Kodandaram : సింగరేణి సమస్యను కేంద్రం పరిష్కరించాలి
ABN, Publish Date - Jun 24 , 2024 | 05:22 PM
ఇందిరా గాంధీ బొగ్గు తవ్వకాలను జాతీయం చేసిందని టీజేఎస్ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం (Kodandaram) తెలిపారు. సింగరేణి ఎంతో సమర్థవంతంగా బొగ్గు తవ్వకాలు చేస్తోందని అన్నారు. వేలం వేయడం కంటే సింగరేణి నుంచి ఆదాయం ఎక్కువగా వస్తుందని చెప్పారు.
హైదరాబాద్: ఇందిరా గాంధీ బొగ్గు తవ్వకాలను జాతీయం చేసిందని టీజేఎస్ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం (Kodandaram) తెలిపారు. సింగరేణి ఎంతో సమర్థవంతంగా బొగ్గు తవ్వకాలు చేస్తోందని అన్నారు. వేలం వేయడం కంటే సింగరేణి నుంచి ఆదాయం ఎక్కువగా వస్తుందని చెప్పారు. సింగరేణి ఉత్తర తెలంగాణకు గుండెకాయ లాంటిదన్నారు. ఈ రోజు(మంగళవారం) హైదరాబాద్‌లోని టీజేఎస్ పార్టీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడుతూ...సింగరేణి పరిధిలో ప్రజలు ఆర్థికంగా ఎదిగారని, సామాజికమార్పుకు కారణం అయ్యిందని చెప్పారు.
కచ్చితంగా వేలం వేయాలని సుప్రీంకోర్టు చెప్పలేదన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సింగరేణికి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గనులు సింగరేణికి ఇవ్వకపోతే పదేళ్లలో సంస్థ తీవ్రంగా నష్టపోతుందని చెప్పారు. శ్రావణపల్లి గని తవ్వే ప్రాంతం అటవీ భాగం ఎక్కువగా ఉందని అన్నారు. ఇక్కడ బొగ్గు తవ్వితే గ్రామాల్లో చిచ్చు పెట్టినట్టేనని చెప్పారు. కిషన్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేస్తామని తెలిపారు. కేంద్రం వినకపోతే సింగరేణి పరిరక్షణ కోసం ఉద్యమానికి సిద్ధమవుతామని వార్నింగ్ ఇచ్చారు. గతంలో సింగరేణి పరిరక్షణ కోసం ప్రొఫెసర్ జయశంకర్ లాగా పోరాటం చేస్తామన్నారు. ప్రైవేటు వారికి గనుల కేటాయింపుతో స్థానికులు ఉపాధి అవకాశాలు కోల్పోతారని కోదండరాం పేర్కొన్నారు.
Updated Date - Jun 24 , 2024 | 05:23 PM