KP Vivekananda: కేటీఆర్‌ను ఇరికించడానికి సీఎం రేవంత్ మరో కొత్త నాటకం.. ఎమ్మెల్యే కేపీ వివేకానంద విసుర్లు
ABN, Publish Date - Oct 27 , 2024 | 05:01 PM
కేటీఆర్‌ను మానసికంగా దెబ్బతీయాలని సీఎం రేవంత్‌రెడ్డి చూస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి డైవర్షన్‌లోనే ఇది జరుగుతోందని విమర్శించారు. రేవంత్ రెడ్డి చీకటి మిత్రుడు బండి సంజయ్ ముందుగానే ప్రతి విషయంలో రియాక్ట్ అవుతున్నారని చెప్పారు. బీజేపీ నేతలు బండి సంజయ్, రఘునందన్ రావుతో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతల గురించి మాట్లాడిస్తున్నారని ఫైర్ అయ్యారు.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కొత్త నాటకానికి తెరదీశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శలు చేశారు. మాజీ మంత్రి కేటీఆర్‌ను ఇరికించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. హామీలు ఇచ్చి మాట తప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇవాళ(ఆదివారం) తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేటీఆర్‌కు ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు.
రేవంత్ రెడ్డికి ప్రజల్లో ఆదరణ తగ్గుతోందని అన్నారు. కేటీఆర్‌పై అసూయతో వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి దూషణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కేటీఆర్ బావమరిది సొంత ఇంట్లో కుటుంబ సభ్యులతో పార్టీ ఏర్పాటు చేసుకున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి పాలనను గాలికి వదిలేశారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి కేటీఆర్ సిండ్రోమ్, ఫోబియా పట్టుకుందని విమర్శించారు. స్వయంగా రాజ్ పాకాల ఇంటికి పోలీసులు, ఆబ్కారీ అధికారులు వెళ్లి సెర్చ్ చేశారని అన్నారు. ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా రాజ్ పాకాల కుటుంబ సభ్యులను పోలీసులు ఇబ్బంది పెట్టారని ఎమ్మెల్యే కేపీ వివేకానంద చెప్పారు.
అధికారులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక ఇబ్బంది పెట్టిన అధికారులను రిటైర్ అయినా కూడా వదలబోమని తీవ్రంగా హెచ్చరించారు. సొంత ఇంట్లో పార్టీ చేసుకోవద్దా అని ప్రశ్నించారు. అధికారుల రిపోర్టులో ఫారెన్ లిక్కర్ ఉన్నట్లు తేలిందని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇటీవల ఓ ప్రైవేటు పార్టీకి వెళ్లి వస్తుంటే ఇరికించే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు. కేటీఆర్‌పై బురదజల్లాలని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాజ్ పాకాల కొత్త ఇళ్లు కట్టుకుని గృహ ప్రవేశం చేశారని గుర్తుచేశారు. రాజ్ పాకాల ఇంట్లో కేటీఆర్, కేటీఆర్ సతీమణి లేరని ఎమ్మెల్యే కేపీ వివేకానంద స్పష్టం చేశారు.
కేటీఆర్‌ను మానసికంగా దెబ్బతీయాలని సీఎం రేవంత్‌రెడ్డి చూస్తున్నారని ఎమ్మెల్యే కేపీ వివేకానంద దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి డైవర్షన్‌లోనే ఇది జరుగుతోందని విమర్శించారు. రేవంత్ రెడ్డి చీకటి మిత్రుడు బండి సంజయ్ ముందుగానే ప్రతి విషయంలో రియాక్ట్ అవుతున్నారని చెప్పారు. బీజేపీ నేతలు బండి సంజయ్, రఘునందన్ రావుతో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతల గురించి మాట్లాడిస్తున్నారని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా బండి సంజయ్ ఉన్నారని ఆరోపించారు. మితిమీరి పని చేసిన అధికారుల చిట్టాను రాసుకుంటామని ఎమ్మెల్యే కేపీ వివేకానంద హెచ్చరించారు. రేవంత్ రెడ్డి పచ్చిమోసగాడని విమర్శలు చేశారు.
రేవంత్ రెడ్డివి కక్ష సాధింపు రాజకీయాలు: బాల్క సుమన్
నోటీసులు లేకుండా రాజ్ పాకాల ఇంట్లోకి పోలీసులు ఎలా వస్తారని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రశ్నించారు. మాజీ మంత్రి కేటీఆర్ ఇంటి వద్దకు ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ ఎలా వస్తారని నిలదీశారు. పొలిటికల్ ప్రెజర్‌తో రేవంత్ రెడ్డి కక్ష సాధింపు రాజకీయాలు చేపడుతున్నారని మండిపడ్డారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దీపావళి ముందు పొలిటికల్ బాంబులు పేలుతాయని అన్నారని.... అవి ఈ బాంబులేనా అని బాల్క సుమన్ ఎద్దేవా చేశారు. రైతులందరికి రుణమాఫీ ఎందుకు చేయడం లేదని నిలదీశారు. మూసీ పరివాహక బాధితులను ఇబ్బందులకు గురిచేశారని ధ్వజమెత్తారు. వాటిని పక్కదారి పట్టించేందుకే ఈ దాడులు చేస్తున్నారని ఆరోపించారు. నిన్న రాజ్ పాకాల ఇంట్లో పార్టీ జరిగిందని.. ఒక రెండు బాటిళ్ల మద్యం ఎక్కువగా ఉందని చెప్పారు. అంతే దాన్ని రేవ్ పార్టీ అని ఎలా అంటారని బాల్క సుమన్ ప్రశ్నించారు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Revanth Reddy: మూసీకి పునరుజ్జీవం కల్పిద్దాం.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
Kishan Reddy: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
Bhatti Vikramarka: మహిళాభివృద్ధిలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలువనుంది
Rave party: కేటీఆర్ బావమరిది ఫాంహౌస్‌లో రేవ్ పార్టీ.. భగ్నం చేసిన పోలీసులు..
AV Ranganath: అనుమతులుంటే కూల్చం
KTR: ‘సుద్దపూస.. ఇప్పుడేమంటాడో’.. కేటీఆర్‌పై కేంద్ర మంత్రి హాట్ కామెంట్స్..
Read Latest Telangana News and Telugu News
Updated Date - Oct 27 , 2024 | 05:16 PM