ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KTR: కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని అస్తవ్యస్తం చేసింది: ఎమ్మెల్యే కేటీఆర్..

ABN, Publish Date - Aug 31 , 2024 | 02:26 PM

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని కాంగ్రెస్ సర్కార్ అస్తవ్యస్తం చేసిందని బీఆర్ఎస్ మాజీ మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక విద్యార్థులు లేరంటూ 1,864 ప్రభుత్వ పాఠశాలలు మూసేసే కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) చెప్పారు. పేద, మధ్య తరగతి విద్యార్థులను విద్యకు దూరం చేసే కుట్ర జరుగుతోందని ఆయన అన్నారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని కాంగ్రెస్ సర్కార్ అస్తవ్యస్తం చేసిందని బీఆర్ఎస్ మాజీ మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక విద్యార్థులు లేరంటూ 1,864 ప్రభుత్వ పాఠశాలలు మూసేసే కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) చెప్పారు. పేద, మధ్య తరగతి విద్యార్థులను విద్యకు దూరం చేసే కుట్ర జరుగుతోందని ఆయన అన్నారు.


విద్యాశాఖ మంత్రిని నియమించాలి..

ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల నియామకం, మౌలిక వసతుల కల్పన, నాణ్యమైన ఆహారం అందించటంలో సీఎం రేవంత్ రెడ్డి విఫలమయ్యారని కేటీఆర్ విమర్శించారు. ప్రమాదం అంచున ప్రభుత్వ విద్య ఉందని చెప్పుకొచ్చారు. ఇలాంటి పరిస్థితులు మంచివి కావని హితవుపలికారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని నియమించాలని, ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు విద్యావేత్తలు, మంత్రులతో కమిటీ ఏర్పాటు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.


పేదలు చదువుతున్నారనే నిర్లక్ష్యం..

తెలంగాణలో గురుకుల పాఠశాల వ్యవస్థను కనుమరుగు చేసే కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. గురుకుల పాఠశాలల్లో ఇప్పటివరకు 34మంది విద్యార్థులు చనిపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డారు. పేదపిల్లలు చనిపోతే కాంగ్రెస్ సర్కార్‌కు పట్టింపే లేదని ధ్వజమెత్తారు. పాలమాకులలో పిల్లలు కారం తిండి తినలేక రోడ్డెక్కారని మండిపడ్డారు. ఇలాంటి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని, గురుకులాల్లో మౌలిక సదుపాయాలపై రివ్యూ చేయాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. గురుకులాల్లో నాణ్యమైన తిండి పెట్టడం లేదని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పిల్లలు చదువుతున్నారనే నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహించారు. సీఎం రేవంత్ రెడ్డి బడాయి మాటలు చెప్పడం తప్ప చేతలు మాత్రం లేవని ధ్వజమెత్తారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Red Alert: తెలంగాణ రాష్ట్రానికి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ..

HYDRA: బీజేపీ కార్పొరేటర్ అక్రమ నిర్మాణాలు కూల్చివేత.. ఉద్రిక్త వాతావరణం..

TG Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై నేడు రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ భేటీ..

Road Accident: బంజారాహిల్స్ రోడ్ నంబర్-2లో కారు బీభత్సం..

Updated Date - Aug 31 , 2024 | 02:30 PM

Advertising
Advertising