ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KTR: రేవంత్ ప్రభుత్వం అన్నదాతల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది.. కేటీఆర్ ధ్వజం

ABN, Publish Date - Dec 07 , 2024 | 07:59 AM

అన్నదాతల ఆత్మగౌరవాన్ని రేవంత్ ప్రభుత్వం దెబ్బతీసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను మోసం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతులను రాజులను చేశామని కేటీఆర్ అన్నారు.

హైదరాబాద్: రైతు సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతు సమస్యలు త్వరగా పరిష్కరమయ్యేయని అన్నారు. రైతు సమస్యలపై కేటీఆర్ ట్విట్టర్(ఎక్స్) వేదికగా రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.


రైతులను మోసం చేశారు..

‘‘రైతే రాజు నినాదం కాదని.. కేసీఆర్ ప్రభుత్వ విధానం. అడగకుండానే రైతుబంధు అడగకుండానే రైతుబీమా... అడగకుండానే సాగునీళ్లు.. అడగకుండానే ఉచితంగా 24 గంటల కరంట్.. అడగకుండానే 100 శాతం పంటల కొనుగోళ్లు. దశాబ్దాల కాంగ్రెస్ పాలనతో వ్యవసాయ రంగం వెన్నువిరిగి బతుకుదెరువు కోసం వలసబాట పట్టిన అన్నదాతలలో ఆత్మవిశ్వాసం నింపి వ్యవసాయం దండగ కాదు పండగ అని చాటిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది. కరోనా విపత్తులోనూ కర్షకులకు బాసటగా నిలిచిన చరిత్ర కేసీఆర్‌ది. ప్రతి ఊరికీ వెళ్లి పంటలు కొనుగోలు చేసిన ఘనత కేసీఆర్‌ది. రైతుబంధును రాజకీయం చేసి రైతుభరోసా అంటూ భ్రమలు కల్పించి.. రైతుభీమాను మాయం చేసి 24 గంటల ఉచిత విద్యుత్తును ప్రశ్నార్థకం చేసి పంటల కొనుగోళ్లకు పాతరవేసి సాగునీళ్లను సాగనంపి అన్నదాతల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి రైతును రహదారుల పైకి లాగిన మీరా.. రైతుల గురించి మాట్లాడేది. రైతుభరోసాకు ఎగనామం పెట్టి రుణమాఫీ పేరుతో కనికట్టు చేసినా మీరా .. రైతుల గురించి మాట్లాడేది. ఇల్లిల్లూ తిరిగి అబద్దపు హామీలు ఇచ్చి నాడు ఓట్లు అడుక్కున్న చరిత్ర మీది. అధికారం దక్కాక ఇల్లిల్లూ తిరిగి ఎమ్మెల్యేలను అడుక్కుని, కొనుక్కున్న చరిత్ర మీది. రైతులు ఎప్పుడూ .. ఆశపడతారు తప్ప అడుక్కోరు.సమయం రాక పోదు.. మీకు గుణపాఠం చెప్పక పోరు. జాగో తెలంగాణ జాగో’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.


కాంగ్రెస్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ షార్ట్ ఫిలిం

కాంగ్రెస్ ఏడాది పాలనపై ప్రతిపక్ష బీఆర్ఎస్ షార్ట్ ఫిలిం రూపొందించింది. కాంగ్రెస్ ఏడాది పాలనలో అన్ని వర్గాలు మోసపోయాయరని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షార్ట్ ఫిలిం రూపంలో రేవంత్ ప్రాలన గురించి ప్రజలకు వివరించాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. కేటీఆర్ ఆధ్వర్యంలో ఉదయం 11గంటలకు తెలంగాణ భవన్‌లో నమ్మి నానబోస్తే షార్ట్ ఫిలిం ప్రదర్శించనున్నారు. నమ్మి నానబోస్తే షార్ట్ ఫిలింను రసమయు బాలకిషన్ రూపొందించారు.

Updated Date - Dec 07 , 2024 | 07:59 AM