Hyderabad: పార్ట్‌టైమ్ జాబ్ పేరుతో 5.7 లక్షలు టోకరా..
ABN, Publish Date - Jul 17 , 2024 | 06:32 PM
మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తిని దారుణంగా మోసం చేశారు సైబర్ క్రైమ్ నిందితుడు. బాధితుడి వద్ద నుంచి ఏకంగా 5.7 లక్షలు కాజేశారు. ఈ కేసులో ఒకరిని అరెస్ట్ చేయగా.. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్, జులై 17: మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తిని దారుణంగా మోసం చేశారు సైబర్ క్రైమ్ నిందితుడు. బాధితుడి వద్ద నుంచి ఏకంగా 5.7 లక్షలు కాజేశారు. ఈ కేసులో ఒకరిని అరెస్ట్ చేయగా.. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బాధితుడు జగదీష్ హైదరాబాద్‌లో నివాసముంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే, ఇంతలో గుర్తు తెలియని వ్యక్తి కాల్ చేసి ఆన్‌లైన్ డేటా ఎంట్రీ ఉద్యోగం ఉందని.. పనితీరు నచ్చితే మల్టీనేషన్ కంపెనీలో ఉద్యోగం కల్పిస్తామంటూ నమ్మబలికారు. అది నమ్మిన బాధితుడు.. అతను చెప్పిన ప్రతీది చేశాడు. అలా మొత్తం రూ. రూ. 5,73,208 నిందితులకు సమర్పించుకున్నాడు.
చివరకు తాను మోసపోయినట్లు గ్రహించి.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడు బిందె పవన్ కళ్యాణ్ ఖమ్మం జిల్లాలోని ఇల్లందు వాసిగా గుర్తించి అరెస్ట్ చేశారు. అతనిపై Cr. No. 854/2024 U/s 66 C D ఆఫ్ ITA చట్టం, 419, 420 PS సైబర్ క్రైమ్స్ IPC. కింద కేసులు నమోదు చేశారు. నిందితుడు గతంలో ఇంటర్నెట్ కేఫ్ నడిపేవాడని.. డబ్బును సంపాదించే ఉద్దేశంతో చెడుమార్గంలో నడిచాడని పోలీసులు వివరించారు. ఈ క్రమంలోనే ‘టీక్యూఆర్ కంపెనీ’ పేరుతో ప్రజలకు ఫోన్ చేసి.. ఉద్యోగం పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు.
అలర్ట్..
సైబర్ మోసాల విషయంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి.
అయాచిత కాల్స్, మెసేజ్‌లు, ఈమెయిల్స్ వస్తే.. తమ వ్యక్తిగత, ఆర్థిక పరమైన వివరాలను షేర్ చేసుకోవద్దు.
గుర్తు తెలియని లింక్స్, మెసేజ్‌లు, స్కానర్స్ వస్తే వాటిపై క్లిక్ చేయొద్దు.
మొబైల్ ఫోన్లలో ఎలాంటి ఏపీకే ఫైల్స్‌ని ఇన్‌స్టాల్ చేయొద్దు.
పార్ట్‌టైమ్ జాబ్ అంటూ తెలియని వ్యక్తులు ఇచ్చే ఆఫర్లకు మోసపోవద్దు.
తెలియని వ్యక్తులెవరికీ మీ వ్యక్తిగత సమాచారం, ఆర్థిక పరమైన వివరాలు ఇవ్వొద్దు.
బ్యాంక్ ఖాతా వివరాలు, పాస్‌వర్డ్స్, ఓటీపీ నెంబర్స్ అపరిచితులకు ఇవ్వొద్దు.
తెలియని వారికి ఆర్థిక పరమైన వివరాలు చెప్పడం, డబ్బు జమ చేయడం వంటివి చేయొద్దు.
For More Telangana News and Telugu News..
Updated Date - Jul 17 , 2024 | 06:32 PM