Share News

Jani Master: డైరెక్టర్‌ సుకుమార్‌కు చెప్పా.. కస్టడీలో జానీ మాస్టర్

ABN , Publish Date - Sep 27 , 2024 | 02:22 PM

Telangana: ‘‘నేను పడుతున్న ఇబ్బందిపై డైరెక్టర్ సుకుమార్‌ దృష్టికి తీసుకెళ్ళాను. సుకుమార్ పిలిచి మాట్లాడిన కూడా బాధితురాలో మార్పు రాలేదు. నాపై కుట్ర జరిగింది, వెనున ఉండి నాపై కుట్ర చేశారు. నా ఎదుగుదలను ఓర్వలేకనే ఈ కేసులో ఇరికించారు’’

Jani Master: డైరెక్టర్‌ సుకుమార్‌కు చెప్పా.. కస్టడీలో జానీ మాస్టర్
Key Points in Johnny Master Custody

హైదరాబాద్, సెప్టెంబర్ 27: అత్యాచారం కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్‌ (Jani Master) కేసులో పోలీసుల కస్టడీ విచారణ కొనసాగుతోంది. మూడో రోజు జానీ మాస్టర్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. బాధితురాలు స్టేట్‌మెంట్‌ను ముందు ఉంచి జానీ మాస్టర్‌ను నార్సింగి పోలీసులు (Narsingh Police) విచారించారు. అయితే పోలీసుల విచారణలో బాధితురాలే తనను వేధించిందని జానీ మాస్టర్ చెప్పినట్లు సమాచారం.

Viral News: హమ్ దో హమారే దో డజన్‌పై క్లారిటీ


కస్టడీలో కీలక అంశాలు ఇవే..

‘‘నాపై బాధితురాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవి. ఢీ షో ద్వారా తనకు తానే పరిచయం చేసుకుంది. మైనర్‌గా ఉన్న సమయంలో లైంగిక దాడి చేశాననేది అబద్ధం. తన టాలెంట్‌ను గుర్తించి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా అవకాశం ఇచ్చాను. తనని పెళ్లి చేసుకోవాలని బాధితురాలు మానసికంగా హింసించేది... ఎన్నోసార్లు బాధితురాలు నన్ను బెదిరింపులకు దిగింది.. నేను పడుతున్న ఇబ్బందిపై డైరెక్టర్ సుకుమార్‌ దృష్టికి తీసుకెళ్ళాను. సుకుమార్ పిలిచి మాట్లాడిన కూడా బాధితురాలిలో మార్పు రాలేదు. నాపై కుట్ర జరిగింది, వెనున ఉండి నాపై కుట్ర చేశారు. నా ఎదుగుదలను ఓర్వలేకనే ఈ కేసులో ఇరికించారు’’ అంటూ జానీ మాస్టర్ విచారణలో పోలీసులకు తెలియజేశారు.


మరోవైపు భర్తను కలవడానికి జానీ మాస్టర్ భార్య నార్సింగి పోలీస్ స్టేషన్‌‌కు వచ్చారు. ఈ కేసులో నాలుగు రోజుల పాటు జానీమాస్టర్‌ను పోలీస్ కస్టడీకి రంగారెడ్డి కోర్టు అనుమతించింది. ఇప్పటికే మూడు రోజుల పాటు జానీమాస్టర్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించగా.. రేపటి (శనివారం)తో జానీ మాస్టర్ కస్టడీ విచారణ ముగియనుంది. రేపు ఉదయం జానీ మాస్టర్‌ను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.


కాగా... తన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న 21 ఏళ్ల యువతిపై లైంగిక దాడి కేసులో జానీమాస్టర్‌ను ఇటీవలే పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆయన్ను గోవాలో అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి నుంచి నగరానికి తీసుకొచ్చి రాజేంద్రనగర్‌ సర్కిల్‌ ఉప్పర్‌పల్లిలోని 13వ అదనపు మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు రెండో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి ముందు హాజరుపరిచారు. పోలీసులు సమర్పించిన ఆధారాలను పరిశీలించి, ఇరువర్గా ల వాదనలూ విన్న న్యాయమూర్తి.. అక్టోబరు 3 వరకు (14 రోజుల) రిమాండ్‌ విధించారు. దీంతో ప్రస్తుతం చంచల్‌గూడ్ జైలులో ఉన్నారు.

Anam Ramanarayana: సంతకం పెట్టాల్సిందే.. లేకపోతే అడుగుపెట్టనివ్వం


రిమాండ్ రిపోర్టులోనూ...

జానీ మాస్టర్ రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు విస్తుపోయే విషయాలను వెల్లడించారు. జానీమాస్టర్‌ దురుద్దేశంతోనే బాధితురాలిని అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా తీసుకున్నట్లు తెలిపారు. ఆమెకు ఒక ప్రముఖ డ్యాన్స్‌ షోలో పాల్గొనే అవకాశం రావడంతో 2017లో నగరానికి వచ్చిందని.. తర్వాత జానీ మాస్టర్‌ వద్ద అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా చేరిందని పేర్కొన్నారు. 2019 డిసెంబరు 15 నుంచి జానీ మాస్టర్‌ వద్దే పనిచేస్తూ అల్కాపురికాలనీలో ఉంటోందని, ఆ సమయంలో ఇద్దరూ ఒక సూపర్‌హిట్‌ సినిమాకు పనిచేశారని ప్రస్తావించారు. ఆ సినిమా పని నిమిత్తం 2020 జనవరి 10న (అంటే చేరిన నెలరోజుల్లోపే) జానీ మాస్టర్‌, బాధితురాలు, మరో ఇద్దరు సహాయకులు ముంబైకి వెళ్లారన్నారు. ఆ రోజు రాత్రి 12 గంటలకు బాధితురాలిని ఆధార్‌కార్డు, ఇతర డాక్యుమెంట్లు తీసుకొని తన గదికి రావాలని ఆదేశించారని, ఆమె గదిలోకి రాగానే గడియపెట్టి అత్యాచారం చేశాడని తెలిపారు. అప్పటికీ బాలిక వయసు 16 సంవత్సరాలని రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

IPL 2025: ఐపీఎల్ 2025 మ్యాచ్‌ల సంఖ్యపై కీలక అప్‌డేట్

KTR: హైడ్రా టార్గెట్‌గా కేటీఆర్ ఘాటు విమర్శలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 27 , 2024 | 04:31 PM