ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: నేటి నుంచి కాళేశ్వరం కమిషన్ విచారణ పునఃప్రారంభం..

ABN, Publish Date - Nov 25 , 2024 | 09:07 AM

నేటి నుంచి కాళేశ్వరం కమిషన్ విచారణ పునఃప్రారంభం కానుంది. నేడు 14మంది ఇంజినీర్లను జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ విచారించనుంది. విచారణలో భాగంగా 14మంది ఇంజినీర్లను కమిషన్ ఎదుట హాజరుకానున్నారు.

Kaleshwaram Commission Chairman Justice PC Ghose

హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ విచారణ ఊపందుకుంది. కొన్నిరోజులుగా ఆగిపోయిన విచారణ నేటి నుంచి పునఃప్రారంభం కానుంది. ఇవాళ (సోమవారం) 14మంది ఇంజినీర్లను జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ విచారించనుంది. విచారణలో భాగంగా డీఈ, ఏఈలు కమిషన్ ఎదుట హాజరుకానున్నారు. మంగళవారం మరో 14మంది ఇంజినీర్లను కమిషన్ విచారించనుంది.

Uke Abbayya: ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య కన్నుమూత


ఈసారి మొత్తం 52మంది ఇంజినీర్లను ఘోష్ కమిషన్ ప్రశ్నించనుంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంట్లు కమిషన్‌కు చేరాయి. ఇంజినీర్ల తర్వాత ఐఏఎస్ అధికారులను విచారించనున్నారు. వారి తర్వాత కాంట్రాక్టర్ల పిలిచి పలు ప్రశ్నలు సంధించనున్నారు. అకౌంట్స్ డిపార్ట్మెంట్ అధికారులను సైతం కాళేశ్వరం కమిషన్ విచారణ చేయనుంది. ముఖ్యంగా ప్రాజెక్టు నిధుల సేకరణ, బదిలీ అంశంపై కమిషన్ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు పలు ప్రశ్నలు సంధించనుంది.

కుళ్లిన కూరగాయలు.. అన్నంలో పురుగులు


బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలను సైతం బహిరంగ విచారణకు పీసీ ఘోష్ కమిషన్ పిలిచే అవకాశం ఉంది. మాజీ మంత్రులు హరీశ్ రావు, కేసీఆర్‌ను సైతం విచారించే యోచనలో కమిషన్ ఛైర్మన్ ఘోష్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాళేశ్వరం మూడు బ్యారేజీలకు చెందిన కీలక అంశాలను జస్టిస్ చంద్రఘోష్ సేకరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుల నిర్మాణంపై విధాన నిర్ణయం తీసుకున్న వారితోపాటు ఆ నిర్ణయాల్లో భాగస్వాములైన మాజీ కీలక ప్రజాప్రతినిధులను విచారణకు పిలిచే అవకాశాలున్నాయి. విచారణ తుది దశకు చేరుకోగా.. అందర్ని విచారించిన అనంతరం ఈ ఏడాది డిసెంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్ ఛైర్మన్ పీసీ ఘోష్ నివేదిక ఇవ్వనున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Tension: మహబూబాబాద్‌లో ఉద్రిక్తత.. కేటీఆర్ గో బ్యాక్ అంటూ నినాదాలు..

Mahadharna: బీఆర్ఎస్ మహాధర్నా.. ముఖ్య అతిథిగా కేటీఆర్..

Updated Date - Nov 25 , 2024 | 09:28 AM