ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG News: ఆ ఇంట్లో అసాంఘిక కార్యకలాపాలు.. పోలీసులు ఏం చేశారంటే..?

ABN, Publish Date - Jul 07 , 2024 | 09:15 PM

భాగ్యనగరంలోని జూబ్లీహిల్స్‌లో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ ఇంట్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించారు.

హైదరాబాద్: భాగ్యనగరంలోని జూబ్లీహిల్స్‌లో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ ఇంట్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

రియల్టర్ సింగోటం రాము (Realtor Singotham Ramu) హత్య జరిగిన ఇంటిని సీజ్ చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్ఎన్ నగర్‌లో ఫిబ్రవరి 7న రాము హత్య జరిగిన విషయం తెలిసిందే. హత్య జరిగిన ఇంట్లో నిందితురాలు ఇమాంబి ఆమె కుమార్తె ఉంటున్నారని పోలీసులు తెలిపారు. వీరిద్దరు వ్యభిచార గృహం పేకాట తదితర అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల నివేదిక ఆధారంగా ఇంటిని ఖాళీ చేయించి సీజ్ చేయాలని సికింద్రాబాద్ ఆర్డీవో ఆదేశించారు.


ఆర్డీఓ ఆదేశాలతో ఇమాంబి అక్రమంగా ఉంటున్న ఇంటిని ఖాళీ చేయించారు. అనంతరం ఇంటిని జూబ్లీహిల్స్ పోలీసులు సీజ్ చేశారు. తమ బస్తీలో హిమాంబి అసాంఘిక కార్యక్రమాలు పాల్పడుతూ బెదిరింపులకు గురిచేస్తుందంటూ ఇటీవల స్థానికులు వెస్ట్ జోన్ డీసీపీతో పాటు హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌ను కాలనీవాసులు ఆశ్రయించారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇంటిని రెవెన్యూ , పోలీసు అధికారులు సీజ్ చేశారు.

Updated Date - Jul 07 , 2024 | 09:18 PM

Advertising
Advertising
<