ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Heavy Rain: హైదరాబాద్‌లో కుండపోతగా వర్షం

ABN, Publish Date - Jun 23 , 2024 | 05:45 PM

భాగ్యనగరంలో భారీ వర్షం దంచికొడుతోంది. ఆకాశం మేఘావృతమై ఒక్కసారిగా కారు మబ్బులు కమ్ముకున్నాయి. భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. వర్షం వల్ల పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

హైదరాబాద్: భాగ్యనగరంలో భారీ వర్షం దంచికొడుతోంది. ఆకాశం మేఘావృతమై ఒక్కసారిగా కారు మబ్బులు కమ్ముకున్నాయి. భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. వర్షం వల్ల పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఉపరితల ఆవర్తనంతో వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. నగరంలోని ఫిలింనగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్ పేట, సనత్ నగర్, LB నగర్, నాగోల్, చైతన్యపురి, కొత్తపేట్‌, ముషీరాబాద్, చిక్కడపల్లి , రాంనగర్, ముషీరాబాద్, అశోక్ నగర్ పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది.


మలక్‌పేట రైల్వే బ్రిడ్జి కింద భారీగా వరద నీరు చేరింది. చాదర్ ఘట్ నుంచి దిల్ సుఖ్ నగర్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ మళ్లించేందుకు పోలీసుల చర్యలు చేపడుతున్నారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం నెలకొంది. వనస్థలిపురం వద్ద భారీ వర్షానికి హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి నీటితో నిండిపోయాయి. రహదారి విస్తరణ పనులు చేస్తుండటంతో వరద నీటితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు చింతల్‌కుంట వద్ద ట్రాఫిక్‌ జామ్‌ అయింది. వరదనీటిలో వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి.

Updated Date - Jun 23 , 2024 | 05:59 PM

Advertising
Advertising