ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KCR: సుప్రీం కోర్టును ఆశ్రయించిన కేసీఆర్... ఎందుకంటే..?

ABN, Publish Date - Jul 14 , 2024 | 08:38 PM

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ (KCR) సుప్రీంకోర్టును (Supreme Court) ఆశ్రయించారు. తెలంగాణ ప్రభుత్వం నియమించిన విద్యుత్ కమిషన్‌ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

హైదరాబాద్: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ (KCR) సుప్రీంకోర్టును (Supreme Court) ఆశ్రయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన విద్యుత్ కమిషన్‌ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో కేసీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. విద్యుత్ కమిషన్‌ను రద్దు చేయాలని గతంలో కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌ను రాష్ట్ర హైకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో గులాబీ బాస్ సవాల్ చేశారు. రేపు సీజేఐ చంద్రచూడ్ ధర్మాసనం ముందు ఈ కేసు విచారణ జరగనున్నది. కాగా ఈ కేసుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.


కాగా.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ఛత్తీస్‌గఢ్ విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం, భద్రాద్రి, యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల నిర్మాణం అంశాలపై విచారణ జరుపుతున్న జస్టిస్‌ ఎల్‌ నర్సింహారెడ్డి కమిషన్‌ (Justice L. Narasimha Reddy) కేసీఆర్‌కు రెండు సార్లు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

అయితే విద్యుత్‌ కొనుగోలు ఒప్పందంలో కేసీఆర్‌ పాత్రపై కమిషన్‌ వివరణ కోరింది. తనను విచారణకు పిలవకూడదంటూ కేసీఆర్ తెలంగాణ హై కోర్టును ఆశ్రయించారు. అయితే గులాబీ బాస్‌కు న్యాయస్థానంలో చుక్కెదురైంది. కేసీఆర్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం.

Updated Date - Jul 14 , 2024 | 08:52 PM

Advertising
Advertising
<