ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KISHAN REDDY: ఏడాది గడువు ఇచ్చాం.. అయినా ఇలా చేస్తే ఎలా.. సీఎం రేవంత్‌పై కిషన్‌రెడ్డి ధ్వజం

ABN, Publish Date - Dec 01 , 2024 | 05:11 PM

కాంగ్రెస్ పాలనపై ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. విజయోత్సవాల కోసం రూ.కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. హామీలు నెరవేర్చకుండా సంబరాలు చేసుకోవడమేంటని ప్రశ్నించారు.

హైదరాబాద్: బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనకు ఏమాత్రం తేడా లేదని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ గ్యారెంటీలపై బీజేపీ ఇవాళ(ఆదివారం) చార్జ్‌షీట్ విడుదల చేసింది. కాంగ్రెస్ గ్యారెంటీల గారడీ 6 అబద్ధాలు.. 66 మోసాల పేరుతో చార్జ్‌షీట్‌లో వివరించారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వంద రోజుల్లో గ్యారెంటీలు అమలు చేస్తామని మాట తప్పారని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని ఏడాది కాలంలో నెరవేర్చలేదని ఆక్షేపించారు.


కాంగ్రెస్ పాలనపై ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదన్నారు. కాంగ్రెస్ విజయోత్సవాలు చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారని చెప్పారు. విజయోత్సవాల కోసం రూ.కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. హామీలు నెరవేర్చకుండా సంబరాలు చేసుకోవడమేంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ అలవికానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని అన్నారు. అధికారంలోకి వచ్చి ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని ఆక్షేపించారు. హామీలు నెరవేర్చేందుకు కాంగ్రెస్‌కు ఏడాది గడువు ఇచ్చామని అన్నారు. ఏడాది గడిచినా రుణమాఫీ అందరికీ పూర్తి కాలేదని కిషన్‌రెడ్డి తెలిపారు.


తెలంగాణలో అధికారం బీజేపీదే..

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అహంకారిపూరిత వైఖరినే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు డిపాజిట్ రాలేదని చెప్పారు. మోదీ నాయకత్వంలో తెలంగాణలో అధికారం బీజేపీదేనని తెలిపారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా సహాయం అందించిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నేరుగా 15వ ఆర్థిక ప్రణాళిక సంఘం నుంచి నిధులు ఇస్తుందని.. ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ప్రజలు ఆందోళనలో ఉన్నారని తెలిపారు. ఇక కాంగ్రెస్‌కు ప్రజా ఉద్యమాల ద్వారానే బుద్ది చెప్పాలని కిషన్‌రెడ్డి హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి

CM Revanth Reddy: రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన

Hyderabad: సన్నీ లియోన్ కోసం ఆశగా ఎదురు చూసిన యువకులు.. చివరికి జరిగింది ఇదే..

Jishnu Dev Varma: యువత దేశాభివృద్ధిలో భాగం కావాలి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 01 , 2024 | 05:17 PM