రావు తెలిపారు.


రుణమాఫీ ఎలా చేస్తారు..?

‘‘మరి ఏకకాలంలో రుణమాఫీ ఎలా చేస్తారు..? రైతు భరోసా విధి విధానాలు అని కోత పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక‌గాంధీ చెప్పిన మాటలు నీటి మూటలు అయ్యాయి. వీటన్నింటిపై బడ్జెట్ ప్రసంగంలో నిలదీస్తాం. ఇరిగేషన్‌కు కేటాయింపులు తగ్గాయి. దళిత బంధు ప్రస్తావన లేదు. గిరిజన బంధు ఊసే లేదు. ఈ ఏడాది కొత్త పెన్షన్ ఇవ్వరు, రూ.4వేలకు పెంచరని తేలిపోయింది. పీఆర్సీ, 5 డీఏల ప్రస్తావన బడ్జెట్‌లో లేదు. ఉద్యోగులను కూడా మోసం చేసింది. ఎక్సైజ్ రాబడిని పెంచుతామని బడ్జెట్‌లో చెప్పారు. తాగుబోతుల తెలంగాణ చేస్తారా’’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు.

Updated Date - Jul 25 , 2024 | 06:28 PM

Advertising
Advertising
<