ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Fraud: యాత్రల పేరిట భారీ మోసం.. ఆఫర్స్ పేరుతో కోట్లలో ...

ABN, Publish Date - Dec 01 , 2024 | 05:59 PM

హైదరాబాద్‌లో మరో మోసం వెలుగులోకి వచ్చింది. ట్రావెల్స్ విహార యాత్రల పేరుతో ఓ మాయగాడు భారీ మోసం చేశాడు. కేటుగాడి మాటలు నమ్మి డబ్బులు పోగొట్టుకున్న బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు.

హైదరాబాద్: హైదరాబాద్‌లో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. పర్యాటక క్షేత్రాలకు పంపిస్తామని ఓ సంస్థ బాధితులను మోసం చేసింది. ఈ సంఘటన హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో బయటపడింది. బాధితులను మోసం చేసి భారీగా వసూళ్లకు ఓ కేటుగాడు పాల్పడ్డాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం బయటకు వచ్చింది. పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. వివరాల్లోకి వెళ్తే.. ఉప్పల్‌లో ఉండే శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ విహార యాత్రల పేరుతో సుమారు 15 కోట్ల మేర భారీ మోసానికి పాల్పడింది. ప్రముఖ పుణ్యక్షేత్రాల పేరుతో శ్రీ గాయత్రి టూర్స్ ట్రావెల్స్ భారీగా ఆఫర్లను ప్రకటించింది. పలు ఆఫర్ల పేరుతో కోట్లల్లో వసూళ్లకు పాల్పడింది. ఉప్పల్ కళ్యాణపురిలో భరత్ కుమార్ అనే వ్యక్తి శ్రీ గాయత్రి టూర్స్ ట్రావెల్స్ నిర్వహిస్తున్నారు.


మానససరోవరం, ఇతర టూర్స్ పేరిట సోషల్ మీడియాలో భారీగా పబ్లిసిటీ చేసుకుంటూ గత ఐదేళ్ల నుంచి దాదాపు రూ. 15 కోట్లను శ్రీ గాయత్రీ ట్రావెల్స్ నిర్వాహకుడు భరత్ కుమార్ వసూళ్లు చేశాడు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక తమిళనాడుకు చెందిన యాత్రికుల వద్ద భారీగా వసూళ్లకు పాల్పడ్డాడు. ఇప్పుడు.. అప్పుడు అంటూ గత మూడేళ్ల నుంచి కరోనా పేరు చెప్పి మాయగాడు తప్పించుకు తిరుగుతున్నాడు.


బాధితుల నుంచి తీసుకున్న డబ్బులు ఇవ్వకపోవడం, మాయమాటలు చెబుతూ రేపు మాపంటూ టూర్‌లకు వెళ్తారని నిర్వాహకుడు మోసం చేశాడు. ఒక్కొక్కరి నుంచి రూ. 2 నుంచి రూ. 3 లక్షల వరకు వసూళ్లు చేశాడు. ఈ కేటుగాడి చేతిలో సుమారు 500 మందికి పైగా బాధితులు మోసపోయారు. మోసపోయామని గ్రహించిన బాధితులు ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిర్వాహకుడు భారత్ కుమార్ శర్మను ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అయిన భరత్ కుమార్ బెయిల్‌పై బయటకు వచ్చి మళ్లీ యాత్రల పేరిట వసూలు చేస్తున్నాడని బాధితులు ఆరోపణలు చేస్తున్నారు. భరత్ కుమార్‌ను వెంటనే అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని ఉప్పల్ పోలీస్ స్టేషన్ ముందు బాధితుల ఆందోళన చేపట్టారు.

Updated Date - Dec 01 , 2024 | 06:10 PM