ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Harish Rao: అందుకే మహారాష్ట్రాలో పోటీ చేయట్లేదు.. హరీష్‌రావు షాకింగ్ కామెంట్స్

ABN, Publish Date - Nov 10 , 2024 | 01:27 PM

రుణమాఫీపై మహారాష్ట్రలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్దాలేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు విమర్శించారు. రుణమాఫీ బోగస్, రైతుబంధు బోగస్, వరికి బోనస్ బోగస్. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు.. గ్యారేజ్‌కు పోయాయని హరీష్‌రావు ఆరోపించారు.

హైదరాబాద్: మహారాష్ట్ర ఎన్నికలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు స్పందించారు. మహారాష్ట్రాలో బీఆర్ఎస్‌కు పొలిటికల్‌గా గ్రౌండ్ లేదని అన్నారు. అందుకే మహారాష్ట్ర ఎన్నికల్లో‌ తాము పోటీ చేయటం లేదని స్పష్టం చేశారు. మహారాష్ట్రకు డబ్బులు పంపించే పనిలో సీఎం రేవంత్ బిజీగా ఉన్నారని ఆరోపించారు. ఇవాళ(ఆదివారం) తెలంగాణ భవన్‌లో హరీష్‌రావు మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మహారాష్ట్ర ఎన్నికలకు రేవంతే డబ్బులు సమకూర్చుతున్నారని హరీష్‌రావు విమర్శలు చేశారు.


మహారాష్ట్రాలో ప్రచారం చేయం..

‘‘పాలన గాలికి వదిలేసి మంత్రులు రాష్ట్రాల బాట పట్టారు. తెలంగాణ డబ్బును రేవంత్ రెడ్డి ఇతర రాష్ట్రాలకు పంపుతున్నాడు. మహారాష్ట్రాలో ఏ పార్టీకి అనుకూలంగా.. వ్యతిరేకంగా ప్రచారం చేయం. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపై వాస్తవాలు చెప్పటం మా బాధ్యత. నిజాలు చెప్పటానికి మహారాష్ట్రకు వెళ్లిన రేవంత్ రెడ్డి అబద్దాలు చెప్పి వచ్చారు. రుణమాఫీపై మహారాష్ట్రలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్దాలే. రుణమాఫీ బోగస్, రైతుబంధు బోగస్, వరికి బోనస్ బోగస్. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు.. గ్యారేజ్‌కు పోయాయి. రోడ్ల మీదున్న వడ్ల కుప్పలే.. రేవంత్ రెడ్డి అసమర్థ పాలనకు నిదర్శనం. 2లక్షల ఉద్యోగాల కల్పనపై మహారాష్ట్రాలో రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు చెప్పారు. విద్యార్థులను వీపులు పగలగొట్టించిన చరిత్ర కాంగ్రెస్ సర్కార్‌ది. 40లక్షల మందికి రుణమాఫీ చేశామని రేవంత్ అబద్దాలు చెప్పారు. ఇంకా 22లక్షల మందికి రుణమాఫీ జరగాల్సి ఉంది. పూర్తి రుణమాఫీ చేసి తీరాల్సిందే. ఒక్కొక్క రైతుకూలీకి రూ.8వేలు కాంగ్రెస్ సర్కార్ బాకీ ఉంది’’ అని హరీష్‌రావు తీవ్ర విమర్శలు గుప్పించారు.

Updated Date - Nov 10 , 2024 | 01:29 PM