ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KTR: రైతుల ఆత్మహత్యలకు గాంధీ ఫ్యామిలీదే బాధ్యత: కేటీఆర్..

ABN, Publish Date - Oct 27 , 2024 | 11:00 AM

తెలంగాణ పోలీస్ శాఖలో పని చేస్తున్న 39మంది తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) సిబ్బందిని కాంగ్రెస్ ప్రభుత్వం సస్పెండ్ చేయడాన్ని మాజీ మంత్రి కేటీఆర్ ఖండించారు. పని భారం గురించి ప్రశ్నించిన పోలీస్ సిబ్బందిపై వేటు వేయడాన్ని ఆయన తప్పుబట్టారు.

హైదరాబాద్: ప్రశాంతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అశాంతిని రగిల్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తుగ్లక్ నిర్ణయాల వల్ల రాష్ట్రం అదోగతి పాలవుతోందని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనాలోచిత విధానాలతో రైతులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. రుణమాఫీ చేశామని అధికార పార్టీ నేతలు చెబుతున్నారని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా రైతు ఆత్మహత్యలు, ప్రభుత్వ ఉద్యోగుల సస్పెన్షన్‌పై ట్విటర్ వేదికగా కేటీఆర్ విమర్శలు గుప్పించారు.


సస్పెండ్ చేస్తారా?

తెలంగాణ పోలీస్ శాఖలో పని చేస్తున్న 39మంది తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) సిబ్బందిని కాంగ్రెస్ ప్రభుత్వం సస్పెండ్ చేయడాన్ని కేటీఆర్ ఖండించారు. పని భారం గురించి ప్రశ్నించిన పోలీస్ సిబ్బందిపై వేటు వేయడాన్ని ఆయన తప్పుబట్టారు. సమస్యలు ఉన్నాయని చెప్పే వారిని క్రమశిక్షణ చర్యల పేరుతో సస్పెండ్ చేయడం ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు. అలాగే ఒకే రోజు 165 మంది వ్యవసాయ విస్తరణ అధికారుల(ఏఈవో)ను తాత్కాలికంగా విధుల నుంచి తొలగించడంపై కేటీఆర్ ధ్వజమెత్తారు. వ్యవసాయశాఖ, రాష్ట్ర ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోందంటూ విమర్శలు గుప్పించారు. డిజిటల్ క్రాప్ సర్వే చేయని అధికారులను రైతు బీమాలో నిర్లక్ష్యం వహించారంటూ సస్పెండ్ చేయడాన్ని తప్పుబట్టారు. ఏఈవోల నిరసనకు సంబంధించిన పేపర్ క్లిప్పింగులకు కేటీఆర్ తన ట్వీట్‌కు జత చేశారు. ఎలా ఉన్న తెలంగాణ ఎలా అయిపోందంటూ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.


దేవుడిపై ఒట్లు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ సంపూర్ణ రైతు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ నేతలు దేవుడిపై ఒట్లు వేశారని, ఇప్పుడు రైతులకు తిప్పలు తప్పడం లేదని కేటీఆర్ మరో ట్వీట్ చేశారు. కాంగ్రెస్ వచ్చి మార్పు తెచ్చిందంటే ఏమో అనుకున్నామని, రైతుల చేతుల్లోకి పురుగుల మందు డబ్బా తెచ్చిపెట్టిందని ఆయన ధ్వజమెత్తారు. రైతు రుణమాఫీ అందకపోవడంతో సంగారెడ్డి జిల్లా కొమురవెల్లి మండలం మర్రిముచ్చా గ్రామానికి చెందిన రైతు మహేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని కేటీఆర్ ఆరోపించారు. ఈ మేరకు దానికి సంబంధించిన వార్తా పత్రిక క్లిప్పింగును తన ట్వీట్‌కు జత చేశారు.


మీదే బాధ్యత..

తెలంగాణలో రైతు బంధు రాలేదు, రుణమాఫీ కాలేదు, బక్కచిక్కిన రైతు పరిస్థితి ఏమాత్రం బాగోలేదని కేటీఆర్ అన్నారు. దీనికి కారణం అబద్ధాలతో అధికారం చేపట్టిన సీఎం రేవంత్ సర్కార్ కాదా? అని ప్రశ్నించారు. ఎంతమంది రైతుల ఉసురు తీసుకుంటారు, ఇంకెంతమంది రైతుల చేతుల్లో పురుగుల మంది డబ్బా పెడుతారని మండిపడ్డారు. రైతులకు అభయం ఇచ్చేందుకు వెళ్తే అరెస్టులు చేసేందుకు మంత్రుల ఆదేశాలు ఇస్తున్నారని, ఇదేనా ప్రజా ప్రభుత్వం అంటే అని ధ్వజమెత్తారు. ఏమైంది మీ రైతు డిక్లరేషన్ రాహుల్ గాంధీ గారు.. అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఆరు గ్యారంటీలకు పూచి మాది అని చెప్పిన గాంధీ ఫ్యామిలీయే రైతుల చావులకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇది ఆత్మహత్య కాదు.. కాంగ్రెస్ సర్కార్ చేసిన హత్య అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు.

ఈ వార్తలు కూాడా చదవండి:

Hyderabad: ఘోరం.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య..

Hyderabad Police: హైదరాబాద్‌వాసులకు బిగ్ షాక్.. టపాసులు కాల్చడంపై నిషేధం

Updated Date - Oct 27 , 2024 | 11:01 AM