ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్‎రావు సంచలన ఆరోపణలు

ABN, Publish Date - Aug 31 , 2024 | 05:40 PM

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీమంత్రి, బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‎రావు సంచలన విమర్శలు గుప్పించారు. మంత్రి ఉత్తమ్‎కి హరీష్‎రావు కౌంటర్ ఇచ్చారు. మాజీ సీఎం కేసీఆర్‎ను డెకాయిట్ అని ఉత్తమ్ సంభోదించడం ఆయన దిగజారుడు మనస్తత్వానికి నిదర్శనమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీమంత్రి, బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‎రావు సంచలన విమర్శలు గుప్పించారు. మంత్రి ఉత్తమ్‎కి హరీష్‎రావు కౌంటర్ ఇచ్చారు. మాజీ సీఎం కేసీఆర్‎ను డెకాయిట్ అని ఉత్తమ్ సంభోదించడం ఆయన దిగజారుడు మనస్తత్వానికి నిదర్శనమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు(శనివారం) తెలంగాణ భవన్‎లో హరీష్‎రావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హరీష్‎రావు మాట్లాడుతూ... బూతులు మాట్లాడటంలో, అన్ పార్లమెంటరీ భాషను ఉపయోగించడంలో ముఖ్యమంత్రి రేవంత్‎కు తానేమి వెనుకబడలేనని నిరూపించాలనుకున్నావా ఉత్తమ్..? అని ప్రశ్నించారు.పేరేమో ఉత్తమ్ కుమార్.. మాట తీరేమో మూసీ ప్రవాహం అని హరీష్‎రావు విమర్శలు చేశారు.


ప్రక్షాళన చేయాలి..

‘‘రేవంత్ నోటితో పాటూ ఉత్తమ్ నోరు కూడా ప్రక్షాళన చేయాల్సి ఉంది. జలయజ్ఞంలో ఈపీసీ కాంట్రాక్ట్ పద్ధతిని ప్రవేశపెట్టి ఇష్టమున్నట్లు ప్రాజెక్టుల ఆంచనా విలువలను పెంచేసి, ఏజెన్సీలకు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టి, నిబంధనలకు విరుద్ధంగా సర్వే, డిజైన్ అడ్వాన్స్‎లను 0.5 శాతం నుంచి 3.5 శాతానికి పెంచి తెలంగాణను డెకాయిట్ చేసింది ఎవరు ? వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నదెవరు ? మీరు కాదా ఉత్తమ్? ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.17 వేల కోట్ల నుంచి తట్ట మట్టి ఎత్తకుండానే రూ.40 వేల కోట్లకు పెంచుకున్న సంగతిని మరచిపోయావా ఉత్తమ్..? ఇగో మీ కాంగ్రెస్ డెకాయి‎ట్ గురించి ఇప్పటికే ఎన్నోసారు చెప్పి ఉన్నా. మళ్లీ గుర్తు చేస్తున్నాను’’ అని హరీష్‎రావు తెలిపారు.


అడ్వాన్స్‎లు దండుకున్నారు..

‘‘తుమ్మిడిహట్టి బ్యారేజి నిర్మాణానికి మహారాష్ట్రాతో ఎలాంటి ఒప్పందం చేసుకోకుండానే ప్రాజెక్టు పనులని 7 లింకులు, 28 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు ఖరారు చేసి తలను వదిలేసి తోక దాకా ఏక కాలంలో పనులని ప్రారంభించి అడ్వాన్స్‎లు దండుకున్నది మీరు కాదా? 2010లో కేంద్ర ప్రభుత్వానికి డీపీఆర్‎ని రూ.40,300 కోట్లకు సవరించి పంపింది నువ్వు మంత్రిగా ఉన్న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కాదా’’ అని హరీష్‎రావు ప్రశ్నల వర్షం కురిపించారు.

Updated Date - Aug 31 , 2024 | 05:59 PM

Advertising
Advertising