ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kavitha: రేవంత్ ఢిల్లీ వెళ్లి ఏం సాధించారు.. కవిత సూటి ప్రశ్న

ABN, Publish Date - Dec 16 , 2024 | 01:58 PM

సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి తెలంగాణకు ఏం సాధించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. నెలకు రెండుమూడు సార్లు ఢిల్లీకి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కలిశారని.. మరి ప్రతి జిల్లాకు రావాల్సిన నవోదయా విద్యాలయాలను ఎన్ని సాధించారని కవిత ప్రశ్నించారు.

హైదరాబాద్: జగిత్యాల కేంద్రంగా సిల్క్ వార్మ్ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శాసనమండలిలో ఈరోజు(సోమవారం) కవిత మాట్లాడారు.రైతులను మల్బరీ సాగు వైపు ప్రోత్సహించాలని చెప్పారు. సెరికల్చర్ విభాగంలో దాదాపు 650 ఉద్యోగాలు ఉంటే... 400మంది ఇటీవల రిటైర్ అయ్యారని చెప్పారు.


వాటిని వెంటనే భర్తీ చేయాలని కోరారు. రాష్ట్రంలో పట్టుపరిశ్రమను ప్రోత్సహించాలని చెప్పారు. చేనేత కార్మికులకు బెంగళూరు నుంచి పట్టును దిగుమతి చేసుకోవడం వల్ల అదనపు భారం పడుతుందని అన్నారు. పట్టుగూళ్ల విషయంలో చేనేత కార్మికులకు బాకీ ఉన్న రూ.8కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చేనేతపై కేంద్ర ప్రభుత్వం విధించే జీఎస్టీని రీయింబర్స్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని అన్నారు. ఆ హామీ అమలు ఎంతవరకు వచ్చిందో ప్రభుత్వం చెప్పాలని కవిత నిలదీశారు.


బీసీ గురుకుల పాఠశాలలపై చిన్న చూపు...

‘‘కేసీఆర్ హయాంలో సగటున ఏడాదికి 27 బీసీ గురుకుల పాఠశాలలు ఏర్పాటయ్యాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క బీసీ గురుకుల పాఠశాల కూడా ఏర్పాటు చేయలేదు. కనీసం ఏర్పాటు చేయాలన్న ఆలోచన కానీ ప్రభుత్వానికి లేకపోవడం దారుణం. సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గతంలో కేవలం 19 బీసీ సంక్షేమ పాఠశాలను ఏర్పాటు చేసింది. పదేళ్లలో కేసీఆర్ 275 బీసీ పాఠశాలలను, 31 బీసీ డిగ్రీ కాలేజీలను, ప్రత్యేకంగా బీసీలకు రెండు వ్యవసాయ కాలేజీలను ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు ఫీజు రియింబర్స్‌మెంట్ కింద రూ. 14 వేల కోట్లు విడుదల చేసింది. 2230 బీసీ విద్యార్థుల విదేశీ విద్యకు రూ. 450 కోట్లు ఖర్చు చేశాం. నెలకు రెండుమూడు సార్లు ఢిల్లీకి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కలిశారు. మరి ప్రతి జిల్లాకు రావాల్సిన నవోదయా విద్యాలయాలను ఎన్ని సాధించారు.వెనుకబడిన జిల్లాలకు నిధులు సాధించారు. ఇన్ని సార్లు ఢిల్లీ వెళ్లడమే కాకుండా కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి అదనపు నిధులు ఏం తీసుకొచ్చారు’’ అని కవిత ప్రశ్నించారు.


ఈ వార్తలు కూడా చదవండి

TG Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఈరోజు రెండు కీలక బిల్లులు..

K Kavitha: ప్రభుత్వ జీవోను ధిక్కరించి..

TG Govt: దుబారా వద్దు!

Read Latest Telangana News and Telugu News

Updated Date - Dec 16 , 2024 | 02:29 PM