Hyderabad: మోహన్ బాబు ఇంటికి లేడీ బౌన్సర్లు.. మరోసారి ఘర్షణ జరిగే అవకాశం..
ABN, Publish Date - Dec 09 , 2024 | 03:53 PM
మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య ఘర్షణ జరిగినట్లు ప్రచారం జరిగింది. ఆస్తుల పంపకం విషయంలో మోహన్ బాబు ఆగ్రహించారని, ఈ మేరకు ఆయన అనుచరులు వినయ్, బౌన్సర్లు కలిసి మనోజ్, ఆయన భార్య మౌనికపై దాడి చేసినట్లు వార్తలు గుప్పుమన్నాయి.
హైదరాబాద్: ఆస్తుల పంపకం విషయంలో సినీ నటుడు మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో వివాదం చెలరేగినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా జల్‌పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్దకు లేడీ బౌన్సర్లు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇవాళ (సోమవారం) సాయంత్రం జల్‌పల్లి నివాసానికి మంచు విష్ణు రానున్న నేపథ్యంలో మరోసారి పెద్దఎత్తున వివాదం చెలరేగే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన 8 మంది లేడీ బౌన్సర్లను పంపించినట్లు తెలుస్తోంది. దుబాయ్ నుంచి మంచు విష్ణు వచ్చిన తర్వాత మరోసారి వివాదం జరిగే అవకాశం ఉందని పలువురు చర్చించుకుంటున్నారు.
మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య ఆదివారం ఘర్షణ జరిగినట్లు ప్రచారం జరిగింది. ఆస్తుల పంపకం విషయంలో మోహన్ బాబు ఆగ్రహించారని, ఈ మేరకు ఆయన అనుచరులు వినయ్, బౌన్సర్లు కలిసి మనోజ్, ఆయన భార్య మౌనికపై దాడి చేసినట్లు వార్తలు గుప్పుమన్నాయి. మనోజ్‌కు తీవ్రగాయాలు అయ్యాయని, ఆ గాయాలతోనే తన భార్యతో కలిసి పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. అనంతరం మౌనికతో కలసి బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి మనోజ్ వెళ్లారు. తండ్రితో జరిగిన గొడవ విషయమై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఇరువురూ మాట్లాడేందుకు నిరాకరించారు.
అయితే ఆస్పత్రిలో చేరిన మనోజ్‌కు వైద్యులు చికిత్స అందించారు. పలు పరీక్షలు నిర్వహించారు. ఆయన ఎడమవైపు ఉన్న భుజానికి గాయమైనట్లు మెడికల్ రిపోర్ట్‌లో వైద్యులు తెలిపారు. మనోజ్ కుడివైపు భుజానికి ఫ్రాక్చర్ అయినట్లు డాక్టర్లు గుర్తించారు. జల్‌పల్లి ఫామ్ హౌస్‌లో గుర్తుతెలియని వ్యక్తులు మంచు మనోజ్‌పై దాడి చేసినట్లు మెడికల్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. సిటీ స్కాన్, అల్ట్రా సౌండ్ పరీక్షలు నిర్వహించిన వైద్యులు పొట్ట, వెన్న పూస, మెడకు కనిపించని గాయాలైనట్లు వెల్లడించారు. అయితే 24 గంటలపాటు అబ్జర్వేషన్‌లో ఉండాలని మనోజ్‌కు వైద్యులు సూచించగా సోమవారం మరోసారి వస్తానని చెప్పి మనోజ్ డిశ్చార్జి అయినట్లు తెలుస్తోంది.
మరోవైపు ఆస్తుల పంపకం విషయంలో మనోజ్, తాను గొడవపడినట్లు వస్తున్న వార్తలను మోహన్ బాబు ఖండించారు. తాను మనోజ్‌ను కొట్టానంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన చెప్పుకొచ్చారు. తమ కుటుంబంపై అసత్య ప్రచారాలు చేయెుద్దంటూ ఎక్స్ వేదికగా మోహన్ బాబు కోరారు.
కాగా, మరికాసేపట్లో జల్‌పల్లి నివాసానికి మంచు విష్ణు చేరుకోనున్నారు. సోమవారం ఉదయం దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు విష్ణు వచ్చారు. ఈ నేపథ్యంలో జల్‌పల్లి నివాసానికి పెద్దఎత్తున బౌన్సర్లు చేరుకున్నారు. విష్ణుకు పోటీగా మనోజ్ సైతం బౌన్సర్లను రప్పించారు. అలాగే ఆళ్లగడ్డ నుంచి మనోజ్‌కు మద్దతుగా మరికొందరు చేరుకున్నారు. విద్యానికేతన్, ఎంబీయూలో కీలకంగా ఉన్న వినయ్ అనే వ్యక్తి వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. విష్ణు వస్తుండడంతో మోహన్ బాబు నివాసం వద్ద హై టెన్షన్ నెలకొంది.
ఈ వార్తలు కూడా చదవండి:
Sangareddy: ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు.. జగ్గారెడ్డి ఏం చెప్పారంటే..
BJP vs Congress: మంత్రి కుర్చీలో బీజేపీ ఎమ్మెల్యే.. ప్రోటోకాల్‌పై శాసనసభలో నిరసన
Updated Date - Dec 09 , 2024 | 05:05 PM