ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG NEWS: బయటకు వెళ్లాలంటే భయపడుతున్న జనం.. తప్పించుకోవడం కష్టమే..

ABN, Publish Date - Dec 15 , 2024 | 08:28 AM

తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతుంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు చలితో గజగజలాడుతున్నాయి. ఓ వైపు పొగ మంచు కమ్మేస్తుండగా.. ఉష్ణోగ్రతలు కూడా పడిపోతుండడంతో పగలు, రాత్రీ అనే తేడా లేకుండా ఏజెన్సీ ప్రాంత గ్రామాల ప్రజలు చలికి వణికిపోతున్నారు.

హైదరాబాద్: తెలంగాణలో చలి ప్రభావం మొదలైంది. కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. రోజురోజుకూ పడిపోతున్న ఉష్ణోగ్రతలు చలి తీవ్రతను పెంచుతున్నాయి. చలి ప్రభావంతో జనం గజగజ వణుకుతున్నారు. రాష్ట్రంలో నాలుగు రోజులుగా మళ్లీ కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. గడిచిన వారం రోజులుగా చలిగాలుల ఉధృతి పెరగడంతో అనేక ప్రాంతాల్లో 15 డిగ్రీలలోపుగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి తీవ్రతకు ఉదయం రాత్రి వేళల్లో జనం బయట తిరగడానికి ఇబ్బందులు పడుతున్నారు. వేకువ జామున పొగమంచుతో చిరు వ్యాపారులు, వాహనదారులు అవస్థలు పడుతున్నారు.తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. ఆదిలాబాద్‌లో కనిష్ఠంగా 6.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిర్మల్‌లో 8.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. మెదక్‌ 10.8, నిజామాబాద్‌లో 13.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌ 17.3, భద్రాచలంలో 18.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు, మహబూబ్‌నగర్‌లో 18.9 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది.


జనం ఆందోళన..

సీజన్‌ ఆరంభంలోనే చలి వణికిస్తుండడంతో రాబోయే రోజులు ఎలా ఉంటాయోనని జనం ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా నగర శివార్లలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. చలి తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చలిని తట్టుకునే దుస్తులను ధరిస్తున్నారు. దీంతో మార్కెట్లలో స్వెటర్‌లు, జర్కిన్లు, మంకీ క్యాప్‌లు, దుప్పట్ల కొనుగోళ్లు మొదలయ్యాయి. ఉదయం వేళల్లో పొగమంచు కమ్మేస్తోంది.చలి తీవ్రతకు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఉదయం రాత్రి వేళల్లో కాకుండా పగటి ఉష్ణోగ్రతలు కూడా తగ్గిపోతున్నాయి. మరోవైపు చలి తీవ్రత నేపథ్యంలో అస్తమా, ఇతర శ్వాస కోసం వ్యాధులు ఉన్నవారితో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నావారు జాగ్రత్త వహించాలని వైద్యులు సూచిస్తున్నారు. చలి జ్వరాలు, నరాలకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తుతాయని అన్నారు.


ఇళ్లలోనే జనం

ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతుండటంతో చలి తీవ్రత పెరుగుదలకు కారణమైంది. సాయంత్రం ఆరు గంటలు అయ్యిందంటే ప్రజలు చలికి ఇళ్ల తలుపులు మూసుకుంటున్నారు. మళ్లీ ఉదయం ఎనిమిది గంటలు అయితేగానీ తలుపులు తీయడం లేదు. అప్పటి వరకు రోడ్లు కూడా నిర్మానుష్యంగా మారుతున్నాయి. చలి తీవ్రతకు చిన్నపిల్లలు, వృద్ధులు, బస్టాండ్లు, రహదారులపై యాచకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజామున వాకింగ్‌కు వెళ్లే జనం, పాల వ్యాపారులు, పేపర్‌ బాయ్స్‌, మునిసిపల్‌ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. వివిధ పనులు, అవసరాల రీత్యా తెల్లవారుజామున ద్విచక్ర వాహనాలపై తిరిగేవారు అవస్థలు పడుతున్నారు. మంకీక్యాప్‌, స్వెటర్‌లు లేనిదే బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. చల్లిని తట్టుకునేందుకు తెల్లవారుజామున పట్టణ ప్రాంతాల్లో టీ కొట్ల వద్ద రద్దీ కనినిపిస్తుండగా, గ్రామీణ ప్రాంతాల్లో చలిమంటలు కాచుకుంటున్నారు. సంక్రాంతి, శివరాత్రి ముగిసేవరకు చలి తీవ్రత తీవ్రంగా ఉండనుంది. రోజురోజుకూ చలి తీవ్రత పెరగడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో జనం ఇళ్లలోనే ఉంటున్నారు. ఉదయం 10 గంటల వరకు బయటకు రావడం లేదు. రాత్రి వేళల్లో కూడా త్వరగా ఇంటికి చేరుకుంటున్నారు. చలికి ఎక్కువగా భయపడుతున్నారు. వృద్ధులు పూర్తిగా ఇళ్లకే పరిమితం అయ్యారు. చలి తీవ్రత పెరగడంతో స్వెట్లర్లు, మఫ్లర్ల గిరాకీ పెరిగింది. స్వెట్టర్ల అమ్మకాలు జోరందుకున్నాయి.


మందగించిన వ్యాపారాలు

చలి తీవ్రతతో చిరు వ్యాపారాలు మందగించాయి. జనాలు ఇళ్లలో నుంచి బయటకు తక్కువగా వస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో దుకాణాలు వెలవెలబోతున్నాయి. కూరగాయలు, పాల వ్యాపారులు ఉదయం చలి తీవ్రతలోనే ఇబ్బందులు పడుతూ వ్యాపారాలు చేస్తున్నారు. ఉదయం వేళల్లో రోజు పొగమంచు ఉండటంతో ఇబ్బంది పడుతున్నారు.


ఆరోగ్యం.. జర భద్రం

చలి తీవ్రత నేపథ్యంలో ఆర్యోగంపై జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కొవిడ్‌ కొత్త వేరియేంట్‌ కేసులు కూడా మొదలైన నేపథ్యంలో అప్రమత్తత తప్పనిసరని హెచ్చరిస్తున్నారు. మాస్కులుధరించాలని సూచిస్తున్నారు. అస్తమా, ఇతర శ్యాసకోస సంబంధంమైన ఇబ్బందులు ఉన్నవారు ఇబ్బందులకు గురవుతున్నారు. చలి త్రీవత దృష్ట్యా దీర్గాకాలిక వ్యాధులతో బాధపడుతున్నావారు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గుండె జబ్బులు ఉన్నవారు, గుండె ఆపరేషన్‌ చేయించుకున్నవారు వాకింగ్‌ చేయవద్దని సూచిస్తున్నారు. చలిలో ఎక్కువగా తిరగడంతో రక్తనాళాలు సంకోచించి గుండెకు సంబంధించిన సమస్యలు వస్తాయని, బీపీ, షుగర్‌ ఉన్నవారు కూడా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. చర్మ సమస్యలకు సంబంధించి జాగ్రత్తలు పాటించి మాయిశ్చరైజర్‌లు ఉపయోగించాలని వైద్యులు సూచనలు చేస్తున్నారు.

Updated Date - Dec 15 , 2024 | 08:41 AM