KTR: ఢిల్లీకి మూటలు పంపడానికే మూసీ ప్రాజెక్ట్
ABN, Publish Date - Oct 18 , 2024 | 05:00 PM
మూసీ సుందరీకరణ అనే పదం మాట్లాడిందే మొదట రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తామని చెప్పింది కూడా రేవంత్ రెడ్డినేనని అన్నారు. మూసీపై ప్రభుత్వం అస్సలు సర్వేనే చేయలేదని అన్నారు.
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి మూసీపై అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. మూసీ శుద్ధీకరణపై తెలంగాణ భవన్లో కెేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీకి మూటలు పంపటం కోసమే ముఖ్యమంత్రికి మూసీపై ప్రేమ ఉందనే అనుమానం బలపడుతోందని కేటీఆర్ అన్నారు.
నోట్ల రద్దు సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాటలు మార్చినట్లు.. మూసీపై రేవంత్ రోజుకో మాట మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మూసీ సుందరీకరణ అనే పదం మాట్లాడిందే మొదట రేవంత్ రెడ్డి అని విమర్శించారు. లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తామని చెప్పింది కూడా రేవంత్ రెడ్డినేనని అన్నారు. మూసీపై ప్రభుత్వం అస్సలు సర్వేనే చేయలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పాపం బయటకు రావటంతో ముఖ్యమంత్రికి ముచ్చెమటలు పడుతున్నాయని అన్నారు. గ్రాఫిక్స్ మాయాజాలంతో రేవంత్ అబద్దాలు చెప్పారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎంలా మారింది...
‘‘జాతీయ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ.. ఏటీఎంలా మారింది. రూ.లక్షన్నర కోట్ల స్కామ్‌ను అందరూ గమనిస్తున్నారు. మూసీ సుందరీకరణ పదం వాడిందే రేవంత్. అపరిచితుడిలా రేవంత్ మాట మారుస్తున్నారు. రూ.16,634 కోట్లతో మూసీ ప్రక్షాళనకు కేసీఆర్ ప్రభుత్వం DPR సిద్ధం చేసింది. మూసీపై ఎక్స్‌ప్రెస్ హైవేలను నిర్మించాలనుకున్నాం. మూసీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. ప్రెజెంటేషన్ పేరుతో రేవంత్ పరువు తీసుకున్నారు. చేయని సర్వేను చేసినట్టుగా అబద్ధాలు చెప్పారు. మూసీ బ్యూటిఫికేషన్ కాదు..లూటిఫికేషన్మూ. సీ సుందరీకరణ చేయాలంటే లక్షలాదిమంది నిరాశ్రయులవుతారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మూసీని సుందరీకరణ చేయాలనుకున్నాం. లక్షలాదిమంది పొట్ట కొట్టవద్దని మాజీ సీఎం కేసీఆర్ సూచించారు. ఇమ్లిమన్ బస్ స్టేషన్, మెట్రో స్టేషన్ కూడా మూసీ రివర్ బెడ్‌లోనే ఉన్నాయి. బఫర్ జోన్లో ఉన్న ప్రతి ఇంటికి ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చింది. ఒక్క పేదవాడి కడుపు కూడా కొట్టకుండా.. నాగోల్, ఉప్పల్ భగాయత్ ప్రాంతంలో మూసీని సుందరీకరించాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చొరవతోనే హైదరాబాద్ రోడ్లపై నీరు నిలవటం లేదని మాజీ మంత్రి ఈటల రాజేందర్ కూడా అన్నారు. కాళేశ్వం నీళ్లను గండిపేటకు జోడించటానికి ప్లాన్ చేశాం. మూసీని మురికి కూపంగా మార్చిన పాపం.. కాంగ్రెస్ టీడీపీ పార్టీలదే. మూసీకి పురిట్లోనే రేవంత్ రెడ్డి ఉరేసే ప్రయత్నం చేస్తున్నారు. మానవీయ కోణంలో మూసీని శుద్ది చేయాలనుకున్నాం. పేదల ఇళ్లు కొట్టాలని తాము అనుకోలేదు. ముఖ్యమంత్రి మాదిరి కాకుండా.. నల్లగొండ మంత్రులు విషయం తెలసుకుని మాట్లాడాలి’’ అని కేటీఆర్ అన్నారు.
ఇవి కూడా చదవండి..
Ani Master: జానీ మంచివారు...నిరపరాధి అని తేలితే ఏంటి పరిస్థితి
Harish Rao: సీఎం రేవంత్ వ్యాఖ్యలపై హరీష్ ఏ రేంజ్‌లో సవాల్ విసిరారంటే
Read Latest Telangana News And Telugu News
Updated Date - Oct 18 , 2024 | 05:28 PM