Hyderabad: ఈనెల 25న నాగోల్ మెట్రోస్టేషన్ వద్ద మహాధర్నాకు పిలుపు..
ABN , Publish Date - Aug 23 , 2024 | 04:07 PM
నగర మెట్రోస్టేషన్ల వద్ద ఫ్రీ పార్కింగ్(Free parking) సదుపాయం పునరుద్ధరించాలంటూ ఈనెల 25న నాగోల్ మెట్రోస్టేషన్(Nagole Metro Station) వద్ద ప్రయాణికులు మహాధర్నాకు దిగనున్నారు. ఇటీవల నాగోల్, మియాపూర్ మెట్రోస్టేషన్ల వద్ద ఉచిత పార్కింగ్ సదుపాయం ఎత్తివేస్తూ ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో నిర్ణయం తీసుకుంది. దీనిపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్: నగర మెట్రోస్టేషన్ల వద్ద ఫ్రీ పార్కింగ్(Free parking) సదుపాయం పునరుద్ధరించాలంటూ ఈనెల 25న నాగోల్ మెట్రోస్టేషన్(Nagole Metro Station) వద్ద ప్రయాణికులు మహాధర్నాకు దిగనున్నారు. ఇటీవల నాగోల్, మియాపూర్ మెట్రోస్టేషన్ల వద్ద ఉచిత పార్కింగ్ సదుపాయం ఎత్తివేస్తూ ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో నిర్ణయం తీసుకుంది. దీనిపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికుల నుంచి అడ్డగోలుగా దోపిడి చేస్తున్నారంటూ ఆందోళనకు పిలుపునిచ్చారు.
పార్కింగ్ ఫీజులు ఇలా..
ఇటీవల హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు యాజమాన్యం ఎల్ అండ్ టీ భారీ షాక్ ఇచ్చింది. ఆగస్టు 14న ఉదయం నాగోల్ స్టేషన్ వద్దకు వెళ్లిన ప్రయాణికులు అవాక్కయ్యారు. అప్పటివరకూ ఉన్న ఉచిత పార్కింగ్ సదుపాయాన్ని తొలగిస్తూ.. ప్రీపెయిడ్ పార్కింగ్ బోర్డు దర్శినమిచ్చింది. దీన్ని చూసిన వారంతా నోరెళ్లబెట్టారు. ద్విచక్రవాహనాన్ని 2గంటలు పార్కింగ్ చేస్తే రూ.10, అలాగే 8గంటలపాటు చేస్తే రూ.25, అదే 12గంటలపాటు పార్క్ చేయాల్సి వస్తే రూ.40కట్టాలంటూ యాజమాన్యం పేర్కొంది. కారును రెండు గంటలపాటు పార్క్ చేస్తే రూ.30, 8గంటలకు అయితే రూ.75, అదే 12గంటలపాటు పార్క్ చేస్తే రూ.120 చెల్లించాలంటూ ప్రీపెయిడ్ పార్కింగ్ బోర్డు కనిపించింది. అదనంగా ఒక్కో గంటకు మరో రూ.5చొప్పున చెల్లించాలంటూ తెలిపింది. పార్కింగ్ కోసం 40శాతం డిస్కౌంట్‌తో నెలవారీ పాసులు ఇవ్వనున్నట్లు తెలిపారు.
ప్రయాణికుల ఆందోళన..
దీనిపై ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఎప్పుడూ లేనిది పార్కింగ్ కోసం నగదు వసూలు చేయడం ఏంటని మండిపడ్డారు. నాగోల్ మెట్రో స్టేషన్ లోపలికి వెళ్లి అధికారులను నిలదీశారు. ఎప్పటిలాగే ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్, మాదాపూర్ ప్రాంతాల్లో పని చేసే తాము అక్కడ అద్దెలు కట్టలేక నాగోల్, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో ఉంటున్నామని, ఛార్జీలు కాకుండా పార్కింగ్ ఫీజు చెల్లించాలంటూ మెట్రో కొత్త రూల్స్ తీసుకురావడం దారుణమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఛార్జీలు, పార్కింగ్ ఫీజుల కోసం నెలకు వేల రూపాయలు సర్పించుకోవాల్సి వస్తుందంటూ మెురపెట్టుకున్నారు.
ఈ మేరకు పలుమార్లు అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. గత శనివారం రోజునా సీపీఎం నగర కార్యదర్శి ఎం.శ్రీనివాస్ నేతృత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు బేగంపేటలోని మెట్రో రైలు భవన్ ఎదుట ధర్నాకు దిగారు. అయినా యాజమాన్యం వెనక్కి తగ్గలేదు. దీంతో తాజాగా మెట్రో ప్రయాణికులు ఈనెల 25న మహాధర్నాకు పిలుపునిచ్చారు. దీనిపై ఎల్ అండ్ టీ మెట్రో ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.
ఈ వార్తలు కూడా చదవండి:
CM Revanth: ఏఐసీసీ అగ్రనేతలతో సీఎం రేవంత్ భేటీ.. టీపీసీసీ ఎవరో మరి?
KTR: సీఎం ఉండాల్సింది ఢిల్లీలో కాదు.. తెలంగాణ గల్లీలో